• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో...

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

| ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.

By - A.N.Kumar
Update: 2026-11-03 08:54 GMT

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొదటి నుంచీ కూటమి అభ్యర్థులే స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ట్రెండ్స్ పరిశీలిస్తే టీడీపీ ఓట్ల సునామీ సృష్టిస్తుండగా.. జనసేన సైతం పలు కీలక ప్రాంతాల్లో సాధిస్తున్న విజయాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఈ ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి.

ప్రధాన నగరాల్లోని మేయర్ స్థానాల్లో కూటమి నాయకులు భారీ ఆధిక్యంలో ముందుకు సాగుతున్నారు. విశాఖపట్నంలో కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి, గుంటూరులో కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, విజయనగరంలో అవనాపు భార్గవి, చిత్తూరులో కఠారి హేమలత, కర్నూలులో విజయ ప్రత్యూష స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏలూరులో జనసేన మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు కూడా ముందంజలో ఉన్నారు. విజయవాడ కార్పొరేషన్‌లో తీవ్ర ఉత్కంఠ మధ్య సాగుతున్న లెక్కింపులో కూటమి అభ్యర్థి వంగవీటి రాధా మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు రెండో స్థానంలో.. వైసీపీ అభ్యర్థి మూడో స్థానంలోకి నెట్టబడడం సంచలనమైంది..

మున్సిపాలిటీల్లోనూ టీడీపీ-జనసేన హవా స్పష్టంగా కనిపిస్తోంది. నర్సీపట్నం, పెనుకొండ, వెంకటగిరి, నందిగామ, పలమనేరు, జగ్గయ్యపేట, నందికొట్కూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, నూజివీడు, మార్కాపురం, ఎమ్మిగనూరు, మాచర్ల, డోన్‌, బొబ్బిలి, పెద్దాపురం, ఇచ్ఛాపురం, పలాస వంటి మెజారిటీ మున్సిపాలిటీల్లో టీడీపీ జెండా ఎగురవేసేందుకు సిద్ధంగా ఉంది. మరోవైపు అమలాపురం, మడకశిర, నరసాపురం, తిరువూరు, గొల్లప్రోలు, సామర్లకోట, తెనాలి, ముమ్మిడివరం, పిఠాపురం, చిలకలూరిపేట, పుత్తూరు, పెడన, పుట్టపర్తి ప్రాంతాల్లో జనసేన అభ్యర్థులు తమ బలాన్ని నిరూపించుకుంటూ ముందంజలో ఉన్నారు. గిద్దలూరు, ఎలమంచిలి మున్సిపాలిటీల్లో బీజేపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేశారు. జగ్గయ్యపేట 31వ వార్డు నుంచి జనసేన తరఫున పోటీ చేసిన వాసిరెడ్డి పద్మ కుమార్తె మేఘన 540 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించడం విశేషం.

ప్రభుత్వ ఉద్యోగులు కూటమి వైపే ఉన్నారని పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దాదాపు 99 శాతం మున్సిపాలిటీల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ ఘన ఆధిక్యం సాధించింది. విశాఖపట్నం, తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లలో టీడీపీ ఉద్యోగుల మద్దతుతో ముందంజ వేసింది. ఉయ్యూరు, పెడనలలో మాత్రం వైసీపీ స్వల్ప ఆధిక్యంలో నిలవగా.. తిరువూరు, మడకశిర, అమలాపురం, నరసాపురాల్లో జనసేన పోస్టల్ బ్యాలెట్లలో ముందంజ సాధించింది.

* జగన్ ఇలాకా పులివెందులలో వైసీపీకి షాక్.. కూటమి హవా

ఈ ఎన్నికల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కూటమి ప్రభంజనం సృష్టించింది. మొత్తం 40 వార్డులకు గాను 30 వార్డుల ఫలితాలు రాగా.. టీడీపీ ఏకంగా 25 వార్డులను కైవసం చేసుకుంది. వైసీపీ రెండు, బీజేపీ రెండు, జనసేన ఒక స్థానంలో గెలుపొందాయి. వైసీపీకి వైఎస్సార్ కడప జిల్లాలో కోటలాంటి పులివెందులోనే టీడీపీ ఈ స్థాయిలో గెలుపొందడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

అటు తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. జిల్లాలోని 96 వార్డులకు గానూ కేవలం నిడదవోలులోని 3 స్థానాలకే పరిమితమైంది. మండపేటలోని మొత్తం 36 వార్డులనూ కూటమి క్లీన్ స్వీప్ చేయగా.. కొవ్వూరులో 28 స్థానాలకు గానూ 27 స్థానాలను కైవసం చేసుకుంది. నిడదవోలులో జనసేన 14, టీడీపీ 13, బీజేపీ 1, వైసీపీ 3 స్థానాలు సాధించగా.. ఒక వార్డులో రీకౌంటింగ్ చేపట్టాల్సి ఉంది.

ప్రకాశం జిల్లా చీరాలలో తీవ్ర వాయుగుండం మురసు తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా ఓట్ల లెక్కింపును అధికారులు తాత్కాలికంగా వాయిదా వేశారు. స్ట్రాంగ్ రూమ్‌లలో ఉన్న బ్యాలెట్ బాక్సులకు ప్రత్యేక భద్రత కల్పించారు.

ఏపీ మున్సిపల్ ఎన్నికల ట్రెండ్స్ చూస్తుంటే కూటమికి ప్రజల్లో ఉన్న బలమైన ఆమోదం స్పష్టమవుతోంది. అధికారిక ఫలితాలు వెలువడిన తర్వాత ఈ విజయం రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని సంచలనాలకు దారితీసే అవకాశం ఉంది.

Tags:    
  • apmunicipalelections 
  • tdp 
  • janasena 
  • ysrcp 
  • andhrapradesh 

Similar News

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

అది పాస్‌పోర్ట్ బుక్ లేదా ఫోన్ డైరీనా.. రెన్యూవల్ ఆఫీసర్ కి షాక్ ఇచ్చిన వ్యక్తి!

2026-11-03 06:04 GMT

పోలింగ్ రోజు ఆందోళన.. జగన్‌కు పోలీసుల షాక్.. కేసు నమోదు

2026-11-03 05:38 GMT

Grok AI నిర్వహణ ఖర్చులు తలకుమీదకు.. ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువంటున్న ఎలాన్ మస్క్!

2026-11-03 05:38 GMT

ఈజిప్టు హైవేపై డిజిటల్ బిల్‌బోర్డ్ హ్యాక్.. అశ్లీల వీడియోలతో వాహనదారులకు షాక్!

2026-11-03 05:37 GMT

విదేశీ...స్వదేశీ : మోడీ వర్సెస్ రాహుల్ !

2026-11-03 04:12 GMT

Copyright @2026

Powered by Blink CMS