త్రివిక్రమ్.. ఈ అట్లీతో పెద్ద చిక్కొచ్చి పడిందే
అల్లు అర్జున్ పుష్ప 2 కోసం ఎన్నడూ లేనంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాడు.;
అల్లు అర్జున్ పుష్ప 2 కోసం ఎన్నడూ లేనంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ తో 1000 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ ను బ్రేక్ చేయాలి అనే కసితో అయితే ఉన్నాడు. ఇక అందుకు తగ్గట్టుగా సుకుమార్ కూడా ప్రాజెక్టును మరింత బలంగా రూపొందిస్తున్నాడు. అందుకే సమయాన్ని లెక్క చేయడం లేదు. స్క్రిప్టు మొత్తం పర్ఫెక్ట్ గా సిద్ధమైన తర్వాతనే షూటింగ్ మొదలుపెట్టారు.
ఇక వచ్చే ఏడాది సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్టును మొదలు పెట్టాలని అనుకున్నాడు. మరోవైపు త్రివిక్రమ్ మహేష్ బాబుతో చేస్తున్న గుంటూరు కారం సినిమాను 2024 జనవరి కి విడుదల చేయబోతున్నాడు.
ఇక ఆ తరువాత త్రివిక్రమ్ వెంటనే బన్నీతో సినిమా అయితే మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఈ కాంబినేషన్ కంటే ముందు బన్నీ మరో దర్శకుడిని తీసుకువచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే గుంటూరు కారం సినిమా జనవరిలో విడుదలైన తర్వాత త్రివిక్రమ్ బన్నీ ప్రాజెక్టు స్క్రిప్ట్ పనుల కోసం మినిమం ఒక 5 లేదా 6 నెలల సమయం అయితే తీసుకోవాల్సి ఉంటుంది.
కాబట్టి ఈ గ్యాప్ లో బన్నీ వీలైనంత త్వరగా ఏడాది చివరిలోపే పుష్ప సెకండ్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ పనులు అన్నీ కూడా ఫినిష్ చేసుకోని ముందు అట్లీ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలి అని ఆలోచిస్తున్నాడు. అతనితో మాట్లాడేందుకే ఇటీవల ముంబై కూడా వెళ్ళాడు. అంతా బాగానే ఉంది కానీ ఒక విషయంలో మాత్రం ఇప్పుడు డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి.
ఈ రోజుల్లో ఒక బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాను ఫినిష్ చేయాలి అంటే చాలామంది అగ్ర దర్శకులు మినిమం ఒక ఏడాది సమయం అయితే తీసుకుంటున్నారు. ఇక మరికొందరైతే రెండేళ్ల సమయం కూడా తీసుకుంటున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితేనే సినిమా ఏడాదిలో ఫినిష్ అవుతోంది. ఇక అంతకంటే తక్కువ సమయంలో స్టార్ హీరోల ఫ్యాన్ ఇండియా సినిమాలను ఫినిష్ చేయడం అంటే ఈ రోజుల్లో సాధారణమైన విషయం కాదు.
ఎంత కరెక్ట్ గా అనుకున్నా కూడా ఏదో ఒక ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ 2024 మొదట్లోనే అట్లీ సినిమాను మొదలుపెట్టి అదే ఏడాది జూన్ లేదా జూలైలో ఫినిష్ చేయాలనేది అసలు ప్లాన్. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్టును మొదలుపెట్టాలని బన్నీ ఆలోచన. అయితే అట్లే అనుకున్న సమయానికి ప్రాజెక్టును పూర్తి చేయగలడా లేదా అనేది అసలు ప్రశ్న. ఏ మాత్రం ఆలస్యమైనా కూడా మళ్లీ త్రివిక్రమ్ ఇంకాస్త వెయిటింగ్ లిస్టులో ఉండాల్సిందే. మరి అట్లీ ప్రభావం త్రివిక్రమ్ పై పడుతుందా లేదా అనేది చూడాలి.