• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సౌత్ ఇండ‌స్ట్రీపై...

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

| హిందీ సినిమాలతో కెరీర్ ప్రారంభించినా తనకు అసలైన గౌరవం, పారితోషికం, స్టార్‌డమ్ ఇచ్చింది దక్షిణాది చిత్ర పరిశ్రమేనని సమీరా రెడ్డి అన్నారు. చిరంజీవి, ఎన్టీఆర్, సూర్య, అజిత్, మోహన్‌లాల్‌తో పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. సినిమాలకు దూరమై 18 ఏళ్లు గడిచినా సౌత్ ప్రేక్షకుల అభిమానం తగ్గలేదని, తాను ఎప్పటికీ సౌత్ ఇండియన్ నటిగానే గర్వపడతానని చెప్పారు.

By - Srikanth Kontham
Update: 2026-11-20 09:21 GMT

సౌత్ వర్సెస్ నార్త్ అనే అంశం నిత్యం చ‌ర్చ‌కొస్తూనే ఉంటుంది. సౌత్ సినిమాల స‌క్సెస్ ను బాలీవుడ్ అంత తొంద‌ర‌గా అంగీక‌రించ‌దు. అన్ని ప‌రిశ్ర‌మ‌ల కంటే తామే గొప్ప అన్న ధోర‌ణి హైలైట్ అవుతుంటుంది. అయితే ఇదంతా ఒక‌ప్ప‌టి మాట. ప్ర‌స్తుతం పాన్ ఇండియాలో సౌత్ ఇండ‌స్ట్రీ ఏ రేంజ్ లో దూసుకుపోతుందో తెలిసిందే. దేశంలోనే సౌత్ ప‌రిశ్ర‌మ‌లు నెంబ‌ర్ వ‌న్ లో కొన‌సాగుతున్నాయి. తాజాగా రాజమండ్రి బ్యూటీ.. సీనియర్ నటి సమీరా రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

హిందీ సినిమాలతోనే కెరీర్ మొదలుపెట్టి అక్కడే ఎక్కువ సినిమాలు చేసినా? తనకు అసలైన గౌరవం, పారితోషికం, స్టార్‌డమ్ ఇచ్చింది మాత్రం దక్షిణాది చిత్ర సీమేనని స‌మీరా కుండబద్దలు కొట్టారు. తాను ఎప్పటికీ సౌత్ ఇండియన్ నటిగానే గర్వంగా చెప్పుకుంటానని స్పష్టం చేశారు. దక్షిణాది సినిమాల్లో పని సంస్కృతి.. సౌందర్య ప్రమాణాలపై కొందరు హీరోయిన్లు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సమీరా రెడ్డి అనుభవాలను పంచుకున్నారు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, సూర్య, అజిత్, మోహన్‌లాల్ వంటి అగ్ర కథానాయకులతో కలిసి పనిచేసిన రోజులు తన సినీ ప్రయాణంలో అత్యుత్తమ జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని స‌మీరా గుర్తు చేసుకున్నారు.

సినిమాలకు దూరమై పద్దెనిమిదేళ్లు గడుస్తున్నా? దక్షిణాది ప్రేక్షకులు తనపై చూపించే అభిమానం ఏమాత్రం తగ్గలేదన్నారు. హిందీ ప్రేక్షకులు తనను చూస్తే ఒకప్పుడు సమీరా రెడ్డి అని ఒక నటి ఉండేది కదా అని గుర్తుచేసుకుంటారని.. కానీ దక్షిణాది అభిమానులు మాత్రం ఇప్పటికీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తార‌న్నారు. ఆ ఆదరణే మనసులో సౌత్ సినిమాకు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చిందన్నారు.

చాలా కాలం తర్వాత స‌మీరా రెడ్డి మ‌ళ్లీ సంజయ్ దత్ న‌టించిన `ఆఖ్రీ సవాల్` సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇదే ఏడాది ఆ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. కానీ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అయింది. 30 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కించిన చిత్రం 3 కోట్ల వ‌సూళ్ల స‌రిపెట్టుకుంది. దీంతో స‌మీరాకు ఈ ప్లాప్ ప్ర‌తికూలంగా మారుతుంది. సినిమాల్లో కంటున్యూ అవ్వాల‌ని ఉన్నా? ఫేం కోల్పోవ‌డంతో కొత్త అవ‌కాశాలు అందుకోవ‌డం క‌ష్ట మ‌వుతుంది.

ప్ర‌స్తుతాని బాలీవుడ్ లో మ‌రే సినిమా చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాలు అందుకుంటుందే చూడాలి. స‌మీరా రెడ్డి తెలుగులో `న‌ర‌సింహుడు`, ` జై చిరంజీవా`,` అశోక్` చిత్రాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాలేవి అమ్మ‌డికి పెద్ద‌గా క‌లిసి రాలేదు. దీంతో బాలీవుడ్ సినిమాల‌పైనే ఫోక‌స్ పెట్టి అక్క‌డే స్థిర‌ప‌డిన సంగ‌తి తెలిసిందే.

Tags:    
  • sameerareddy 
  • southcinema 
  • bollywood 
  • southvsnorth 

Similar News

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

Copyright @2026

Powered by Blink CMS