300 కోట్ల క్లబ్లో టాప్ -5 హిందీ హీరోలు
| బాలీవుడ్లో 300 కోట్ల క్లబ్లో పలుమార్లు చేరిన హీరోల జాబితాలో రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్, సల్మాన్ ఖాన్ ముందున్నారు. ఈ ముగ్గురూ మూడేసి విజయాలు అందుకోగా, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సన్నీ డియోల్ రెండేసి చిత్రాలతో ఈ క్లబ్లో నిలిచారు. విక్కీ కౌశల్ కూడా ఛావాతో ఈ జాబితాలో చేరారు. రామాయణ, ధురంధర్ వంటి ఫ్రాంచైజీల విజయాలతో ఈ వసూళ్ల రేసు మరింత ఆసక్తికరంగా మారింది.
ఒకప్పుడు 100 కోట్ల క్లబ్ గురించి చాలా చర్చ సాగేది. కానీ ఇటీవలి కాలంలో 500 కోట్ల క్లబ్, 1000 కోట్ల క్లబ్ అంటూ లెక్కలు మారిపోయాయి. 2000-3000 కోట్ల మధ్య వసూలు చేస్తున్న పాన్ ఇండియన్ సినిమాలు ప్రపంచం దృష్టిని గొప్పగా ఆకర్షిస్తున్నాయి.
అయితే నికర వసూళ్లలో 500 కోట్ల క్లబ్ లలో ఇంకా పూర్తిగా స్థిరపడిపోలేదు. కంటిన్యూగా ఈ రేంజు వసూళ్లు ఎవరి వల్లా కావడం లేదు. దేశంలో బడా హీరోలుగా పేరున్న హిందీ హీరోలకు కూడా ఇంకా ఆ స్థాయి సుస్థిరమైన స్టామినా లేదు. వరుసగా 4-5 సినిమాలు ఈ క్లబ్ ని అందుకోవడం సులువు కాదు. బాలీవుడ్ స్టార్లలో ఇప్పటివరకూ రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, సల్మాన్ ఖాన్ మూడేసి చొప్పున 300 కోట్ల క్లబ్ సినిమాల్లో నటించగా, ఆ తర్వాత షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ సన్నీడియోల్ రెండేసి చొప్పున 300 కోట్ల క్లబ్ లను అందుకున్నారు.
ఇటీవలే దురంధర్ ఫ్రాంఛైజీతో రణవీర్ సింగ్ రికార్డులు తిరగరాసాడు. అతడి కెరీర్ లో పద్మావత్, సింబా, దురంధర్ చిత్రాలు 300 కోట్ల క్లబ్ లను అందుకున్నాయి. ప్రతి సినిమాలో వైవిధ్యమైన నటనతో కట్టి పడేసిన రణ్ వీర్ క్రేజ్ గ్లోబల్ స్థాయిలో పెరిగింది. ఇప్పుడు రణబీర్ కపూర్ రామాయణ ఫ్రాంఛైజీతో సంచలనం సృష్టిస్తున్నాడు. ఈ ఫ్రాంఛైజీలో పార్ట్ 1 ఇప్పటికే 750 కోట్లు వసూలు చేసి 300 కోట్ల క్లబ్ ని అధిగమించింది. అంతకుముందు యానిమల్, సంజు చిత్రాలతో అతడు ఈ ఫీట్ ని అందుకున్నాడు. ఆ ఇద్దరితో పాటు కండల హీరో సల్మాన్ ఖాన్ మూడు సార్లు 300 కోట్ల క్లబ్ లను అందుకున్నాడు. అతడు నటించిన భజరంగీ భాయిజాన్, సుల్తాన్, టైగర్ జిందా హై చిత్రాలతో ఇది సాధ్యమైంది.
మరోవైపు కింగ్ ఖాన్ షారూఖ్, మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, సన్నీడియోల్ లాంటి సీనియర్లు కూడా రెండేసి చొప్పున 300 కోట్ల క్లబ్ లను అందుకున్నారు. షారూఖ్ నటించిన పఠాన్, జవాన్ చిత్రాలు ఈ ఫీట్ ని అందుకున్నాయి. అలాగే నిజానికి అమీర్ ఖాన్ పీకే చిత్రంతో తొలి 300 కోట్ల క్లబ్ ని బాలీవుడ్ కి అందించాడు. అతడు నటించిన స్పోర్ట్స్ డ్రామా దంగల్ ఇండియా, చైనాలో అద్భుత విజయం సాధించింది. ఈ చిత్రం 2000 కోట్లు వసూలు చేసింది.
మరో బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్ సైతం 300 కోట్ల క్లబ్లో ఉన్నాడు. అతడు నటించిన గదర్ 2, బార్డర్ 2 చిత్రాలు అఖండ విజయం సాధించి 300 కోట్ల క్లబ్ లను అధిగమించాయి. అయితే ఈ జాబితా మునుముందు మరింత పెరగనుంది. విక్కీ కౌశల్ ఇప్పటికే `చావా` సినిమాతో 300 కోట్ల నికర వసూళ్ల క్లబ్ లో చేరాడు. బాలీవుడ్ లోను యువతరం హీరోలు దూసుకొస్తున్నారు గనుక 300 కోట్ల క్లబ్ లు మరింత పెరిగే ఛాన్సుంది.
ఫుల్ రన్ లో గ్రాస్ వసూళ్లను పరిశీలిస్తే....
రణ్బీర్ కపూర్ నటించిన యానిమల్ ఫుల్ రన్ లో -917.76 కోట్లు, రామాయణ్ -పార్ట్ వన్ 750+ కోట్లు, సంజు 586.85 కోట్లు వసూలు చేయగా, రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్ 1,350 కోట్లు, పద్మావత్ 585 కోట్లు, సింబా 400+ కోట్లు వసూలు చేసాయి. సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయిజాన్ 969 కోట్లు, సుల్తాన్ 614.49 కోట్లు, టైగర్ జిందా హై 565.10 కోట్లు కలెక్ట్ చేసాయి.
షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ 1,148.32 కోట్లు, పఠాన్ 1,050.30 కోట్లు వసూలు చేయగా, సన్నీ డియోల్ నటించిన గదర్ 2 691.08 కోట్లు, బోర్డర్ 2 చిత్రం -464.5 కోట్లు వసూలు చేసాయి. ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ 2,024 కోట్లు, పీకే 769.89 కోట్ల వసూళ్లతో రికార్డులు తిరగరాసాయి.