డిజిటల్ స్పేస్‌లో బోల్డ్ స్టోరీల వెనుక లాజిక్!
డిజిటల్ విప్లవం పరిశ్రమ తీరుతెన్నులనే మార్చేస్తుంది. ఒకప్పుడు వెండితెరపై మాత్రమే కనిపించిన స్టార్ హీరోయిన్లు ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల వైపు అడుగులు వేస్తున్నారు.
డిజిటల్ విప్లవం పరిశ్రమ తీరుతెన్నులనే మార్చేస్తుంది. ఒకప్పుడు వెండితెరపై మాత్రమే కనిపించిన స్టార్ హీరోయిన్లు ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల వైపు అడుగులు వేస్తున్నారు. అయితే థియేట్రికల్ సినిమాల్లో పద్ధతిగా సాంప్రదాయబద్ధమైన పాత్రల్లో కనిపించే నటీమణులు.. డిజిటల్ స్పేస్‌లోకి వచ్చేసరికి మాత్రం కొన్ని బోల్డ్ పాత్రలను ఎంచుకుంటున్నారు. దీనికి అసలు కారణం గ్లామర్ షో అని కాకుండా ఓటీటీలో వచ్చే కంటెంట్ .. కథల స్వభావమే ప్రధాన కారణమని తెలుస్తోంది.
ఇక్కడ గ్లామర్ విషయంలో హీరోయిన్లు ప్రత్యేకంగా హద్దులు చెరిపేస్తున్నారనడం కంటే? వెండితెరపై కంటే ఓటీటీలో బోల్డ్ స్టోరీలు .. ఇంటెన్స్ కంటెంట్‌ను తెరకెక్కించడానికి దర్శకులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని చెప్పొచ్చు. థియేటర్లలో అయితే సెన్సార్ బోర్డు నిబంధనల కారణంగా కొన్ని బోల్డ్ సన్నివేశాలు.. బూతులు లేదా సున్నితమైన డైలాగ్‌లను కట్ చేస్తారు. కానీ ఓటీటీలో ఆ ఇబ్బంది ఉండదు. కాబట్టి దర్శకులు అనుకున్న కథను ఎలాంటి ముసుగు లేకుండా అత్యంత సహజంగా తెరపైకి తీసుకొస్తున్నారు.
వెండితెరపై హోమ్లీ ఇమేజ్‌ను కలిగి ఉన్న కీర్తి సురేష్, తమన్నా .. నటనకు ప్రాధాన్యతనిచ్చే రాధికా ఆప్టే వంటి నటీమణులు సైతం ఓటీటీ ప్రాజెక్టులలో వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఒప్పుకుంటున్నారు. గ్లామర్ పరంగా వారు థియేటర్ సినిమాల్లో ఎలా కనిపిస్తారో? ఓటీటీలోనూ అలాగే ఉంటున్నారు. కానీ తేడా ఏంటంటే? కేవలం కంటెంట్ ..బోల్డ్ స్టోరీస్ చుట్టూనే తిరుగుతుంది. థియేటర్లలో మ్యూట్ అయ్యే ఇంటెన్స్ రోల్స్.. కొన్ని బోల్డ్ డైలాగ్స్ .. రా కంటెంట్‌కు డిజిటల్ వేదికలపై ప్రేక్షకులు స్వాగతిస్తున్నారు. కాబట్టి నటీమణులు కూడా ఆయా పాత్రల డిమాండ్‌ను బట్టి నటిస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో కొన్ని సిరీస్‌లలో పాత్రల స్వభావమే బోల్డ్‌గా .. విభిన్నంగా డిజైన్ చేయబడి ఉంటాయి. అలాంటి రోల్స్‌ను థియేటర్లలో చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఓటీటీలో సెన్సార్ అడ్డంకులు లేకపోవడం వల్ల ఆయా పాత్రల లోతును.. సహజత్వాన్ని డైరెక్టర్లు చూపించగలుగుతున్నారు. హీరోయిన్లు గ్లామర్ కోసం కాకుండా నటిగా తమలోని ప్రయోగాత్మక కోణాన్ని ఆవిష్కరించే బలమైన పాత్రలు దక్కుతున్నాయి కాబట్టే డిజిటల్ ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటున్నారు.
ఈ అంశంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతుంటాయి. కొంతమంది దీనిని నటీమణుల వృత్తిపరమైన స్వేచ్ఛగా.. గొప్ప పెర్ఫార్మెన్స్‌గా చూస్తుంటే.. మరికొందరు మాత్రం ఓటీటీ కంటెంట్ విషయంలో కొన్నిసార్లు ఫ్యామిలీ ఆడియెన్స్‌తో కలిసి చూడటానికి ఇబ్బందికరంగా మారుతోందని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా? ఇక్కడ హీరోయిన్లు గ్లామర్ పేరుతో రెచ్చిపోవడం లేదు కానీ.. డైరెక్టర్లు రాసే బోల్డ్ అండ్ రియలిస్టిక్ కంటెంట్ మాత్రమే ఓటీటీని పూర్తిగా శాసిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.