ధర్మన్ మూవీకి భారీ ఓటీటీ డీల్.. జైలర్ 2 ఎఫెక్ట్? లేదా రాజ్ కమల్ ఫిల్మ్ క్రేజ్?

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్నారు.

Update: 2026-10-28 09:36 GMT

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్నారు. ఇటీవల 'జైలర్ 2'తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ఆయన, ప్రస్తుతం అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో 'ధర్మన్' సినిమా చేస్తున్నారు. ఉలగనాయగన్ కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌కు సంబంధించి ఇండస్ట్రీలో ఒక మైండ్ బ్లాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఓటీటీ బిజినెస్ రూ.150 కోట్లకు కుదిరిందనే ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు చుస్తే..

రూ.150 కోట్ల ఓటీటీ డీల్ ప్రచారం:

కోలీవుడ్ మీడియా వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, 'ధర్మన్' మూవీ డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ ఏకంగా రూ.150 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక రామ్ పోతినేని కీలక పాత్ర పోషిస్తుండటం, అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండటం ఈ సినిమాకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రానున్న ఈ ప్రాజెక్ట్‌కు రిలీజ్‌కు ముందే ఈ రేంజ్ బిజినెస్ టాక్ రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఓటీటీ మార్కెట్ స్లో ఉన్నా కోట్ల ఆఫర్స్?:

ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ గతం కంటే చాలా స్లో అయింది. పెద్ద సినిమాలకు కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఆచితూచి రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. ఇక రాజమౌళి రూపొందిస్తున్న 'వారణాసి' చిత్రానికే రూ.250 కోట్ల బిజినెస్ టాక్ వచ్చినా, ఇంకా మార్కెటింగ్ సరిగ్గా అవ్వలేదని దాన్ని కూడా హోల్డ్‌లో పెట్టారనే ప్రచారం ఉంది. అలాంటి సమయంలో రజనీకాంత్ సినిమాకు రూ.150 కోట్లు ఆఫర్ చేయడం ఎంతవరకు నిజమనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.

'జైలర్ 2' హిట్.. కమల్ హాసన్ బ్రాండ్:

అయితే ఈ ఆఫర్ రావడానికి ప్రధాన కారణం 'జైలర్ 2' విజయమే అని ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు. రజనీకాంత్ వరుస హిట్‌లలో ఉండటంతో పాటు, రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ స్వయంగా నిర్మిస్తుండటం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై నమ్మకం పెరిగింది. ఇదే బ్యానర్‌లో శివకార్తికేయన్ 'సెయాన్' చిత్రం రూ.75 కోట్లకు, కమల్-అరుణ్ కుమార్ కాంబో సినిమా రూ.125 కోట్లకు ఓటీటీ డీల్స్ కుదుర్చుకున్నాయనే టాక్ ఉండటం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది.

'వారణాసి' లెక్కలు మారుతాయా?:

ఒకవేళ 'ధర్మన్' సినిమాకు నిజంగానే రూ.150 కోట్ల ఓటీటీ డీల్ ఓకే అయితే, మున్ముందు రాబోయే రాజమౌళి 'వారణాసి' లాంటి పాన్-వరల్డ్ సినిమాల బిజినెస్ లెక్కలు ఏ రేంజ్ లో ఉంటాయోనని ట్రేడ్ వర్గాలు చర్చిస్తున్నాయి. సినిమా రిలీజ్ సమయానికి మార్కెట్ ప్రమోషన్లు పూర్తయితే ఓటీటీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

ఇక మొత్తానికి చూస్తే, రజనీకాంత్-కమల్ హాసన్ లక్ కాంబినేషన్లో రాబోతున్న 'ధర్మన్' మూవీ పై ఓటీటీ వర్గాల్లో భారీ బజ్ నెలకొంది. రూ.150 కోట్ల డిజిటల్ డీల్ ప్రచారంపై త్వరలోనే నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన వస్తే తప్ప క్లారిటీ రాదు. ఇక ఏది ఏమైనా, 2027 సంక్రాంతి రేసులో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి..

Tags:    

Similar News