ఓటీటీలో ఈవారం కొత్త సినిమాలు, సిరీస్‌లు ఇవే

ఈ వారంలో మంచి కంటెంట్‌ ఓటీటీ ద్వారా వచ్చింది, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసిన నాని 'ది ప్యారడైజ్‌' మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ మొదలైంది.

Update: 2026-10-24 04:33 GMT

ఈవారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా సినిమాలు ఏమీ రాలేదు. ఒకే ఒక్క హర్రర్‌ సినిమా వచ్చింది. దానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. పూర్తి స్థాయి హర్రర్‌ సినిమాగా రూపొందిన ఆ సినిమాను జనాలు థియేటర్లలో కంటే ఓటీటీలో చూడటం కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఇక వచ్చే వారంలో వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన 'ఆదర్శ కుటుంబం' విడుదలకు రెడీగా ఉంది. కనుక ప్రేక్షకులు ఈవారం థియేట్రికల్‌ సినిమాల కంటే ఓటీటీ స్ట్రీమింగ్‌కి ఆసక్తి చూపిస్తున్నారు. వచ్చే వారం ఎలాగూ థియేటర్‌లో ఆదర్శ కుటుంబం చూడాలి కనుక ఈ వారం ఓటీటీ లో సినిమాలు చూసేద్దాం అనుకునే వారు ఎక్కువ మంది ఉంటారు. వారికి తగ్గట్లుగానే ఈ వారంలో మంచి కంటెంట్‌ ఓటీటీ ద్వారా వచ్చింది, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసిన నాని 'ది ప్యారడైజ్‌' మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ మొదలైంది.

నెట్‌ఫ్లిక్స్‌లో ది ప్యారడైజ్‌ మూవీ

నెట్‌ఫ్లిక్స్‌లో నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబోలో రూపొందిన 'ది ప్యారడైజ్‌' మూవీ కాకుండా ఇంకా పలు సినిమాలు, సిరీస్‌లు ఈ వారం స్ట్రీమింగ్ అవుతున్నాయి. కీర్తి సురేష్ నటించిన డోరతి సినిమా సైతం నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్‌లో రూపొందిన ఈ సినిమాకు పాజిటివ్‌ రివ్యూలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాకు కమర్షియల్‌గా బిగ్‌ హిట్‌ పడలేదు. ఈ సినిమాకు ఓటీటీ ద్వారా మంచి స్పందన దక్కింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ రెండు సినిమాలను సౌత్ ఇండియన్‌ సినీ ప్రేమికులు తెగ చూస్తున్నారు, రెండు సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నట్లుగా రిపోర్ట్‌లు వస్తున్నాయి. ఇంకా నెట్‌ఫ్లిక్స్ ద్వారా ధూమకేతు, గజబ్ రాత్‌, గేల్ డాట్రీ మరియు సెలబ్రిటీ సెక్స్ పాస్, ఫోనీషియన్ స్కీమ్‌, ది వెడ్డింగ్‌ బాంక్వెట్‌ ఇంకా పలు విదేశీ భాషల సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు ఈవారం వచ్చాయి.

ప్రైమ్‌ వీడియోలో ఐయామ్‌ హ్యాండ్స్ మూవీ...

ఇక అమెజాన్‌ ప్రైమ్‌లోనూ ఈవారం నుంచి మంచి సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమా ఐయామ్‌ హ్యాండ్సమ్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. కాలనీ అనే సినిమా మొత్తం ఇండియన్‌ భాషల్లో స్ట్రీమింగ్ మొదలైంది. ఘోస్ట్‌ ఇన్ ది సెల్‌ సైతం ఈ వారం ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ మొదలైంది. తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమాలు కాకుండా మరికొన్ని ఇంగ్లీష్ సినిమాలు, పలు సూపర్‌ హిట్ వెబ్ సిరీస్‌ల యొక్క కొత్త ఎపిసోడ్స్‌, కొత్త సీజన్‌లు సైతం ఈ వారంలో స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. వెబ్‌ సిరీస్‌ల్లో ముఖ్యంగా ది టెర్మినల్ లిస్ట్‌ సీజన్ 2 ను తెలుగులోనూ స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. మొదటి సీజన్ కి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో ఈ సీజన్‌ కోసం ప్రేక్షకులు ఎదురు చూశారు. ప్రతివారం మాదిరిగానే ప్రైమ్‌ వీడియోలో ఫుల్‌ ఇండియన్ కంటెంట్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది.

జియో హాట్ స్టార్‌లో సినిమాలు...

ఆహా వీడియోలో నా వైఫ్‌ మిస్సింగ్ అనే సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇది ఇంగ్లీష్‌లోనూ అందుబాటులో ఉంది. ఇక ఈటీవీ విన్‌లో ఫైట్‌ మహా అనే సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. జియో హాట్‌ స్టార్‌లో హిందీ మూవీ జీనా దిల్ సే స్ట్రీమింగ్‌ మొదలు అయింది. లాస్ట్‌ డేస్‌, హనీ బంచ్‌ అనే సినిమాలు సైతం హిందీ, ఇంగ్లీష్ లో హాట్ స్టార్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా కొత్త సీజన్‌లు, కొత్త ఎపిసోడ్స్‌ తో జియో హాట్‌ స్టార్‌ సైతం తమ సబ్‌స్క్రైబర్స్‌కి ఫుల్‌ వినోదాల విందును ఇస్తుంది. ఇంగ్లీష్, హిందీ సినిమాలు, సిరీస్‌లను ఇష్టపడే వారికి, కొరియస్ సినిమాలు ఇష్టపడేవారికి ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ దక్కబోతుంది. ఇప్పటికే దాదాపు అన్ని ఓటీటీ లు కొత్త సినిమాలు, సీజన్‌లను స్ట్రీమింగ్ మొదలు పెట్టాయి. ఈసారి థియేట్రికల్‌ రిలీజ్ తక్కువ ఉన్నప్పటికీ ఓటీటీల్లో కొత్త సినిమాలు, సిరీస్‌ లతో ప్రేక్షకులకు వినోదాల విందు ఖాయం.

Tags:    

Similar News