ఏపీలో ఎన్డీయే “కూటమి మ్యానిఫెస్టో” విడుదల... కీలక హామీలివే!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచార కార్యక్రమాలు హోరెత్తి పోతున్న సంగతి తెలిసిందే

Update: 2024-04-30 10:45 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచార కార్యక్రమాలు హోరెత్తి పోతున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో... ఇప్పటికే అధికార వైసీపీ మేనిఫెస్టో కూడా విడుదలయ్యింది. ఈ సమయంలో తాజాగా టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదలయ్యింది. ఈ మేరకు ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించారు.

ఈ క్రమంలో... టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర ఇన్‌ ఛార్జ్‌ సిద్ధార్థ్‌ నాథ్‌ సింగ్‌ లతోపాటు ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. "ఏపీ ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం.. రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం.." అనే నినాదంతో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేశారు.

మేనిఫెస్టోలోని కొన్ని కీలక అంశాలు...:

* మెగా డీఎస్సీపై మొదటి సంతకం.

* మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.

* ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం.

* 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500.

* నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి.

* దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు!

* బీసీలకు 50 ఏళ్లకే పింఛను

* వాలంటీర్ల గౌరవవేతనం రూ.10 వేలకు పెంపు

* యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.

Read more!

* ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్‌.

* రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం.

* ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌.

* ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్ల ఇంటి స్థలం.

* బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం.

* పండుగ కానుకలు మళ్లీ ప్రారంభం.

* నాణ్యతలేని మద్యాన్ని అరికట్టి, ధరల నియంత్రణ.

* ఆలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మాణులకు నెలకు రూ.25వేలు గౌరవేతనం.. అలాగే వారి షాపులకు 200 యూనిట్ల వరకు ఉచితం.

* మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20వేలు ఆర్థిక సాయం.. బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం.

* స్వర్ణకారులకు ప్రత్యేకంగా కార్పొరేషన్.

* డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు.

* చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు.

* రాజధానిగా అమరావతి కొనసాగింపు.

Tags:    

Similar News