• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  విదేశీ...స్వదేశీ : మోడీ...

విదేశీ...స్వదేశీ : మోడీ వర్సెస్ రాహుల్ !

| ఇపుడు అధికార ఎన్డీయే విపక్ష ఇండియా కూటమి మధ్య విదేశీ స్వదేశీ అంటూ సరికొత్త చర్చ సాగుతోంది.

By - Satya P
Update: 2026-11-03 04:12 GMT

ఇపుడు అధికార ఎన్డీయే విపక్ష ఇండియా కూటమి మధ్య విదేశీ స్వదేశీ అంటూ సరికొత్త చర్చ సాగుతోంది. తామే అసలైన దేశ భక్తులం అని ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రత్యర్ధులు విదేశీ గానం వినిపిస్తున్నారు అని కూడా అభియోగాలు మోపుతున్నారు. ఈ చర్చకు బీజేపీ మొదట స్టార్ట్ చేసింది. గుజరాత్ లో రెండు రోజుల పర్యటన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ బహిరంగ సభలలో మాట్లాడుతూ కాంగ్రెస్ తీరుని విపక్షాల వైఖరీ పూర్తి స్థాయిలో ఎండగట్టారు, దేశ వ్యతిరేక శక్తులు అని పరోక్షంగా భారీ విమర్శలు చేశారు. దేశ అభివృద్ధికి ఆటంకంగా మారారు అని అన్నారు. ప్రభుత్వ పని తీరు మీద విమర్శలు చేస్తే సబబు కానీ విపక్షాలు ఆ బాధ్యత మరచిపోయి ప్రగతిని అడ్డుకోవడం దారుణం అని మోడీ అన్నారు. అంతే కాదు దేశ విభజన శక్తులతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు.

విదేశీ సాయంతో అంటూ :

దానికి కౌంటర్ గా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మోడీ మీద ఘాటైన విమర్శలు గుప్పించారు. విదేశీ ఫండ్స్ సాయంతో ప్రధాని అయ్యారని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. మోడీకి విదేశీ మీడియా మద్దతు ఉందని అన్నారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థను విదేశాలు నియంత్రిస్తున్నాయని కూడా రాహుల్ ఆక్షేపించారు. మోడీ ఈ రోజుకీ విదేశీ సాయంతోనే ప్రధానిగా కొనసాగుతున్నారు అని కూడా నిందించారు. అంతే కాదు తాను చేసిన ఈ ఆరోపణల మీద మోడీతో బహిరంగ చర్చకు సిద్ధం అని కూడా రాహుల్ ధీటుగానే స్పందించారు.

అన్నీ తెలుసు అంటూ :

తనకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనా విధానాల గురించి అంతా తెలుసు అన్నారు. మోడీతో పాటు బీజేపీ నేతలు ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో మోడీ చర్చకు వస్తే ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుస్తాయని రాహుల్ అన్నారు. మోడీ దానికి సిద్ధమేనా అని సవాల్ చేశారు. తమ ఉద్యమాలను పోరాటాలను దేశ వ్యతిరేకం అని అన్నందుకు ఈ రకంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ రియాక్ట్ అయ్యారు.

రాహుల్ వారికి పరికరం :

మరో వైపు చూస్తే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాహుల్ ని ఉద్దేశించి విదేశీ శక్తులకు ఆయన పరికరంగా మారిపోయారు అని విమర్శించారు. విదేశీ శక్తులు భారత్ లో అశాంతిని అలజడిని రేపాలని చూస్తున్నాయని నితిన్ నబిన్ అన్నారు. దేశంలో అరాచక శక్తులకు రాహుల్ నాయకత్వం వహిస్తున్నారు అని కూడా నిందించారు. ఓటు చోరీ అంటూ సాగిస్తున్న ఉద్యమాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. నేపాల్ బంగ్లాదేశ్ లో అరాచకం సృష్టించిన శక్తులే భారత్ లో కూడా చొరబడాలని చూస్తున్నాయని అన్నారు.

తీవ్రమైన విమర్శలు :

భారత్ సర్వ సత్తాక దేశంగా అవతరించి 80 ఏళ్ళు నిండాయి. ఇలాంటి సమయంలో ఇంకా విదేశీ శక్తులు భారత్ ని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాయన్న ఆరోపణలు అయితే దేశ పౌరులంతా మధన పడేవే. అయితే రాజకీయ పార్టీల నేతలు చేసుకుంటున్న విమర్శలు చూస్తే విదేశీ శక్తుల ప్రమేయం చర్చకు వస్తోంది. విదేశాలలో ఎవరు ఎవరిని కలుస్తున్నారు. విదేశీ శత్రువులు వాడే భాషను దేశంలో ఎవరు మాట్లాడుతున్నారు అంటూ ప్రధాని మోడీ విపక్షాల మీద పరోక్షంగా గుజరాత్ సభలో ప్రశ్నలు సంధించారు. ఇప్పుడు రాహుల్ అయితే మోడీ మీద నేరుగా విమర్శలు చేశారు. అసలైన దేశ భక్తులం తాము అని బీజేపీ అంటోంది. తామే దేశానికి సారధులమని కాంగ్రెస్ చెబుతోంది. ఇంతకీ ఈ రాజకీయ ఆరోపణలు ఎందుకు ఏమిటి అన్నదే సగటు జనంలో చర్చగా ఉంది. రాజకీయం దేశంలోనే సాగాలన్నది అందరి కోరిక. ప్రధాని వెలిబుచ్చిన ఆందోళనలో సహేతుకత ఉందని అంటున్న వారు ఉన్నారు. ఇక దేశ ఆర్థిక వ్యవస్థ మీద విదేశీ నీడ ఉందన్న రాహుల్ విమర్శలను ఆలోచించాల్సిందే అన్న వారూ ఉన్నారు.

Tags:    
  • narendramodi 
  • rahulgandhi 
  • bjp 
  • congress 
  • indianpolitics 

Similar News

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

అది పాస్‌పోర్ట్ బుక్ లేదా ఫోన్ డైరీనా.. రెన్యూవల్ ఆఫీసర్ కి షాక్ ఇచ్చిన వ్యక్తి!

2026-11-03 06:04 GMT

పోలింగ్ రోజు ఆందోళన.. జగన్‌కు పోలీసుల షాక్.. కేసు నమోదు

2026-11-03 05:38 GMT

Grok AI నిర్వహణ ఖర్చులు తలకుమీదకు.. ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువంటున్న ఎలాన్ మస్క్!

2026-11-03 05:38 GMT

ఈజిప్టు హైవేపై డిజిటల్ బిల్‌బోర్డ్ హ్యాక్.. అశ్లీల వీడియోలతో వాహనదారులకు షాక్!

2026-11-03 05:37 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

ఓటు వేసేందుకు అరవై కిలోమీటర్లు వెళ్ళాల్సిందే !

2026-11-03 04:08 GMT

ఏపీలో జగన్ వద్దా.. రాహుల్ ప్లాన్ ఏంటి ?

2026-11-03 04:08 GMT

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

Copyright @2026

Powered by Blink CMS