వీడియో: కాలు మీద కాలు వేసుకుని.. ఆదమరిచి శ్రద్ధా ఏంటిలా?
కొన్ని దృశ్యాలు చూడగానే ఫన్నీగా అనిపిస్తాయి.. ఆ దృశ్యాన్ని లోతుగా పరిశీలిస్తే అందులోని విషయం అర్థమయ్యాక.. పెదవులపైనా ముఖంపైనా సన్నని చిరు నవ్వు ప్రత్యక్షమవుతుంది.
కొన్ని దృశ్యాలు చూడగానే ఫన్నీగా అనిపిస్తాయి.. ఆ దృశ్యాన్ని లోతుగా పరిశీలిస్తే అందులోని విషయం అర్థమయ్యాక.. పెదవులపైనా ముఖంపైనా సన్నని చిరు నవ్వు ప్రత్యక్షమవుతుంది. ఇక్కడ సాహో శ్రద్ధాను చూస్తుంటే కచ్ఛితంగా అలాంటి చిరు నవ్వులు ముఖంపై పులుముకోకుండా ఉంటాయా?
చీర కట్టుకుని గరివిడి లక్ష్మిలాగా ఎంతో జోష్ తో స్టేజీ డ్రామాల్ని పండించే పాత్రలో నటించింది శ్రద్ధాకపూర్. ఉత్తరాదికి చెందిన ఒక కళాకారిణి పాత్రలో నటిస్తోంది. అందుకే ప్రమోషన్స్ లో చీర ధరించి కాలు మీద కాలు వేసుకుని..! ఏదో అలా ఆదమరిచి గలగలా మాట్లాడేస్తోంది శ్రద్ధా. ఓ వైపు జర్నలిస్టులు అడుగుతున్న ప్రశ్నలకు జోరుగా జవాబులిచ్చేస్తూ కనిపించింది. అయితే ఆ సమయంలో తన వేషధారణకు తగ్గ ప్రవర్తన కనిపించలేదు. ఆదమరిచి అలా మోడ్రన్ దుస్తుల్లో కాలు మీద కాలు వేసుకుని కూచున్నట్టే సిట్టింగ్ పొజిషన్ లో కనిపించడం నిజంగా చూపరులకు ట్రీట్ గా మారింది.
శ్రద్ధా కపూర్ చీరలో ఎంతో ట్రెడిషనల్ గా తయారైనా కానీ.. కాలు మీద కాలు వేసుకుని అలా కూచోవడం నిజంగానే అవాక్కయ్యేలా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అదేమైనా మోడ్రన్ డ్రెస్ కాదు. కాలు మీద కాలు వేసుకుని కూచునేందుకు..! ఎంచుకున్న దుస్తులకు తగ్గట్టు ప్రవర్తన లేదా ఆహార్యం కూడా మారాలి కానీ.. ఆదమరిచి శ్రద్ధా ఇలా కాలు మీద కాలు వేసుకుని.. జోరుగా మాట్లాడేస్తోందేమిటీ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్, వీడియోలు ఇంటర్నెట్ లో ట్రెండింగ్ గా మారాయి.
తమాషా కళాకారిణి పాత్రలో పరకాయం:
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ తమాషా - లావణీ జానపద కళాకారిణి విఠాబాయి భౌ మాంగ్ నారాయణ్‌గాంకర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన `ఈత`లో శ్రద్ధా సాంప్రదాయం నిండిన పాత్రతో ఆకట్టుకోనుంది. జానపద కళారంగానికి ఆమె అందించిన అపారమైన సేవలు.. స్టేజీలపై ఆమె ప్రదర్శించిన అసమానమైన నటన.. అలాగే జీవితంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులు.. సాధించిన కీర్తి ప్రతిష్ఠలను ఆవిష్కరిస్తూ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.ఒక కళాకారిణి జీవితంలోని సంఘర్షణను, ఆమెలోని ఆత్మవిశ్వాసాన్ని ఈ బయోపిక్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా విడుదలైన `ఈత` అధికారిక ట్రైలర్ నెట్టింట శరవేగంగా దూసుకెళ్తూ సంచలనం సృష్టిస్తోంది. అత్యద్భుతమైన విజువల్ గ్రాండియారిటీ.. మనసును హత్తుకునే గాఢమైన భావోద్వేగాలతో కూడిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. విఠాబాయి నారాయణ్‌గాంకర్ అమర గాథను వెండితెరపై వీక్షించేందుకు ప్రేక్షక లోకంలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా శ్రద్ధా కపూర్ నటన ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ కానుంది. అయితే ప్రమోషన్స్ లో ఇలా కాలు మీద కాలు వేసుకుని కూచుని అందరి మోములో ముసిముసి నవ్వులకు కారణమైంది.