రానా విడుదల చేయబోతున్న 'అమీర్ లోగ్' నుండి మాసీ ర్యాపో "బజారే బ్యాన్జో" సాంగ్ రిలీజ్!
ఈ హిందీ ర్యాప్ పాటకు.. డబుల్ ఈ వసీం సాహిత్యాన్ని గాత్రాన్ని అందించగా.. షభాజ్ ఖాన్ వాయిస్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్మరణ్ సాయి బాణీలు అందించారు.
ఇటీవల కాలంలో తెలంగాణ నేటివిటీకి తగ్గట్టుగా సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు మేకర్స్. పైగా ప్రాంతీయ చిత్రాలకు ఆడియన్స్ కూడా పట్టం కడుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు మరో చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది. అదే అమీర్ లోగ్.. పక్కా లోకల్, హైదరాబాద్ గల్లీని, బస్తీని తెరపై చూపించడానికి రాబోతున్న ఈ చిత్రాన్ని అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మించగా.. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
రమణారెడ్డి సోమ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎం సి హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ స్టార్ హీరో దగ్గుబాటి రానా సంస్థ స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని తెలుగులో ఆగస్టు 21న చాలా గ్రాండ్గా విడుదల చేయబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు ప్రమోషనల్ జోరు పెంచింది చిత్ర బృందం. అందులో భాగంగానే వరుసగా సినిమా నుండి పాటలను విడుదల చేస్తూ.. యూట్యూబ్ ను షేక్ చేస్తున్నారు.
ఇప్పటికే హైదరాబాద్ లోకల్ ఫ్లేవర్ ను చూపిస్తూ సినిమా నుండి విడుదల చేసిన పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందులో భాగంగానే తాజాగా "బజారే బ్యాన్జో"అంటూ హిందీ ర్యాప్ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఇది హైదరాబాదు యువతకు ప్రతీకగా నిలిచేలా ఉంది. ఈ పాటలో హైదరాబాదు సంస్కృతిని, బస్తీ యువతను గల్లీలను చాలా చక్కగా చూపించారు.
ఈ హిందీ ర్యాప్ పాటకు.. డబుల్ ఈ వసీం సాహిత్యాన్ని గాత్రాన్ని అందించగా.. షభాజ్ ఖాన్ వాయిస్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్మరణ్ సాయి బాణీలు అందించారు. పైగా ఈ పాటను హైదరాబాద్ యూత్ ఆంతం గా మార్చేలా ఉన్నారని చెప్పవచ్చు. పక్కా లోకల్ ఫ్లేవర్ తో హైదరాబాదులోని ఇంకో కోణాన్ని ఆవిష్కరించేలా.. ఈ అమీర్ లోగ్ ఉండబోతుందని చెప్పాలి. యువతకు మంచి సందేశాన్ని ఇచ్చేలా తెరకెక్కించిన ఈ మూవీకి ఎస్వీకే కెమెరా మెన్ గా పనిచేస్తుండగా.. రోహిత్ పెనుమత్స ఎడిటింగ్, స్మరణ్ సాయి మ్యూజిక్ అందిస్తున్నారు.
మొత్తానికి అయితే ఆగస్టు 21వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మొత్తానికి అయితే హైదరాబాద్ యువతకు ఈ పాటను డెడికేట్ చేస్తున్నారనడంలో సందేహం లేదు. పక్కా హైదరాబాద్ లోకల్ యువతను టార్గెట్ గా చేసుకొని వస్తున్న ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.