• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  లోకేష్ కి కనెక్ట్...

లోకేష్ కి కనెక్ట్ అవుతున్న సీనియర్లు

| ఆ సమయంలో ఆయన విషయంలో సీనియర్లు కొంత లైట్ తీసుకునే వారు అన్న ప్రచారం ఉండేది.

By - Tupaki Desk
Update: 2025-01-06 04:23 GMT

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి అయిన నారా లోకేష్ అంటే ఒకపుడు సీనియర్లు ఎందుకో దూరం పాటించేవారు. 2014 నుంచి 2019 మధ్యలో లోకేష్ కొంతకాలం మంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలో ఆయన విషయంలో సీనియర్లు కొంత లైట్ తీసుకునే వారు అన్న ప్రచారం ఉండేది.

తాము సుదీర్ఘ కాలం రాజకీయంగా అనుభవం సాధించామని చంద్రబాబుకే తప్ప ఎవరికీ జవాబుదారీ కాదు అన్న ఆలోచనలో నాడు కొంతమంది సీనియర్లు ఉండేవారు అని చెబుతారు. ఆనాడు లోకేష్ రెండేళ్ల పాటు మంత్రిగా ఉన్నారు.

లోకేష్ కి కూడా అప్పట్లో పాలనాపరమైన అనుభవం తక్కువగా ఉండడంతో ఆయన ఎలా నెగ్గుకు రాగలరు అని భావించేవారు. అయితే లోకేష్ టీడీపీ ఓడాక రాటుతేలారు. రాజకీయంగా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు.

అయితే విపక్షంలోకి టీడీపీ వచ్చిన మొదటి రెండేళ్లలోనూ లోకేష్ మీద సీనియర్లు పరోక్ష కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. పార్టీ లేదు ఏమీ లేదు అని ఒక సీనియర్ నాయకుడు మాట్లాడిన మాటలు అప్పట్లో వైరల్ అయ్యాయి. లోకేష్ మీదనే ఆయన ఈ కామెంట్స్ చేశారు అని కూడా చెప్పుకున్నారు.

ఇపుడు అదే సీనియర్ నాయకుడితో సహా చాలా మంది లోకేష్ తో కనిపిస్తున్నారు. లోకేష్ నాయకత్వం వద్దు అని పార్టీలు మారిన వారు కూడా ఇపుడు కూటమి మిత్రపక్ష పార్టీలలో ఎమ్మెల్యేలుగా ఉంటూ లోకేష్ ని కలుస్తున్నారు అంటే ఆయన ప్రాభవం ఎలా ఉందో అర్ధం చేసుకోవాల్సిందే అంటున్నారు.

ఇక యువగళం పాదయాత్ర తరువాత పార్టీలో లోకేష్ ఇమేజ్ మారింది. అంతే కాదు పార్టీ మీద పట్టు పెరిగింది. ఎన్నికల్లో ఆయన టికెట్ల పంపిణీ విషయంలో ఈసారి చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు ఫలితంగా చాలా మంది కొత్త వారికి టికెట్లు దక్కాయి. అంతే కాదు మంత్రివర్గం కూర్పులో కూడా ఆయన మార్క్ ఉందని అంటారు. ఇక నామినేటెడ్ పోస్టులతో పాటు ఇటీవల రాజ్యసభకు టీడీపీ అభ్యర్ధి ఎంపిక విషయంలోనూ లోకేష్ తన ముద్ర ఉండేలా చూసుకుంటున్నారు

దాంతో లోకేష్ పట్ల సీనియర్ల ఆలోచనలు మారుతున్నాయి. లోకేష్ తోనే ఉండేందుకు ఆయన కనుసన్నలలో పడేందుకు చాలా మంది ప్రయత్నిస్తునారు. ఆయనకు దగ్గరగా ఉంటే తమకు మరింత మేలు జరుగుతుందని భావించే వారు కూడా ఉన్నారు. ఒకవేళ సీనియర్లుగా తమకు టికెట్లు వచ్చే ఎన్నికల్లో దక్కకపోయినా వారసులకు టికెట్లు దక్కుతాయన్న ఉద్దేశ్యంతో కూడా లోకేష్ తో ఉంటున్నారు.

మొత్తం మీద చూస్తే టీడీపీలో లోకేష్ ప్రాధాన్యత అమాంతం పెరిగిపోతూ వస్తోంది. అధినేత చంద్రబాబు సైతం లోకేష్ ని ఫోకస్ చేసేందుకు చూస్తున్నారు అని అంటున్నారు. రానున్న కాలంలో టీడీపీని నడిపించాల్సింది లోకేష్ కాబట్టి ఆయనకు అన్ని విషయాలు అర్థం కావాలని బాబు ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు అని అంటున్నారు. దీంతో తెలియకుండానే సీనియర్లు కూడా లోకేష్ కి కనెక్ట్ అవుతున్నారు. మరో వైపు జూనియర్లు ఎటూ లోకేష్ వైపు ఉంటున్నారు. దీంతో టీడీపీ వరకూ చూస్తే లోకేష్ బలమైన ఫ్యూచర్ లీడర్ గా కనిపిస్తున్నారు.

Tags:    
  • Tdp 
  • Jsp 
  • Bjp 
  • Congressparty. 
  • Ycp 
  • Jaganmohanreddy 
  • Chandrababu 
  • Apcm 
  • Naralokesh 
  • Minister 
  • Tdpleaders 
  • Appolitics 
  • Cabinet 

Similar News

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

అది పాస్‌పోర్ట్ బుక్ లేదా ఫోన్ డైరీనా.. రెన్యూవల్ ఆఫీసర్ కి షాక్ ఇచ్చిన వ్యక్తి!

2026-11-03 06:04 GMT

Copyright @2026

Powered by Blink CMS