• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబు మహానాడుకు జగన్...

బాబు మహానాడుకు జగన్ రిటర్న్ గిఫ్ట్ అదేనా ?

| పార్టీ పుట్టినప్పటి నుంచి టీడీపీలోనే ఉన్న సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించి టీడీపీకి షాక్ ఇచ్చారు.

By - Tupaki Desk
Update: 2025-06-08 04:30 GMT

కడపలో చాలా ఘనంగా మూడు రోజుల పాటు జరిగింది. ఎటు చూసినా పసుపు రెపరెపలతో సందడి చేసింది. ఇంకేముంది పులివెందులలో కూడా జగన్ ఓటమి ఖాయమని ఇదే ఉత్సాహంతో చంద్రబాబు సహా నేతలు అంతా అనేశారు. వైసీపీకి ఏమీ బలం లేదని తేల్చేశారు.

అయితే మహానాడు జరిగిన పది రోజుల తేడాలో అదే కడప జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పార్టీ పుట్టినప్పటి నుంచి టీడీపీలోనే ఉన్న సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించి టీడీపీకి షాక్ ఇచ్చారు.

ఆయన కేవలం రెండు లైన్లలో తన రాజీనామా లేఖ రాసి బాబుకు పంపించారు. అందులో ప్రజలు అనుచరుల మనోభావాలను గౌరవిస్తూ ఈ విధంగా నిర్ణయం తీసుకుంటున్నట్లుగా చెప్పడం విశేషం. కూటమి పాలనకు ఏడాది పూర్తి అవుతున్న నేపధ్యంలో బలమైన నేత పార్టీకి రాజీనామా చేయడం గ్రౌండ్ లెవెల్ లో మారుతున్న పరిణామాలకు సంకేతమా అన్న చర్చ అయితే సాగుతోంది.

ఇక రాజంపేటలో 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్ధిగా సుగవాసి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. తన ఓటమికి సొంత పార్టీ వారే కారణం అని వైసీపీ నేతలతో చేతులు కలిపి తనను ఓడించారు అని సుగవాసి గతంలో ఆరోపించారు. ఆ మీదట ఆయన సొంత పార్టీ వారి మీద వారి దందాల మీద అధినాయకత్వానికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. చివరికి విసిగి వేసారి రాజీనామా చేశారు అని అంటున్నారు.

ఆయన రాజీనామా వెనక వైసీపీ ఉందని ప్రచారం సాగుతోంది. ఇదంతా రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి స్కెచ్ అని అంటున్నారు. ఇక కడపలో వైసీపీని పూర్తిగా బలోపేతం చేసే చర్యలలో భాగంగానే సుగవాసిని తొందరలో వైసీపీలోకి తెస్తారు అని కూడా అంటున్నారు. అంతే కాదు టీడీపీ బలంగా ఉంది వైసీపీ పని అయిపోయింది అని పసుపు పార్టీ నేతలు చేస్తున్న ప్రచారానికి ఇది కౌంటర్ ఎటాక్ అంటున్నారు. కడపలో బాబు జరిపిన మహానాడుకు జగన్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు.

తన ఇంట్లో సైకిల్, తన ఇంటి మీద పసుపు జెండా తన ఒంట్లో టీడీపీ మీద భక్తిని నిండుగా నింపుకున్న సుగవాసి లాంటి సీనియర్ నేత పార్టీకి రాజీనామా చేయడం అంటే బిగ్ షాక్ టీడీపీకి అని అంటున్నారు. అంతే కాదు సీమలో టీడీపీలో వర్గ పోరు చాలా చోట్ల ఉందని దాంతో మరింత మంది మీద వైసీపీ కన్నేసిందని దాని ఫలితాలు కూడా తొందరలో ఉంటాయని చెబుతున్నారు.

మొత్తానికి కడప తన అడ్డా అని వైసీపీ మరోసారి చెబుతోంది. ఎన్నికల్లో గెలుపోటములు పక్కన పెడితే మొత్తం రాయలసీమ వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ అన్నది తొందరలోనే మరోసారి అధికార కూటమిని గట్టిగా నిరూపించే పనిలో వైసీపీ బిజీగా ఉందని అంటున్నారు. చూడాలి మరి సీమ నుంచి మొదలైన ఈ పొలిటికల్ వార్ లో ఎన్ని ట్విస్టులు ఉంటాయో ఏమిటో.

Tags:    
  • KadapaPolitics 
  • TDP 
  • YSRCP 
  • SugavasiBalasubramanyam 
  • Rayalaseema 
  • Mahanadu2025 
  • AndhraPradeshNews 

Similar News

ఎమ్మెల్యే విందు.. గాల్లో ఎగిరిన ప్లేట్లు.. కరెంట్ టవర్లపై వేలాడిన మనుషులు..

2026-11-26 10:20 GMT

టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి భారీ మొత్తం.. గ్రూప్ ఇన్సూరెన్స్ కే 191 శాతం నిధులు!

2026-11-26 10:19 GMT

ఫిట్‌గా ఉంటేనే లిక్కర్.. వైన్ షాపు ముందు మెడికల్ క్యాంప్.. మందుబాబులకు ఊహించని షాక్

2026-11-26 10:17 GMT

యూపీలో ఇండి కూటమికి అసలు పరీక్ష: 130 సీట్లపై కాంగ్రెస్ పట్టు.. గెలుపు గుర్రాలకే టికెట్లంటున్న అఖిలేశ్!

2026-11-26 10:14 GMT

తిరుమలేశుడికి 121 కేజీల బంగారం ఇచ్చింది ఎవరో తెలుసా? ఎందుకిచ్చాడంటే?

2026-11-26 09:03 GMT

జగన్ దూరం.. విజయమ్మ ఆశీస్సులతో ముగిసిన అంజలీ రెడ్డి వివాహం!

2026-11-26 09:00 GMT

చిన్నారులకు కడుపునొప్పి వస్తే వాతలా? ప్రాణాలకే ముప్పు తెచ్చే మూఢనమ్మకాలు!

2026-11-26 08:58 GMT

కూటమిలో జనసేన పంచాయితీ.. సేనాని పవర్ ఫుల్ వ్యూహమేనా?

2026-11-26 08:57 GMT

ఇరాన్‌తో మళ్లీ యుద్ధం తప్పదా?.. ఇజ్రాయెల్ జ్యోతిష్యుల సంచలన అంచనాలు!

2026-11-26 08:55 GMT

అమెరికా పిల్లలకు SpaceX షేర్లు ఇవ్వనున్న ఎలాన్ మస్క్.. ఎప్పటి నుంచి అంటే?

2026-11-26 08:52 GMT

చేతిలో డిగ్రీలు.. ఉద్యోగం కోసం రోడ్లపై.. బీటెక్ బతుకులు దుర్భరం.. ఇంటర్వ్యూ కోసం కిలోమీటర్ల క్యూ

2026-11-26 08:51 GMT

అంతరిక్షాన్ని ఆక్రమించేస్తున్నావా మస్క్ మావా..

2026-11-26 08:44 GMT

Copyright @2026

Powered by Blink CMS