Bigg Boss Telugu 10: షాలిని ని రోహిత్ నిజంగానే దూరం పెడుతున్నాడా?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో కెప్టెన్సీ టాస్క్ మొదలు కాక ముందే సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో కెప్టెన్సీ టాస్క్ మొదలు కాక ముందే సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇన్నాళ్లు నీడలా కలిసి తిరిగిన రోహిత్, షాలినిల మధ్య నామినేషన్ల విషయంలో చిన్న గొడవ రావడంతో ఆ దూరం పెరిగి చివరకు వారు విడిపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది.
ఇద్దరూ వేర్వేరుగా కనిపించగా కొంతమంది హౌస్మేట్స్ రోహిత్‌ను, మరికొందరు షాలినిని ఓదార్చడం కనిపించింది. ఇప్పటివరకు ఒకరినొకరు విడిచి ఉండలేమని చెప్పిన ఈ జంట ఒక్కసారిగా "బై" చెప్పుకుని విడిపోగా, షాలిని వచ్చి రోహిత్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించినా అతను మాత్రం అస్సలు తగ్గలేదు.
రోహిత్ చాలా స్ట్రాంగ్‌గా మరియు మెచ్యూర్‌గా వ్యవహరిస్తూ, ఇన్నాళ్లు తనతో ఉన్నది కేవలం స్నేహమేనని దాన్ని మించి ఏమీ లేదని స్పష్టం చేయడంతో షాలిని ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ ఐంది. అయితే ఈ విషయం రోహిత్ ఫాన్స్‌కి కచ్చితంగా నచ్చుతుంది కానీ షాలిని ని అభిమానించే వాళ్ళు మాత్రం ఆమె గేమ్ స్పాయిల్ అవుతుంది అని తప్పక ఫీల్ అవుతారు.
అయితే ఎపిసోడ్ చివర్లో మాత్రం రోహిత్ గేమ్‌ని రామ్ ప్రసాద్ తన టీమ్ సభ్యులతో మాట్లాడుతూ పర్ఫెక్ట్ గా ఎనలైజ్ చేసాడు. హౌస్‌లో అసలైన మానిప్యులేటర్ అంటే రోహిత్ అని, త్రిగుణ్ ఏం చేసినా తెలిసిపోతుందని, అందుకు అతన్ని మానిప్యులేటర్ అనలేమని చెప్పాడు. అంతే కాకుండా రోహిత్ టీమ్‌లో అందరూ ఎవరికి వారు స్వతంత్రంగా తమ సొంత గేమ్‌ను ఆడే స్వేచ్ఛ లేదని, రోహిత్ ఎలా మానిప్యులేట్ చేస్తే అలా ఆడుతున్నారని తెలిపాడు.
అయితే వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత, రోహిత్ కావాలనే షాలిని ని దూరం పెడుతున్నాడని, ఇది ఎంత మాత్రము కరెక్టుగా అనిపించట్లేదని ఇంట్లో ఉన్న చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం లో రోహిత్ కచ్చితంగా నెగటివ్ అవుతున్నాడని మాత్రం అర్థం చేసుకోవచ్చు. అతను షాలిని కి కచ్చితంగా దూరంగా ఉండాలనుకుంటున్నాడు కానీ వెంటనే ఆ రకంగా అడుగులు వేస్తుండటంతో అది చూడటానికి అంత బాగోలేదనేది వాస్తవం. అయినా షాలిని ని దూరం పెడితేనే రోహిత్ గేమ్ మెరుగవుతుంది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.