నిను వీడని నీడను నేను... బాబుపై సాయిరెడ్డి ట్రోలింగ్ స్టార్ట్!

ఈ నెంబర్ పేరు చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబుని వైసీపీ శ్రేణులు చేసిన ట్రోలింగ్ వైరల్ అయ్యింది.

Update: 2024-05-17 08:04 GMT

2019 ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీ రాజకీయాల్లో "23" నెంబర్ ఎంత ఫేమస్ అయ్యిందనేది తెలిసిన విషయమే. ఈ నెంబర్ పేరు చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబుని వైసీపీ శ్రేణులు చేసిన ట్రోలింగ్ వైరల్ అయ్యింది. ఆఖరికి స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు కేటాయించబడిన నెంబర్ 7691 టోటల్ కూడా 23 అంటూ వెంటాడిన పరిస్థితి!

ఈ సమయంలో.. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈసారి భారీ ఎత్తున పోలింగ్ జరిగిందని.. సుమారు గడిచిన 40 సంవత్సరాల్లో ఈ స్థాయిలో పోలింగ్ జరగలేదని అంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఈసారి నమోదైన తుది పోలింగ్ శాతం 81.86గా ఈసీ తాజాగా ప్రకటించింది. దీంతో మరోసాయి విజయసాయి రెడ్డి లైన్ లోకి వచ్చారు. నినువీడని నీడను నేను అంటూ సోషల్ మీడియాలో స్పందించారు.

ఇందులో ఉన్న నాలుగు సంఖ్యలు 8186 ని కలిపితే 23 అవుతుంది.. గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 23.. అంతకు ముందు వైసీపీ నుంచి టీడీపీ లాక్కున్న ఎమ్మెల్యేల సంఖ్య కూడా 23.. అనే అంశాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ... ఇప్పుడు పోలింగ్ శాతంలో నంబర్లు అన్నీ కలిపితే 23 రావడంతో విజయసాయిరెడ్డి గట్టిగా తగులుకున్నారు.

అవును... రాష్ట్రంలో పోలింగ్ శాతంపై ఎన్నికల కమిషన్ చేసిన ప్రకటనలో పేర్కొన్న గణాంకాలను పోస్టు రూపంలో ప్రస్తావిస్తూ.. మరోవైపు చంద్రబాబు ఫొటో పెట్టి పోలింగ్ శాతంలో నంబర్లన్నీ కూడితే 23 నంబర్ వస్తుందని చూపిస్తూ.. విజయసాయిరెడ్డి ఓ పోస్టు పెట్టారు. వాస్తవానికి ఇప్పటికే వైసీపీ నాయకులు ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు సాయిరెడ్డి కూడా పండగ చేసుకుంటున్నారు.

Tags:    

Similar News