ఒకవైపు మురసు.. మరోవైపు కౌంటింగ్.. ఊపిరాడితే ఒట్టు!
| రాష్ట్రంలో మురసు తుఫాను ప్రభావంపై సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు.
ఒకవైపు అత్యంత కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల కౌంటింగ్ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకపక్షంగా పోలింగ్ జరుగుతుందని.. అనుకున్నా వైసీపీ కూడా బలమైన పోటీ ఇవ్వడంతో భారీగానే ఓట్లు పడ్డాయి. దీంతో మెజారిటీ స్థానాల్లో `నెక్ టు నెక్` అన్నట్టుగా పోటీ ఉంది. దీంతో ప్రతి ఓటూ కీలకంగా మారింది. ఈ పరిణామాలు ఒకవైపు సీఎం చంద్రబాబుకు టెన్షన్ పెడుతుంటే.. మరోవైపు ముంచుకొచ్చిన మురసు తుఫాను మరింత గడబిడగా మారింది. దీంతో తుఫాను కారణంగా ఎదురవుతున్న సమస్యలపైనా ఆయన దృష్టి పెట్టారు. దీంతో ఊపిరాడనంత రీతిలో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు.
రాష్ట్రంలో మురసు తుఫాను ప్రభావంపై సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం, గాలుల తీవ్రత తదితర అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమాచారాన్ని విశ్లేషించి దానికి అనుగుణంగా వ్యవస్థలను సమర్ధంగా నిర్వహించేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతీ అంశంలోనూ డేటా- డ్రివెన్- డెసిషన్ మేకింగ్ జరగాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ప్రకాశం, బాపట్ల, పల్నాడు, కృష్ణ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రమం తటా 20.38 సెం.మీ సగటు వర్షపాతం నమోదు కాగా, బాపట్ల జిల్లాలో 21 సెం.మీ, ప్రకాశం జిల్లాలో 20 సెం.మీ మేర వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 7 నుంచి 8 టీఎంసీల వరకు నీరు రిజర్వాయర్లకు చేరిందన్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయటం ద్వారా ప్రాణాలను కాపాడగలిగామని...తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి సహకారం కోరామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
మరోవైపు ఎన్నికలు..
ఒకవైపు తుఫాను పరిస్థితులపై సమీక్షిస్తూనే.. మధ్యలో ఓ గంట విరామం తీసుకుని.. ప్రస్తుతం జరుగుతున్న కౌం టింగ్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. అధికారులతోనూ .. పార్టీ సీనియర్లతోనూ ఆయన సమీక్షిస్తు న్నారు. ప్రస్తుతం తుఫాను ప్రభావంతో విజయవాడ, బాపట్ల వంటి ప్రాంతాల్లో కౌంటింగ్ మందకొడిగా సాగింది. అలానే.. పలు చోట్ల కౌంటింగ్ పూర్తయింది. ఈ విషయాలను తెలుసుకున్న చంద్రబాబు కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలా.. రెండు చేతులతోనూ చంద్రబాబు పనిచేయడం గమనార్హం.