• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమెరికాలో చంద్రబాబు...

అమెరికాలో చంద్రబాబు నాయుడు ఎక్కడ..?

| ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి ఐదు రోజులు పూర్తయ్యింది. మరో రెండువారాల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి

By - Tupaki Desk
Update: 2024-05-19 04:59 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి ఐదు రోజులు పూర్తయ్యింది. మరో రెండువారాల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేతలు భావిస్తున్నారు. ఇన్ని రోజులూ ప్రచార కార్యక్రమాలతో అలసిపోయిన నేతలు.. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనలు చేపడుతున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు చంద్రబాబు చేరారు.

అవును... సార్వత్రిక ఎన్నికల ఫలితాల విడుదలకు ఇంకా సమయం చాలా ఉండటంతో ఈ గ్యాప్ లో ఆయా పార్టీల నేతలు, అధినేతలు ఫ్యామిలీతో కలిసి హాలిడేస్ ని ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఫ్యామిలీతో లండన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన తిరిగి జూన్ 1న ఏపీకి తిరిగి రానున్నారు.

ఈ క్రమంలో తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ఇందులో భాగంగా... శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌ నుంచి యూఎస్ కు బయలుదేరి వెళ్లారు బాబు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు. అయితే వైద్య పరీక్షల నిమిత్తం ఆయన అమెరికా వెళ్లినట్లు చెబుతున్నారు.

ఈ సందర్భంగా ఆయన గతంలో కూడా ఒకసారి అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లారని అంటున్నారు. ఆరు రోజుల తర్వాత తిరిగి రాష్ట్రానికి రానున్నారు. మరోపక్క.. ఆయన కుమారుడు లోకేష కొద్దిరోజుల క్రితమే కుటుంబంతో కలసి అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.

బాబు కోసం జల్లెడపడుతున్న ‘తెలుగు’వారు!:

ఆ సంగతి అలా ఉంటే... తన ఆరోగ్య సమస్యలపై ఎప్పటి నుంచో అమెరికాలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు చంద్రబాబు. అయితే... ఎన్నికల ఫలితాల ముందు ఆయన అమెరికాకు వెళ్లడంతో ఆయన అడ్రస్ కోసం అక్కడున్న తెలుగువారు జల్లెడ పడుతున్నారని తెలుస్తుంది. ఆయనను ఈ సమయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ కలవాలని చాలామంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.

అయితే... సుమారు మూడు నెలల పాటు అవిశ్రాంతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాబు.. ఎండా కోండా అని చూసుకోకుండా ఆ వయసులో అలుపెరగకుండా జనాల్లో తిరిగిన బాబు.. తిరిగి మళ్లీ రెండు వారాల్లో ఎన్నికల ఫలితాలు రానుండటంతో.. అనంతరం మరింత బిజీ అయిపోయే అవకాశం ఉందని చెబుతున్న నేపథ్యంలో... ఈ స్వల్ప విరామాన్ని వీలైనంత ప్రశాంతంగా గడపాలని భావిస్తున్నారని అంటున్నారు.

ఈ ఆరు రోజుల పర్యటనల్లో చివరి రోజు మాత్రం అక్కడున్న 'తెలుగు'వారిని కలిసే అవకాశం ఉందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. కాగా... రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్ పై విడుదలైన అనంతరం చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. అనంతరం స్వల్ప కాలం విశ్రాంతి అనంతరం తిరిగి ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు!

Tags:    
  • Chandrababunaidu 
  • Bhuvaneshwari 
  • Apelections 
  • Appolitics 
  • TDPchief 
  • Chandrababu 
  • Naralokesh 

Similar News

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

Copyright @2026

Powered by Blink CMS