బిగ్‌బాస్‌లో ఉంటే ఇంతేనా.. స్టార్ హీరోలు కూడా ట్రోలింగ్ నుంచి తప్పించుకోలేరా?
బిగ్‌బాస్ అంటేనే గొడవలు, ట్రోల్స్, మీమ్స్ గుర్తుకు వస్తాయి. ఈ షోను ఎంతోమంది ఆసక్తిగా చూస్తుంటారు.
బిగ్‌బాస్ అంటేనే గొడవలు, ట్రోల్స్, మీమ్స్ గుర్తుకు వస్తాయి. ఈ షోను ఎంతోమంది ఆసక్తిగా చూస్తుంటారు. అయితే..షోను చూసే వారిలో కొంతమంది కంటెస్టెంట్ల ఆట కోసం చూస్తే.. మరికొంతమంది ఆ షో గురించి మీమ్స్, ట్రోల్స్ చేయడం కోసమే చూస్తుంటారు. ఇప్పుడు ఈ ట్రోలింగ్ ప్రభావం బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జునపై కూడా పడింది. ఆయనకు సంబంధించిన పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలుగు బిగ్‌బాస్ ఇప్పటికే తొమ్మిది సీజన్లు పూర్తి.. చేసుకుని పదో సీజన్‌లోకి అడుగు పెటింది. మొదటి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు. రెండో సీజన్‌లో నాని హోస్ట్‌గా కనిపించారు. మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్‌గా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
అయితే..ఇప్పుడు నాగార్జునకు సంబంధించిన పాత వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నాగార్జున, నాని కలిసి నటించిన దేవదాస్ సినిమా ప్రమోషన్ల సమయంలో యాంకర్.. నాని బిగ్‌బాస్ హోస్ట్‌గా వ్యవహరించడం గురించి నాగార్జునను అడిగారు.
అయితే.. బిగ్‌బాస్ గురించి మాట్లాడటానికి నాగార్జున ఆసక్తి చూపించలేదు. బిగ్ బాస్ గురించి ఇప్పుడు ఎందుకులెండి అని అన్నారు నాగార్జున.. ఆ తర్వాత ఈ షో కాన్సెప్ట్‌పై తనకున్న అభిప్రాయాన్ని నాగార్జున చెప్పి ఆశ్చర్యపరిచారు... ఇతరుల జీవితాలను చూస్తూ వినోదం పొందడం, వారి వ్యక్తిగత విషయాలను గమనించడం తనకు నచ్చదని నాగార్జున చెప్పారు.
అయితే..ఇప్పుడు అదే షోకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తుండటంతో ఈ పాత వీడియోను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గతంలో బిగ్‌బాస్ గురించి అలా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు అదే కార్యక్రమానికి హోస్ట్‌గా ఎలా ఉన్నారంటూ ప్రశ్నిస్తున్నారు.
కానీ..ఒకప్పుడు చెప్పిన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఇప్పుడు ఆయన వృత్తితో ముడిపెట్టి విమర్శించడం ఎంతవరకు సమంజసం అనేది సాధారణ ప్రేక్షకులకు వస్తున్న అనుమానం. ఒక కార్యక్రమం గురించి గతంలో నచ్చలేదని చెప్పినంత మాత్రాన, భవిష్యత్తులో ఆ కార్యక్రమంలో భాగం కాకూడదనే నియమం ఏమీ లేదు. కాలంతో పాటు అభిప్రాయాలు మారవచ్చు. వృత్తిపరమైన నిర్ణయాలు కూడా వ్యక్తిగత అభిప్రాయాలకు భిన్నంగా ఉండవచ్చు.
కానీ ఈ విషయం బిగ్‌బాస్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల నుంచి హోస్ట్‌ల వరకు ఎవరూ ట్రోలింగ్‌కు అతీతులు కారు అనేలా చేస్తోంది. చివరకు స్టార్ హీరో నాగార్జున కూడా పాత వీడియోల కారణంగా విమర్శలను ఎదుర్కొంటున్నారు. అయితే, ప్రతి పాత వీడియోను ఇప్పుడు బయటకు తీసి వివాదం చేయాల్సిన అవసరం ఉందా.. అనేది కూడా అందరూ ఆలోచించాల్సిన విషయం.