రామ్ గోపాల్ వర్మ మేనకోడలు కూడా మామకు తగ్గట్లే.. తగ్గేదేలే అంటూ!

సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2026-10-30 13:21 GMT

సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ విషయమైనా సరే ఆయన మనసులో ఉన్నది బయటకు చెప్పేస్తారు. ఎదుట ఎవరున్నారు, ఏం అనుకుంటారనే విషయాలను పెద్దగా పట్టించుకోరు. తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పడం ఆయన ప్రత్యేకత. ఇప్పుడు ఆయన మేనకోడలు కూడా అదే తరహాలో వార్తల్లో నిలుస్తున్నారు. తన ధైర్యంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

రామ్ గోపాల్ వర్మ మేనకోడలు శ్రావ్య వర్మ ప్రస్తుతం ది ట్రైటర్స్ తెలుగు రియాలిటీ షోలో పాల్గొంటున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోలో ఆమె తన ఆటతీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. సెలబ్రిటీ స్టైలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రావ్య వర్మ, నిర్మాతగా కూడా పనిచేశారు. ఇప్పుడు రియాలిటీ షోలో తనదైన శైలిలో ఆడుతూ ప్రేక్షకుల దృష్టిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఈ షోలో శ్రావ్య ఎక్కడా తగ్గడం లేదు. తోటి కంటెస్టెంట్లు ఏదైనా తప్పుగా మాట్లాడినా, వారి మాటల్లో పొంతన లేకపోయినా వెంటనే ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అనుమానాలు వచ్చినప్పుడు నేరుగా నిలదీస్తున్నారు. ఎవరి మాటలకూ సులభంగా తలొగ్గకుండా తనకు అనిపించింది ధైర్యంగా చెబుతున్నారు.

ది ట్రైటర్స్ షోలో నమ్మకం, మోసం, వ్యూహాలు చాలా కీలకం. ఎవరిని నమ్మాలి, ఎవరు వెన్నుపోటు పొడుస్తున్నారు అనే విషయాలను గుర్తించడం ఈ ఆటలో చాలా ముఖ్యం అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరిగే రింగ్ ఆఫ్ డౌట్ చర్చల్లో శ్రావ్య తన ప్రశ్నలతో ఈ షోని ఆసక్తికరంగా మారుస్తున్నారు. తన లాజిక్స్‌తో ఇతర కంటెస్టెంట్లను ఇబ్బంది పెడుతున్నారు.

అయితే ఆమె ధైర్యంగా మాట్లాడే విధానం ఎంతవరకు కలిసొస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇదే ఆటతీరు ఆమెను విజేతగా నిలబెడుతుందా? లేక ఇతర కంటెస్టెంట్లకు టార్గెట్‌గా మారుస్తుందా అనేది చూడాలి.

రామ్ గోపాల్ వర్మ మేనకోడలు కూడా తన బోల్డ్ ఆటతీరుతో తగ్గేదేలే అన్నట్లుగా కనిపిస్తున్నారు. షోలో ఆమె మరింత ముందుకు వెళ్తారా అనేది ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది.

Tags:    

Similar News