• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వైసీపీ హెలికాప్టర్ ...

వైసీపీ హెలికాప్టర్ పోస్టుకు టీడీపీ స్ట్రాంగ్ రిప్లై!

| సీఎం చంద్రబాబుతో పాటు మరికొంతమంది వీపైపీలు వాడుతున్న హెలికాప్టర్ ఫిట్ నెస్ విషయంలో ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-05-16 05:31 GMT

సీఎం చంద్రబాబుతో పాటు మరికొంతమంది వీపైపీలు వాడుతున్న హెలికాప్టర్ ఫిట్ నెస్ విషయంలో ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. వాటి ఫిట్ నెస్ గురించి, అవసరమైతే వాటిని మార్చాల్సిన విషయం గురించి నివేదిక కోరుతూ ఓ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ పై వైసీపీ ఎక్స్ వేదీకగా స్పందించింది.. దానికి టీడీపీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.

అవును... ఏపీ ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ కొనుగోలు విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఎక్స్ వేదికగా స్పందించిన వైసీపీ... "జనం సొమ్ముతో బాబు కొడుకులు జల్సాలు చేస్తున్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.. అప్పులు పుట్టడం లేదన్న చంద్రబాబు.. రూ.172 కోట్లతో విలాసవంతమైన హెలికాప్టర్ కొనుగోలు చేస్తున్నారు. దీన్ని వారి విలాసాల కోసం వాడతారు." అని ట్వీట్ చేసింది.

దీంతో... వైసీపీ ట్వీట్ ను ఫేక్ అని కొట్టిపడేసిన టీడీపీ.. అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఘాటు రిప్లై ఇచ్చింది. ఇందులో భాగంగా... "రూ.172 కోట్ల ప్రజాధనంతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కోసం విలాసవంతమైన హెలికాఫ్టర్ ను ప్రభుత్వం కొంటున్నట్టు తన సోషల్ మీడియాలో ఫేక్ పోస్ట్ పెట్టిన జగన్ అనే ఫేక్ గురించి ఈ విషయాలు తెలుసా?" అని మొదలుపెట్టింది.

అనంతరం... తన విలాసాల కోసం బీచ్ వ్యూతో రుషికొండ ప్యాలెస్ కి రూ.500 కోట్లు.. తన పార్టీ అఫీసుల కోసం 26 జిల్లాల్లో 26 ప్యాలెస్ లకు రూ.900 కోట్లు.. 986 మంది సెక్యూరిటీకి రూ.1000 కోట్లు, సర్వే రాళ్లపై తన బొమ్మకి రూ.700 కోట్లు, పాస్ బుక్స్ పై తన ఫోటోలకు రూ.13 కోట్లు, తన ఇంటి చుట్టూ ఇనుప కంచె కోసం రూ.12.85 కోట్లు, ఎగ్ పఫ్ లకు రూ.3.6 కోట్లు తగలేశారని ఫైరయ్యింది!

ఇలా ఈ రేంజ్ లో దోపిడీ, జల్సాలు, ప్రపంచంలో ఏ నియంత కూడా చేసి ఉండరేమో అని అభిప్రాయపడింది. ఇదంతా లోకేష్ పై జరుగుతున్న ఫేక్ ప్రచారం అని టీడీపీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో వైసీపీ హెలికాప్టర్ ప్రచారానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

రూ.172 కోట్ల ప్రజాధనంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గార్ల కోసం విలాసవంతమైన హెలికాఫ్టర్ ను ప్రభుత్వం కొంటున్నట్టు తన సోషల్ మీడియాలో ఫేక్ పోస్ట్ పెట్టించిన జగన్ అనే ఫేక్ గురించి ఈ విషయాలు తెలుసా ? తన విలాసాల కోసం బీచ్ వ్యూతో, రుషికొండ ప్యాలెస్ కి రూ.500 కోట్లు… pic.twitter.com/z53sOV2CnP

— Telugu Desam Party (@JaiTDP) May 15, 2025
Tags:    
  • ChandrababuNaidu 
  • YSRCPvsTDP 
  • APPolitics 
  • HelicopterControversy 
  • NaraLokesh 
  • YSJagan 
  • AndhraPradeshNews 
  • PoliticalDrama 
  • FakeNewsRow 
  • PublicMoneyDebate 

Similar News

ఎమ్మెల్యే విందు.. గాల్లో ఎగిరిన ప్లేట్లు.. కరెంట్ టవర్లపై వేలాడిన మనుషులు..

2026-11-26 10:20 GMT

టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి భారీ మొత్తం.. గ్రూప్ ఇన్సూరెన్స్ కే 191 శాతం నిధులు!

2026-11-26 10:19 GMT

ఫిట్‌గా ఉంటేనే లిక్కర్.. వైన్ షాపు ముందు మెడికల్ క్యాంప్.. మందుబాబులకు ఊహించని షాక్

2026-11-26 10:17 GMT

యూపీలో ఇండి కూటమికి అసలు పరీక్ష: 130 సీట్లపై కాంగ్రెస్ పట్టు.. గెలుపు గుర్రాలకే టికెట్లంటున్న అఖిలేశ్!

2026-11-26 10:14 GMT

తిరుమలేశుడికి 121 కేజీల బంగారం ఇచ్చింది ఎవరో తెలుసా? ఎందుకిచ్చాడంటే?

2026-11-26 09:03 GMT

జగన్ దూరం.. విజయమ్మ ఆశీస్సులతో ముగిసిన అంజలీ రెడ్డి వివాహం!

2026-11-26 09:00 GMT

చిన్నారులకు కడుపునొప్పి వస్తే వాతలా? ప్రాణాలకే ముప్పు తెచ్చే మూఢనమ్మకాలు!

2026-11-26 08:58 GMT

కూటమిలో జనసేన పంచాయితీ.. సేనాని పవర్ ఫుల్ వ్యూహమేనా?

2026-11-26 08:57 GMT

ఇరాన్‌తో మళ్లీ యుద్ధం తప్పదా?.. ఇజ్రాయెల్ జ్యోతిష్యుల సంచలన అంచనాలు!

2026-11-26 08:55 GMT

అమెరికా పిల్లలకు SpaceX షేర్లు ఇవ్వనున్న ఎలాన్ మస్క్.. ఎప్పటి నుంచి అంటే?

2026-11-26 08:52 GMT

చేతిలో డిగ్రీలు.. ఉద్యోగం కోసం రోడ్లపై.. బీటెక్ బతుకులు దుర్భరం.. ఇంటర్వ్యూ కోసం కిలోమీటర్ల క్యూ

2026-11-26 08:51 GMT

అంతరిక్షాన్ని ఆక్రమించేస్తున్నావా మస్క్ మావా..

2026-11-26 08:44 GMT

Copyright @2026

Powered by Blink CMS