టీడీపీ కూటమి మ్యానిఫేస్టోకు బీజేపీ మార్క్ షాక్ !

ఏపీ అప్పుల కుప్ప అని శ్రీలంక అవుతుందని ఒక వైపు నిన్నటిదాకా విమర్శలు చేసిన టీడీపీ ఇపుడు జగన్ పధకాలకు రెట్టింపు అని ఇబ్బడి ముబ్బడి హామీలతో జనంలోకి వచ్చింది.

Update: 2024-05-04 18:14 GMT

అలవి కాని హామీలతో మ్యానిఫేస్టోని టీడీపీ పెద్దలు నింపేశారు అని ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. ఏపీ అప్పుల కుప్ప అని శ్రీలంక అవుతుందని ఒక వైపు నిన్నటిదాకా విమర్శలు చేసిన టీడీపీ ఇపుడు జగన్ పధకాలకు రెట్టింపు అని ఇబ్బడి ముబ్బడి హామీలతో జనంలోకి వచ్చింది. టీడీపీ మ్యానిఫేస్టోని ఉమ్మడి కూటమిది గా పేర్కొంది.

నిజానికి అందులోని హామీలు అన్నీ టీడీపీవే అని అంటున్నారు. జనసేనను కలుపుకున్నా ఆ పార్టీ ఇచ్చిన హామీలు ఆ పార్టీ ప్రమేయం కూడా అందులో పెద్దగా లేదు అని అంటున్నారు. ఇక అధికారమే పరమావధిగా చేసుకుని హామీలు టీడీపీ గుప్పించడం మీద బీజేపీ గుర్రు మీద ఉంది. గత నెల 30న టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లి నివాసంలో ఉమ్మడి ఎన్నికల మ్యానిఫేస్టో అని రిలీజ్ చేసిన దానికి బీజేపీ ఏపీ ఇంచార్జ్ గా సిద్ధార్ధ నాధ్ సింగ్ హాజరైనా మ్యానిఫేస్టో కాపీ మీద చేయి పెట్టలేదు. అందులో మేమూ ఉన్నామని హామీ ఇవ్వలేదు.

అది అతి పెద్ద చర్చగా మారింది. దానికి తోడు కూటమి మ్యానిఫేస్టో మీద మోడీ బొమ్మ కనిపించకపోవడం కూడా పెద్ద రచ్చకు దారి తీసింది. అప్పుల కుప్ప అయిన ఏపీకి కేంద్రం సాయం చేయకపోతే ఈ మ్యానిఫేస్టోలో ఒక్క దానిని కూడా చంద్రబాబు అమలు చేయలేరు అని కూడా విమర్శలు వచ్చాయి.

ఇపుడు దానికి మరింత పదును పెట్టేలా పొగాకు బోర్డు మాజీ చైర్మన్ యడ్లపాటి రఘునాధ బాబు అయితే టీడీపీకి గట్టి షాక్ ఇచ్చేశారు. అవి టీడీపీ హామీలే మాకు సంబంధం లేదు అన్నట్లుగా ఆయన మాట్లాడారు. టీడీపీ ఇచ్చే హామీలకు బీజేపీ గ్యారంటీ ఇవ్వదని కూడా స్పష్టం చేశారు.

Read more!

పైగా ఇపుడు జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పధకాల మీదనే విమశలు చేస్తున్నామని, వాటి అమలు సాధ్యం కాదని అప్పుల కుప్పగా ఏపీ అవుతుందని చెబుతూ మరో వైపు దాని కంటే ఎక్కువ హామీలతో వస్తే ఎలా అని లాజిక్ పాయింట్ నే ఆయన తీశారు. బీజేపీకి ఉన్న విశ్వసనీయతను కోల్పోవడం ఇష్టం లేకనే ఈ మ్యానిఫేస్టోకి బీజేపీ దూరంగా ఉందని అసలు విషయం ఆయన చెప్పేశారు.

పైగా అవన్నీ కాంగ్రెస్ మార్క్ హామీలు అని టీడీపీ గాలి తీసేశారు. ఎక్కడో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అన్నీ ఏర్చి కూర్చి చంద్రబాబు తన మ్యానిఫేస్టోలో పెట్టారన్నట్లుగా రఘునాధబాబు మాటలు ఉన్నాయని అంటున్నారు. మరో వైపు చూస్తే కనుక ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నదే కూటమి కామన్ అజెండా తప్ప మిగిలిన వాటితో సంబంధం లేదు అన్నట్లుగానే ఆయన మాట్లాడడం విశేషం.

మొత్తం మీద చూస్తే ఈ సీనియర్ బీజేపీ నేత ఇచ్చిన క్లారిటీ టీడీపీ జనసేనలకు వారిచ్చే హామీలకు గట్టి షాక్ అని అంటున్నారు. రేపటి రోజున టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తే సొంతంగా వీటిని అమలు చేయగలదా లేదా అని చూసుకునే జనాలు ఓట్లు వేస్తారని అంటున్నారు.

Tags:    

Similar News