ఆరేళ్లు గ్యాప్ తర్వాత.. హిట్ అయితేనే కెరీర్!
సక్సెస్ ఉంటేనే పరిశ్రమలో మనుగడ సాధ్యం. ఒక్క హిట్ పడితే అవకాశాలు క్యూ కడతాయి.
సక్సెస్ ఉంటేనే పరిశ్రమలో మనుగడ సాధ్యం. ఒక్క హిట్ పడితే అవకాశాలు క్యూ కడతాయి. అదే పరాజయాలు ఎదురైతే ఎంతటి ప్రతిభగల దర్శకులైనా సుదీర్ఘ కాలం పాటు కెమెరాకు దూరంగా ఉండాల్సి వస్తుంది. బాలీవుడ్లో `షూటౌట్ ఎట్ లోఖండ్వాలా`, `ఏక్ అజ్నబీ` వంటి సూపర్ హిట్ ట్రెండ్ సెట్టర్ చిత్రాలతో పవర్ఫుల్ యాక్షన్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అపూర్వ లాఖియా ప్రస్తుత పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టి రూపొందించిన భారీ చిత్రం `మాతృభూమి` విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
రామ్‌చరణ్‌తో తెరకెక్కించిన `జంజీర్`, `హసీనా పార్కర్` వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో అపూర్వ లాఖియా కేరీర్ మందగించింది. ఆ తర్వాత ఓటీటీ కోసం ` క్రాక్ డౌన్` అనే స్పేస్ వర్క్ చేసినా? వెండితెరపై ఆయన దర్శకత్వం వహించిన పూర్తిస్థాయి సినిమా వచ్చి ఆరేళ్లు దాటిపోయింది. బాలీవుడ్లో మారుతున్న ట్రెండ్స్.. సరికొత్త దర్శకుల తాకిడి మధ్య ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ రావడం అపూర్వ లాఖియాకు ఒక రకంగా పెద్ద సవాలుతో కూడుకున్న విషయమే.
ప్రస్తుతం లాఖియా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన `మాతృభూమి` చిత్రం ఆయన వృత్తిపరమైన జీవితంలో అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌గా మారింది. దేశభక్తి, రియలిస్టిక్ యాక్షన్ అంశాలతో కూడిన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టెక్నికల్‌గా ఉన్నతంగా అపూర్వ లాఖియా మార్క్ కరెంట్ అండ్ రా సీన్లతో సినిమా ఉండబో తోందని తెలుస్తుంది. లాఖియాలో స్ట్రాంగ్ ఫిలిం మేకర్‌ను మళ్లీ బాక్సాఫీస్ ముందు ఆవిష్కరించేందుకు ఈ ప్రాజెక్ట్ కోసం రాత్రింబవళ్లు శ్రమించారు.
ఈ సినిమా రిజల్ట్ అపూర్వ లాఖియా కెరీర్‌ను డిసైడ్ చేయనుందంటున్నారు. `మాతృభూమి` బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తేనే పరిశ్రమలో మళ్లీ పూర్వవైభవం దక్కడంతో పాటు కొత్త ఆఫర్లు తలుపు తడతాయి. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ గనుక తేడా కొడితే మళ్లీ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి అవకాశాలు అందుకోవడం కష్టంగా మారుతుందనే ఆట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను `డూ ఆర్ డై` ప్రాజెక్ట్‌గా భావించి మరీ చెక్కారని ప్రచారం జరుగుతోంది.
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ప్రేక్షకులు కంటెంట్ విషయంలో స్పష్టంగా ఉన్నారు. రొటీన్ మాస్ ఎంటర్టైనర్ల కంటే కథలో దమ్ము, స్క్రీన్‌ప్లేలో బిగుతు ఉన్న సినిమాలనే ఆదరిస్తున్నారు. ఈ నేపధ్యంలో అపూర్వ లాఖియా మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా `మాతృభూమి`ని ఏ స్థాయిలో మలిచారనేది ఆసక్తికరంగా మారింది. పాత సక్సెస్ ఫార్ములాకు ఆధునిక మేకింగ్ శైలిని జోడించి లాఖియా చేసిన ప్రయత్నం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.