ఐకాన్ స్టార్ క్రేజీ లైనప్‌పై మళ్లీ అగ్గి రాజేసాడు!
భారతీయ సినిమా రంగంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు అత్యంత ప్రాముఖ్యత కలిగిన స్టార్.
భారతీయ సినిమా రంగంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు అత్యంత ప్రాముఖ్యత కలిగిన స్టార్. పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ కి బాటలు వేస్తున్న స్టార్ అతడు. అందుకే అల్లూ సినిమాల లైన్-అప్ పై అందరిలోను ఒకటే ఆసక్తి. బన్ని నటిస్తున్న సినిమాలపై ఇప్పటికే తెలుగు వినోద చానెళ్లలో బోలెడన్ని కథనాలు అందించాయి. ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నహతా మరోసారి ఐకాన్ స్టార్ ప్రాజెక్టులపై రివ్యూ చేయడం ఉత్తరాది ట్రేడ్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బన్ని క్యూలో ఉన్న దర్శకుల జాబితాను వివరిస్తూ.. స్వయంగా బాలీవుడ్ ప్రముఖ విశ్లేషకుడే అల్లు అర్జున్ లైనప్ పై స్పందించడంతో ఉత్తరాది మీడియాలోనూ, హిందీ ట్రేడ్ లోనూ ఈ ప్రాజెక్టులపై ఆసక్తి పెరగడంతో పాటు అంచనాలు మరింతగా పెరిగాయి. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ప్రభాస్ తర్వాత ఆ స్థాయిలో స్పీడ్ చూపిస్తూ తన మార్కెట్ పరిధిని పాన్-వరల్డ్ రేంజుకు విస్తరిస్తున్న ఏకైక హీరోగా అల్లు అర్జున్ నిలుస్తున్నారు.
ఐకాన్ స్టార్ మ్యాసివ్ లైనప్ పై కోమల్ నహతా విశ్లేషణను పరిశీలిస్తే.. అట్లీతో రాకా, లోకేష్ కనగరాజ్ తదుపరి చిత్రం ..బాసిల్ జోసెఫ్, సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్లతో కలిసి చేస్తున్న చిత్రాలు, పుష్ప 3 తో కూడిన ఒక అద్భుతమైన లైనప్ ఉంది. మొదటగా దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న `రాకా` అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విడుదలకు వస్తుంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ప్లాట్ లైన్ పునర్జన్మల కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకుంటోంది. అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా.. రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని టాక్. భారీ విజ్యువల్ ఎఫెక్ట్స్, హాలీవుడ్ స్టాండర్డ్స్ సాంకేతికతతో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామాను డిసెంబర్ 2027లో గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మరోవైపు లోకేష్ కనగరాజ్- అల్లు అర్జున్ కాంబినేషన్లోని AA23 చిత్రంపైనా శరవేగంగా అప్డేట్స్ అందుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందంటూ కొద్దిరోజులుగా ప్రచారం సాగుతున్నా.. చివరికి రూమర్లకు లోకేష్ స్వయంగా బ్రేక్ వేస్తూ బన్నీతో దిగిన ఫోటోగ్రాఫ్ని షేర్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అట్లీ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే లోకేష్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక దీనితో పాటు సందీప్ రెడ్డి వంగా - టీ సిరీస్ కాంబినేషన్ మూవీ.. ప్రశాంత్ నీల్-దిల్ రాజు కాంబినేషన్లో తెరకెక్కాల్సిన `రావణం`.. మిన్నల్ మురళి ఫేమ్ బేసిల్ జోసెఫ్‌తో మూవీ బన్నీ కెరీర్ లో అత్యంత కీలకం కానున్నాయి. . అట్లీ, లోకేష్ కనగరాజ్, సందీప్ వంగా, ప్రశాంత్ నీల్ వంటి టాప్ డైరెక్టర్లతో పాటు సుకుమార్ తోను బన్ని మరో సినిమా చేయాల్సి ఉంటుంది. పుష్ప, పుష్ప 2 చిత్రాలకు కొనసాగింపుగా `పుష్ప 3` కూడా పైప్‌లైన్‌లో ఉందని కథనాలొచ్చాయి. సుకుమార్ సైలెంట్ గా ఈ సినిమా కథాంశాన్ని కూడా వండిస్తున్నట్టు గుసగుసలు ఉన్నాయి.
అల్లు అర్జున్ లైనప్ విన్న అభిమానులు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో సందడి చేస్తున్నారు. AA-అరాచకం అంటూ కొందరు... మేక్ వే ఫర్ ది కింగ్ అని మరికొందరు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం రెండేళ్లకు ఒక సినిమా చొప్పున ఈ 5-6 సినిమాలు పూర్తి కావడానికి మరో 15-20 ఏళ్లు పడుతుందేమో! అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. అయితే టాలీవుడ్‌లోని ఇతర టాప్ స్టార్లు అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి హీరోల కంటే భిన్నంగా అల్లు అర్జున్ పక్కా ప్లానింగ్‌తో గ్లోబల్ లైనప్‌ను డిజైన్ చేసుకుంటున్న తీరు పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
మొత్తానికి `పుష్ప-2` తర్వాత వస్తున్న ఈ సినిమాల స్కేల్- కాన్వాసు చూస్తుంటే.. అల్లు అర్జున్ కేవలం టాలీవుడ్ లేదా పాన్-ఇండియా హీరోగా మాత్రమే కాకుండా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారని స్పష్టమవుతోంది. రానున్న ఐదేళ్ల కాలం అల్లు అర్జున్ బాక్సాఫీస్ విధ్వంసానికి వేదిక కాబోతోందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.