• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మార్చి 1న సునీత విలియమ్స్...

మార్చి 1న సునీత విలియమ్స్ కు మోడీ రాసిన లేఖ ఇదే!

| ఈ సమయంలో ఆమెకు ప్రధాని నరేంద్ర మోడీ రాసిన లేఖను కేంద్రమంత్రి ఎక్స్ లో పంచుకున్నారు.

By - Tupaki Desk
Update: 2025-03-19 03:38 GMT

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐ.ఎస్.ఎస్.)లో తొమ్మిది నెలలకు పైగ చిక్కుకుపోయిన తర్వాత.. తన సహచరుడు బుచ్ విల్మోర్ తో కలిసి బుధవారం తెల్లవారుజామున భూమికి క్షేమంగా వచ్చారు భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్. ఈ సమయంలో ఆమెకు ప్రధాని నరేంద్ర మోడీ రాసిన లేఖను కేంద్రమంత్రి ఎక్స్ లో పంచుకున్నారు.

అవును... ఐ.ఎస్.ఎస్.లో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ తిరిగి భూమికి చేరుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ సమయంలో.. మార్చి 1న భారత ప్రధాని నరేంద్ర మోడీ రాసిన లేఖను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తాజాగా ఎక్స్ లో పంచుకున్నారు. ఆమె సుమారు 17 గంటల ప్రయాణం తర్వాత ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో ఈ లేఖ బహిరంగంగా విడుదలైంది.

ఈ సందర్భంగా... ఢిల్లీలో మాజీ వ్యోమగామి మైక్ మాసిమినోతో జరిగిన సమావేశంలో ఆమె పేరు తమ సంభాషణలో ప్రస్తావనకు వచ్చిందని ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. మీ పట్ల, మీ పని పట్ల తాము ఎంత గర్వపడుతున్నామో చర్చించుకున్నామని.. ఈ సంభాషణ తర్వాత తాను మీకు వ్రాయకుండా ఉండలేకపోయానని ప్రధాని మోడీ అన్నారు.

1.4 బిలియన్ల భారతీయులు మీ విజయాలను ఎల్లప్పుడూ గొప్పగా గర్విస్తున్నారని.. తాజా పరిణామాలు మీ ధైర్యం, పట్టుదలను మరోసారి ప్రదర్శించాయని.. ఇవి ఎంతో స్ఫూర్తిదాయకమైనవని ప్రధాని రాశారు. ఆమె తల్లి బోనీ పాండ్యా కూడా ఆమె తిరిగి రావడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అన్నారు.

ఇదే సమయంలో.. దివంగత దీపక్ భాయ్ ఆశీస్సులు కూడా మీతో ఉంటాయని తాను ఖచ్చితంగా అనుకుంటున్నాను అంటూ ప్రధాని తన సొంత రాష్ట్రం గుజరాత్ నివాసి అయిన సునీత తండ్రి దీపక్ పాండ్యాను ప్రస్తావిస్తూ అన్నారు. కాగా.. సునీత తండ్రి దీపక్ పాండ్యా 2020లో మరణించారు.

ఈ సందర్భంగా... మీరు వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ మా హృదయాలకు దగ్గరగా ఉన్నారని.. భారత ప్రజలు మీ ఆరోగ్యం, మిషన్ లో విజయం కోసం ప్రార్థిస్తున్నారని.. మీరు తిరిగి వచ్చిన తర్వాత భారత్ లో మిమ్మల్ని చూడటానికి ఎదురు చూస్తున్నామని.. భారతదేశ అత్యంత ప్రసిద్ధ కుమార్తెలలో ఒకరికి ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉంటుందని ప్రధాని రాశారు.

As the whole world waits, with abated breath, for the safe return of Sunita Williams, this is how PM Sh @narendramodi expressed his concern for this daughter of India.“Even though you are thousands of miles away, you remain close to our hearts,” says PM Sh Narendra Modi’s… pic.twitter.com/MpsEyxAOU9

— Dr Jitendra Singh (@DrJitendraSingh) March 18, 2025
Tags:    
  • SunitaWilliams 
  • PMModi 
  • SpaceMission 
  • NASA 
  • ProudIndian 
  • ISSMission 
  • AstronautLife 
  • Inspiration 
  • SpaceExploration 
  • IndiaProud 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS