Bigg Boss Telugu 10: ఝాన్సీ ఎలిమినేటెడ్, సీక్రెట్ రూమ్కి రోహిత్?

ఈ సీజన్‌లో జరిగిన పరిణామాలు, ముఖ్యంగా రోహిత్ దూకుడు, త్రిగుణ్‌తో గొడవలు మరియు హౌస్‌లో నడుస్తున్న వివాదాలు ప్రేక్షకులను తీవ్రంగా ఆకట్టుకుంటున్నాయి.

Update: 2026-10-31 18:16 GMT

ఈ సీజన్‌లో జరిగిన పరిణామాలు, ముఖ్యంగా రోహిత్ దూకుడు, త్రిగుణ్‌తో గొడవలు మరియు హౌస్‌లో నడుస్తున్న వివాదాలు ప్రేక్షకులను తీవ్రంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సీజన్ గత సీజన్లకంటే కాస్త భిన్నంగా, ఎక్కువ వాదనలు మరియు విమర్శలతో సాగుతోందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది.

ఇక ఎనిమిదో వారంలో ఊహించని విధంగా జరిగిన పరిణామాలు, డబుల్ ఎలిమినేషన్ వార్తలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చకు దారి తీశాయి. హౌస్‌మేట్స్ ఓటింగ్ ద్వారా లేదా నేరుగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారనే ప్రచారం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. రోహిత్ లాంటి బలమైన కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు వెళ్లడం ఆటలోని సమీకరణాలను పూర్తిగా మార్చేయడం ఖాయం.

ఇప్పటికే వారం మధ్యలో సుధీర్ ఎలిమినేషన్ గండం నుంచి బయట పడగా.. తాజాగా వీకెండ్ ఎపిసోడ్‌లో జరిగిన డబుల్ ఎలిమినేషన్ మరియు సీక్రెట్ రూమ్ పరిణామాలు ట్రెండింగ్‌లో నిలిచాయి. ఎనిమిదో వారానికి సంబంధించి మొదటి ఎలిమినేషన్‌ ప్రక్రియలో భాగంగా ఆడియన్స్ ఓటింగ్ మరియు ఇతర సమీకరణాల ఆధారంగా సింగర్ ఝాన్సీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. మొదట శ్వేత నాయుడు ఎలిమినేట్ అవుతుందనే ప్రచారం జరిగినప్పటికీ, చివరకు ఝాన్సీ ఎగ్జిట్ అయినట్లు తెలుస్తోంది.

ఈ వారంలో భాగంగా రెండో ఎలిమినేషన్ కోసం హోస్ట్ నాగార్జున హౌస్‌మేట్స్‌కు ఒక వినూత్నమైన టాస్క్/అధికారం ఇచ్చారు. హౌస్‌లో కంటిన్యూ కావడానికి అర్హత లేని కంటెస్టెంట్ ఎవరనే దానిపై తోటి హౌస్‌మేట్స్ ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్‌లో మెజారిటీ హౌస్‌మేట్స్ రోహిత్‌ను టార్గెట్ చేస్తూ అత్యధిక ఓట్లు వేశారు. గేమ్‌లో అతని దూకుడు, ప్రవర్తన నచ్చలేదనే కారణంతో ఎక్కువ మంది రోహిత్ పేరు సూచించడంతో.. అనూహ్యంగా రోహిత్ డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది అని వినిపిస్తుంది.

బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో ఇప్పటివరకు ఒకే సీజన్‌లో ఇద్దరు కంటెస్టెంట్లను సీక్రెట్ రూమ్‌కి పంపిన దాఖలాలు లేవు. కానీ ఈ సీజన్‌లో మాత్రం సరికొత్త రికార్డు నమోదైంది. ఇప్పటికే షాలినిని సీక్రెట్ రూమ్‌కు పంపి తిరిగి హౌస్‌లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే షాలిని రీ-ఎంట్రీ తర్వాత కూడా తన తీరు మార్చుకోకపోవడంతో తర్వలోనే ఆమె మళ్లీ ఎలిమినేట్ అయింది.

ఇప్పుడు అదే రీతిలో హౌస్‌మేట్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అయిన రోహిత్‌ను నేరుగా ఇంటికి పంపకుండా.. బిగ్‌బాస్ సంచలన ట్విస్ట్ ఇస్తూ 'సీక్రెట్ రూమ్'కు పంపినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News