సూర్య 'సీన్' రచ్చ.. ట్రైలర్ ఎలా ఉందంటే..
ఆవేశం లాంటి బ్లాక్బస్టర్ తర్వాత డైరెక్టర్ జిత్తు మాధవన్, స్టార్ హీరో సూర్య కాంబినేషన్ లో అనౌన్స్ అయిన ప్రాజెక్ట్ ‘సీన్’.
ఆవేశం లాంటి బ్లాక్బస్టర్ తర్వాత డైరెక్టర్ జిత్తు మాధవన్, స్టార్ హీరో సూర్య కాంబినేషన్ లో అనౌన్స్ అయిన ప్రాజెక్ట్ ‘సీన్’. ఇక లేటెస్ట్ గా విడుదలైన ఈ అఫీషియల్ ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఎప్పుడూ సీరియస్ రోల్స్ తో మెప్పించే సూర్యను ఒక క్రేజీ, ఫన్నీ అవతారంలో ప్రజెంట్ చేస్తూ కట్ చేసిన ఈ విజువల్స్ యూత్ ఆడియన్స్ లో మంచి ఆసక్తిని పెంచాయి.
ట్రైలర్ ఆరంభంలోనే అలెక్సాతో సూర్య చేసే చిట్ చాట్, పోలీస్ ఉద్యోగానికి ఇన్బరాజ్ రాజీనామా చేయడంతో కథ మొదలవుతుంది. కెరీర్ పీక్స్ లో ఉండగా జాబ్ ఎందుకు వదిలేస్తున్నావని అడిగితే పాలిటిక్స్ లోకి వెళ్తున్నానంటూ ఇచ్చే సమాధానం ఆకట్టుకుంది. డిపార్ట్మెంట్ లో ఎవరినీ సమానంగా చూడని ఒక విచిత్రమైన క్యారెక్టర్ గా సూర్యను చూపించారు. ఇంట్లో పనిమనిషిగా నజ్రియా నాజిమ్ ఎంట్రీ ఇవ్వడం కథలో మరో యాంగిల్ ను టచ్ చేసింది.
జిత్తు మాధవన్ గత సినిమాల తరహాలోనే ఇందులో కూడా ఒక విలక్షణమైన అల్లరి, బ్లాక్ హ్యూమర్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు సైకో కిల్లర్ వేట, మరోవైపు తనకు సమానమైన ప్రత్యర్థి కోసం వెతుకులాట, మధ్యలో బాంబుల గందరగోళం కథను చాలా స్పీడ్ గా నడిపించాయి. సూర్య ఎనర్జీ చాలా కాలం తర్వాత ఇంత ఫ్రెష్ గా కనిపిస్తోంది. పాత సింగం డైలాగ్ వన్ అండ్ హాఫ్ టన్నును ఫన్నీగా రీక్రియేట్ చేసిన తీరు అలరించింది.
నజ్రియా నాజిమ్, నస్లేన్ స్క్రీన్ ప్రెజెన్స్ ట్రైలర్ కు మరింత యూత్ ఫుల్ వైబ్ తెచ్చింది. సీరియస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లా కాకుండా, దర్శకుడు తనదైన శైలిలో సిట్యువేషనల్ కామెడీని మిక్స్ చేశారు. సుశిన్ శ్యామ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజువల్స్ కు పర్ఫెక్ట్ గా సింక్ అవుతూ మూడ్ ను బాగా లిఫ్ట్ చేసింది. ప్రతి సీన్ లోనూ సౌండింగ్ తో పాటు కలరింగ్ చాలా రిచ్ గా కనిపిస్తోంది.
ఇది అందరికీ నచ్చే రెగ్యులర్ మాస్ కమర్షియల్ ఫార్ములా ట్రైలర్ లా మాత్రం లేదు. ఆవేశం తరహా కల్ట్ ట్రీట్ మెంట్ ను ఇష్టపడే వాళ్లకు ఇది బాగా ఎక్కే ఛాన్స్ ఉంది కానీ, రొటీన్ సూర్య యాక్షన్ కోరుకునే వాళ్లకు కాస్త కొత్తగా అనిపించవచ్చు. కథలోని అసలు పాయింట్ ఏంటనేది రివీల్ చేయకుండా కేవలం పాత్రల పిచ్చితనాన్ని మాత్రమే ఎక్కువగా చూపించారు. ఇది ఆడియన్స్ ను థియేటర్ల దాకా రప్పించడంలో ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.
ఏదేమైనా ‘సీన్’ ట్రైలర్ ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్ అనే భరోసా ఇస్తోంది. సూర్య స్టార్ డమ్ కు జిత్తు మాధవన్ మేకింగ్ స్టైల్ తోడైతే సౌత్ బాక్సాఫీస్ దగ్గర గట్టి బజ్ క్రియేట్ అవ్వడం ఖాయం. అతిగా ఎలివేషన్లు ఇవ్వకుండా ఒక క్రేజీ రైడ్ లా కట్ చేసిన ఈ కంటెంట్ సినిమాపై సరైన అంచనాలు సెట్ చేసింది. రేపు స్క్రీన్ పై ఈ ఫన్ ఏ రేంజ్ లో పేలుతుందో రిలీజ్ తర్వాతే తెలుస్తుంది.