ప్రక్షాళన తప్పదా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్.. !
| ఇటు టీడీపీ, అటు జనసేన మరో వైపు వైసీపీ.. మూడు పార్టీలకు కీలకంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాయి.
ఇటు టీడీపీ, అటు జనసేన మరో వైపు వైసీపీ.. మూడు పార్టీలకు కీలకంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాయి. అయితే.. ఈ ఎన్నికల్లో మూడు పార్టీల నాయకులు హద్దులు దాటారన్నది వాస్తవం. ఎక్కడి కక్కడ నాయకులు రెబల్స్‌గా పోటీకి దిగారు. చివరి నిమిషం దాకా.. నాయకులు పోరాటానికే మొగ్గు చూపారు. వీరిలో టీడీపీ నుంచి ఎక్కువ మంది ఉంటే.. జనసేన నుంచి కూడా దాదాపు అంతే మంది పోటీలో నిలిచారు. ఇక, వైసీపీలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. పోటీకి సిద్ధమైన నాయకులు చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు.
కారణాలు ఏవైనా కూడా.. వైసీపీకి ఛాన్స్ లేకుండా కొందరు అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ తర్వాత.. ఎన్ని కల పోలింగ్ రోజు కూడా వెనక్కి తగ్గి.. తాము బరిలో లేమని ప్రకటించు కున్నారు. ఈ ప్రభావం కూడా వైసీపీపై బాగా నే పడిందని అంటున్నారు. ఈ పరిణామాలపై మూడు పార్టీలు కూడా అంతర్మథనంలో పడ్డాయి. టీడీపీ, జనసేనలో రెబల్స్‌తో పాటు ఐక్యత కూడా ప్రశ్నగా మారింది. నాయకులు ఐక్యంగా కొన్ని చోట్ల ప్రచారం చేయలేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. విజయవాడలో టీడీపీ నాయకులు రాధాకు పై పైనే మద్దతు ఇచ్చారన్న చర్చ తెరమీదికి వచ్చింది.
అలా నే.. ఇతర ప్రాంతాల్లోనూ టీడీపీ వర్సెస్ జనసేన మధ్య క్షేత్ర స్థాయిలో ఉన్న వివాదాల కారణంగా నాయకులు ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రక్షాళన దిశగా అడుగులు వడివడిగా పడుతున్నాయి. తుఫాను ప్రభావం తగ్గడంతోపాటు.. ఎన్నికల ఫలితాలను బట్టి ఈ విషయంపై పార్టీలు దృష్టి పెట్ట నున్నాయని టీడీపీ రాష్ట్ర నేత ఒకరు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఈ దఫా నాయకులకు బాధ్యతలు ఇస్తారని.. అందరినీ కలుపుకొని పోయే నేతలనే ఎంచుకుంటారని అంటున్నారు.
వైసీపీ లో చాలా మంది చివరి నిమిషంలో కాడి పడేయడంపై ఆ పార్టీలోనూ చర్చ సాగుతోంది. కొందరు నేతలు చే సిన ఈ పని కారణంగా.. ఇతర నాయకులకు అవకాశం చిక్కలేదన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో ఇకపై క్షేత్ర స్థాయి నాయకులతోపాటు.. అధిష్టానమే ఎంపిక చేసే దిశగా అడుగులు వేయాలని నిర్ణయించింది. మొత్తంగా నాయకుల వ్యవహార శైలిపై వైసీపీ నిశితంగానే దృష్టి పెట్టనుందని పార్టీ కీలక నేత లేళ్ల అప్పిరెడ్డి చెబుతున్నారు. ఏదేమైనా.. స్థానిక ఎన్నికల్లోనే నాయకుల వ్యవహారం తేలిపోయిందని.. ఇకపై జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించడం గమనార్హం.