స్టార్ హీరోల మ‌ధ్య‌ మాస్ ఫైట్!

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం `మాన్‌స్టర్` అనే చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2026-09-24 13:30 GMT

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం `మాన్‌స్టర్` అనే చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్రకటన వెలువడినప్పటి నుంచే సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్న తమిళ నటుడు అరవింద్ స్వామి- సల్మాన్ ఖాన్‌తో కలిసి కీలక ఘట్టాల చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం చిత్ర బృందం ముంబైలో 10 రోజుల షూటింగ్ షెడ్యూల్‌ను నిర్వహిస్తోంది.

అందులో భాగంగా అరవింద్ స్వామి ప్రత్యేకంగా మూడు రోజుల పాటు సల్మాన్ ఖాన్‌ కాంబినేషన్‌లో వచ్చే పోరాట ఘ‌ట్టాలు చిత్రీక‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రైలు నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ఈ షెడ్యూల్‌లో భాగంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే ప్ర‌త్యేక ఆకర్షణగా నిలుస్తుంద‌ని చిత్ర బృందం ధీమా వ్య‌క్తం చేస్తుంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ - అరవింద్ స్వామి పాత్రల నడుమ పిల్లి-ఎలుక ఆట సాగనుందిట‌. ఇద్ద‌రి మధ్య వచ్చే పవర్‌ఫుల్ డ్రామా, యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను సీట్ల అంచులపై కూర్చోబెట్టేలా డిజైన్ చేస్తున్నారుట‌.

సల్మాన్ ఖాన్‌తో కాంబినేషన్ సీన్లు పూర్తయిన తర్వాత అరవింద్ స్వామికి సంబంధించిన సోలో సన్నివేశాలను మిగిలిన రోజుల్లో చిత్రీకరించనున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాల కోసం మేకర్స్ ప్రత్యేకంగా కొరియోగ్రఫీ, డిజైనింగ్‌పై తీవ్రంగా శ్రమిస్తున్నారు. విజువల్స్‌పరంగా ప్రతి సన్నివేశం గ్రాండ్‌గా, వినూత్నంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. సెట్స్‌లో సల్మాన్ ఖాన్ కూడా ఎంతొ ఉత్సాహంతో పాల్గొంటున్నారు. యాక్షన్ బ్లాక్స్ ప్రాపర్ డిజైనింగ్ , ఎగ్జిక్యూషన్‌లో తన వంతు సూచనలు అందిస్తూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం.

చిత్రాన్ని బిగ్ స్క్రీన్ విజువల్ స్పెక్టకిల్‌గా తీర్చిదిద్దడానికి నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఇందులో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. అరవింద్ స్వామితో పాటు రాహుల్ దేవ్, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర కీలక ప్రతికూల పాత్రలలో అలరించనున్నారు. ఈ బిగ్ బడ్జెట్ మూవీని 2027 ఈద్ పండగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

Tags:    

Similar News