కియారా వార్ బికినీ.. ఇంతకంటే హీటెక్కించే లుక్కుంటుందా?
ఈ లుక్ చూసిన వారు ఇంతకంటే హీట్ హీటెక్కించే లుక్కుంటుందా? అని పాజిటివ్ గానే కామెంట్ చేస్తున్నారు.;
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్న ‘వార్ 2’ సినిమా టీజర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తారక్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ టీజర్ లో యాక్షన్ డోస్ గట్టిగా ఉంది. ఇక కియరా బికినీలో కనిపించే లుక్ అభిమానులను ఫిదా చేసింది. పూల్ బ్యాక్ సైడ్‌లో నిలబడి కనిపించే ఈ ఫ్రేమ్, కియరా యొక్క స్టన్నింగ్ అప్పియరెన్స్‌ను చాటింది.
ఈ లుక్ చూసిన వారు ఇంతకంటే హీట్ హీటెక్కించే లుక్కుంటుందా? అని పాజిటివ్ గానే కామెంట్ చేస్తున్నారు. కియరా ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. ఈ లుక్‌తో ఆమె సినిమాకు అదనపు ఆకర్షణను జోడిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ ఫ్రేమ్‌లో కియరా నిలబడి, తన చేతులను తల మీద ఉంచుకుని, సన్‌షైన్‌లో కనిపిస్తూ, ఆమె యొక్క ఫిట్‌నెస్, స్టైల్‌ను చాటుకుంది. ఈ లుక్ సినిమాకు మరింత హైప్‌ను రగిలించింది.
‘వార్ 2’ సినిమా ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. యాక్షన్ ఎలిమెంట్స్ ఎన్టీఆర్ హృతిక్ పవర్ఫుల్ రోల్స్ తో పాటు కియరా యొక్క ఈ బికినీ లుక్, ఆమె యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ ఎంతగానో ఎట్రాక్ట్ చేసినట్లు అర్ధమవుతుంది. ఒక విధంగా సినిమా హైప్ ను మరింత బలపర్చేలా ఉందని అభిమానులు అంటున్నారు. ఈ లుక్‌తో కియరా సినిమాకు అదనపు గ్లామర్‌ను జోడిస్తుందని టాక్ నడుస్తోంది.
కియరా యొక్క ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు ఈ ఫ్రేమ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. “కియరా ఈ లుక్‌లో ఫైర్‌గా కనిపిస్తోంది, సినిమా ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్” అని కామెంట్స్ వస్తున్నాయి. ఇక సినిమాలో ఆమె హృతిక్ రోషన్ కు జోడిగా కనిపించనుంది. ఇప్పటికే బాలీవుడ్ లో వరుస హిట్స్ అందుకుంటున్న అమ్మడు ఈ లుక్కుతో మరో లెవెల్ కు వెళ్లే అవకాశం ఏర్పడింది. సినిమా హిట్టయితే పాన్ ఇండియా పోటీలో అమ్మడికి మరింత డిమాండ్ వచ్చినట్లే.