హీరోలనే డామినేట్ చేస్తున్న బ్యూటీస్.. మొన్న రుక్మిణీ.. నేడు వామిక!

ఈమె క్యారెక్టర్, నటన సినిమాకే హైలెట్ అని , కొన్ని చోట్ల లోకేష్ ను డామినేట్ చేసి నటించింది అంటూ తెగ పొగిడేస్తున్నారు.

Update: 2026-08-09 05:50 GMT

ఒకప్పుడు హీరోయిన్స్ అంటే కేవలం గ్లామర్ పాత్రలకు లేదా హీరోని ప్రేమించడానికి, పెళ్లి చేసుకోవడానికి ఇలాంటి పాత్రలకే పరిమితం చేసే వాళ్ళు. కానీ కాలం మారుతోంది. హీరోయిన్స్ లో కూడా కొత్త మార్పులు వస్తున్నాయి. కేవలం గ్లామర్ పాత్రలకే కాకుండా యాక్షన్ తో పాటు మాస్ పర్ఫామెన్స్, డీ గ్లామరస్ పాత్రలు పోషించడానికి కూడా వెనుకాడడం లేదు. ముఖ్యంగా ఎంతోమంది సీనియర్ స్టార్ హీరోయిన్లను.. మొదలుకొని నేటి తరం యంగ్ భామల వరకు విలనిజం పండించడానికి కూడా సిద్ధమవుతున్నారు.

హీరోలనే డామినేట్ చేస్తున్న హీరోయిన్స్..

ఇంకా చెప్పాలి అంటే సినిమాలలో హీరోలనే డామినేట్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారనే చెప్పాలి. అలాంటి వారిలో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మొన్నటికి మొన్న రుక్మిణీ వసంత్.. నేడు వామికా గబ్బి.. రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంతారా చాప్టర్ వన్. గతంలో వచ్చిన కాంతారా చిత్రానికి ప్రీక్వెల్ ఇది. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించింది.మొదటి నుండి తన రాజసంతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. చివరిగా క్లైమాక్స్లో విలన్ గా కనిపించి అబ్బరపరిచింది.పైగా కొన్ని సీన్స్ లో హీరోని డామినేట్ చేస్తూ నటించింది అనే ప్రశంసలు కూడా అందుకుంది. అలా రిషబ్ శెట్టితో సమానంగా నటిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంది రుక్మిణి వసంత్.

లోకేష్ నే మించిపోయిన వామిక గబ్బి..

అయితే ఇప్పుడు మరో హీరోయిన్ పేరు అధికారికంగా వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి. విలక్షణ దర్శకుడిగా తన మార్క్ టేకింగ్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా మారి ఇటీవల నటించిన తొలి చిత్రం డీసీ. ఆగస్టు 7వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఇందులో చంద్ర అనే పాత్రలో నటించింది బాలీవుడ్ బ్యూటీ వామిక గబ్బి. అయితే తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా సినిమాలో ఈమె నటనను చూసి ప్రేక్షకులు ఈమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

వామికా స్క్రీన్ ప్రెజెన్స్ పై ప్రశంసలు..

ఈమె క్యారెక్టర్, నటన సినిమాకే హైలెట్ అని , కొన్ని చోట్ల లోకేష్ ను డామినేట్ చేసి నటించింది అంటూ తెగ పొగిడేస్తున్నారు. అంతేకాదు స్క్రీన్ ప్రెజెన్స్, పర్ఫామెన్స్ తో అదరగొట్టేసారని వామికాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు హీరోయిన్లు కూడా తామేమీ తక్కువ కాదంటూ ఏకంగా హీరోలనే డామినేట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

వామికా మూవీ కెరియర్..

వామిక గబ్బి విషయానికి వస్తే.. హిందీలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వామికా.. పంజాబీలో కూడా నటిస్తోంది.ఇక తెలుగులో తొలిసారి 2015లో భలే మంచి రోజు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సుధీర్ బాబు, వామికా గబ్బి, ధన్య బాలకృష్ణ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ప్రస్తుతం హిందీ, మలయాళం, పంజాబీ అంటూ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అటు సినిమాలలోనే కాదు ఇటు టెలివిజన్ సిరీస్ లో కూడా నటిస్తూ మరింత బిజీగా మారింది వామికా గబ్బి.

Tags:    

Similar News