• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అది పాస్‌పోర్ట్ బుక్ లేదా...

అది పాస్‌పోర్ట్ బుక్ లేదా ఫోన్ డైరీనా.. రెన్యూవల్ ఆఫీసర్ కి షాక్ ఇచ్చిన వ్యక్తి!

| సాధారణంగా ఒక దేశ ప్రభుత్వం తన పౌరులకు జారీ చేసే అధికారిక గుర్తింపే ఈ పాస్‌పోర్ట్.

By - Madhu Reddy
Update: 2026-11-03 06:04 GMT

సాధారణంగా ఒక దేశ ప్రభుత్వం తన పౌరులకు జారీ చేసే అధికారిక గుర్తింపే ఈ పాస్‌పోర్ట్. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణాల కోసం దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. మనం ఎప్పుడైనా మన దేశం నుండి లేదా ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళాలి అంటే కచ్చితంగా ఈ పాస్‌పోర్ట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా మీరు ఫలానా దేశ పౌరులని నిరూపించే అత్యంత బలమైన ఆధారం కూడా ఇదే. దేశంలో లేదా విదేశాలలో దీనిని ఒక అధికారిక ఐడెంటిటీ ప్రూఫ్.. అంటే అడ్రస్ ప్రూఫ్ గా ఉపయోగించవచ్చు. ఇందులో మన పూర్తి పేరు, పుట్టిన తేదీ, లింగం, పుట్టిన స్థలం, ఫోటో సంతకంతో పాటు ఏ దేశ పౌరులు ఇలా అన్ని వివరాలు ఉంటాయి. అంతేకాదు దీంతో పాటు ప్రతి పాస్‌పోర్ట్ కి కూడా ఒక ప్రత్యేకమైన పాస్‌పోర్ట్ నంబర్ కూడా ఉంటుంది. ఇక స్పష్టంగా చెప్పాలి అంటే మన సొంత దేశం ఇచ్చే ఒక గుర్తింపు పత్రం అని చెప్పవచ్చు . వేరే దేశానికి వెళ్లడానికి అక్కడ కొన్ని రోజులు ఉండడానికి ఇచ్చే పర్మిషన్ అన్నమాట.

ఇకపోతే ఇలాంటి విలువైన పాస్‌పోర్ట్ కి కూడా రెన్యూవల్ తప్పనిసరి. సాధారణంగా భారత ప్రభుత్వం జారీ చేసే పాస్‌పోర్ట్ పదేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత తప్పనిసరిగా దానిని రెన్యూవల్ చేసుకోవాలి. గడువు ముగియడానికి ఒక సంవత్సరం ముందు దీనిని రెన్యువల్ చేసుకోవచ్చు. ఇక మైనర్ల విషయంలో అయితే పాస్‌పోర్ట్ జారీ చేసిన తేదీ నుండి ఐదేళ్ల వరకు లేదా 18 ఏళ్ల వయసు వచ్చేవరకు.. అంటే ఏది ముందు వస్తే దానిని వ్యాలిడిటీ గడువుగా పరిగణించాలి. ఆ తర్వాత ఆన్లైన్లో కూడా రెన్యూవల్ చేసుకోవచ్చు.

అయితే 15 నుంచి 18 సంవత్సరాల వయసున్న మైనర్లు 10 సంవత్సరాల వరకు పూర్తిగా చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ ను పొందుతారు. ముఖ్యంగా పాస్‌పోర్ట్ ప్రయోజనాలలో అవాంతరాలు ఏర్పడకుండా ఉండాలి అంటే కచ్చితంగా ఏడాది ముందే రెన్యూవల్ ప్రాసెస్ చేయించుకోవడం మంచిది.

అయితే ఇలాంటి పాస్‌పోర్ట్ ను రెన్యూవల్ చేయించుకోవడానికి రెన్యూవల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లిన ఒక వ్యక్తి (కేరళకు చెందిన వ్యక్తి) అధికారికే షాక్ ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. పాస్‌పోర్ట్ ను తీసుకెళ్లి రెన్యూవల్ చేయించుకోవడానికి ఆ వ్యక్తి ఆఫీసర్ కి ఇచ్చాడు. అయితే రెన్యూవల్ చేయడానికి తన చేతుల్లోకి తీసుకున్న ఆ ఆఫీసర్ ఆ బుక్ ను తిరగేస్తుంటే అందులో ఉన్న విషయాన్ని చూసి షాక్ అయ్యారు . సదరు వ్యక్తి పాస్‌పోర్ట్ ను ఏకంగా ఫోన్ బుక్కుగా మార్చేశారు. అందులో ఫోన్ నెంబర్లు కనిపించాయి. ఇక పాస్‌పోర్ట్ చివరాఖరిలో కొన్ని లెక్కలు కూడా రాసుకోవడం గమనార్హం.

ఇకపోతే ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇది పాస్‌పోర్ట్ ఆ లేక ఫోన్ డైరీనా అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు . ఏది ఏమైనా అత్యున్నత ప్రాధాన్యత కలిగిన ఈ పాస్‌పోర్ట్ ను ఏకంగా ఆ వ్యక్తి ఇలా ఉపయోగించడం సోషల్ మీడియాలో పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.



పాస్‌పోర్ట్ రిన్యూవల్‌కు వెళ్లి అధికారికి షాక్ ఇచ్చిన వ్యక్తి! 🤣 #Kerala #ViralNews https://t.co/7noVesimU3

— Tupaki (@tupaki_official) November 3, 2026


Tags:    
  • passport 
  • kerala 
  • viralvideo 
  • passportrenewal 
  • socialmedia 

Similar News

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

పోలింగ్ రోజు ఆందోళన.. జగన్‌కు పోలీసుల షాక్.. కేసు నమోదు

2026-11-03 05:38 GMT

Grok AI నిర్వహణ ఖర్చులు తలకుమీదకు.. ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువంటున్న ఎలాన్ మస్క్!

2026-11-03 05:38 GMT

ఈజిప్టు హైవేపై డిజిటల్ బిల్‌బోర్డ్ హ్యాక్.. అశ్లీల వీడియోలతో వాహనదారులకు షాక్!

2026-11-03 05:37 GMT

విదేశీ...స్వదేశీ : మోడీ వర్సెస్ రాహుల్ !

2026-11-03 04:12 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

ఓటు వేసేందుకు అరవై కిలోమీటర్లు వెళ్ళాల్సిందే !

2026-11-03 04:08 GMT

ఏపీలో జగన్ వద్దా.. రాహుల్ ప్లాన్ ఏంటి ?

2026-11-03 04:08 GMT

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

Copyright @2026

Powered by Blink CMS