• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  Allu Aravind Three Stars:...

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

| తన జీవితంలో అసలైన స్టార్స్ ఎవరో నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించారు. ‘ఆకాశంలో ఒక తార’ ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ.. తాను సినిమా రంగంలోకి రావడానికి తండ్రి కారణమని, కెరీర్‌లో పెద్ద అడుగులు వేయడానికి చిరంజీవి తోడ్పడ్డారని చెప్పారు. ఇక చరణ్, బన్నీ వల్లే ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగగలిగానని, వీళ్లే తన జీవితంలోని నిజమైన స్టార్స్ అని పేర్కొన్నారు. పవన్ సాధినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి నటించిన ‘ఆకాశంలో ఒక తార’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-20 08:28 GMT

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన జీవితంలో తనకు ఎంతో ముఖ్యమైన వ్యక్తులు ఎవరో చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా స్టార్స్ అంటే సినిమా హీరోలు, హీరోయిన్లు గుర్తుకు వస్తారు. కానీ తన జీవితంలో అసలైన స్టార్స్ ఎవరో చెబుతూ ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆకాశంలో ఒక తార సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

ఈ సందర్భంగా అల్లు అరవింద్ తన జీవితంలో ఎదుగుదలకు కారణమైన వ్యక్తుల గురించి మాట్లాడారు. తన తండ్రి వల్లే తాను సినిమా రంగంలోకి అడుగుపెట్టానని చెప్పారు. "నేను సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి మా నాన్నే కారణం" అని తెలిపారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో మరింత ముందుకు వెళ్లడానికి ఎలా సహాయపడ్డారో వివరించారు.

"నా కెరీర్‌లో పెద్ద అడుగులు వేయడానికి మెగాస్టార్ చిరంజీవి కారణం" అని అల్లు అరవింద్ చెప్పారు. అలాగే రామ్ చరణ్, అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ..ఈ ఇద్దరి వల్లే తాను సినిమా రంగంలో ఇంతకాలం కొనసాగగలిగానని చెప్పారు. "ఈ ఫీల్డ్‌లో నేను ఎక్కువ కాలం కొనసాగడానికి చరణ్, బన్నీ కారణం. వీళ్లే నా స్టార్స్" అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు.

వాళ్లంతా తనకు ఎంతో దగ్గరైన వ్యక్తులని, అందుకే తన జీవితంలో వాళ్లే నిజమైన తారలని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ఇక ఆకాశంలో ఒక తార విషయానికి వస్తే.. పవన్ సాధినేని దర్శకత్వంలో ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మించారు. స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ సమర్పనలో వచ్చిన ఈ సినిమా నిన్ను ప్రీమియర్స్ నుంచి పాసిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

Tags:    
  • alluaravind 
  • chiranjeevi 
  • alluarjun 
  • ramcharan 
  • aakasamlookaTara 

Similar News

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

Copyright @2026

Powered by Blink CMS