• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి...

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

| రణ్‌బీర్, యశ్‌లకు ఒకే టైటిల్ కార్డు ఇవ్వడం, రాముడు, రావణుడి స్టంట్స్‌కు ఒక్కొక్క బాడీ డబుల్‌ను ఉపయోగించడం ‘రామాయణం’లోని ప్రత్యేకతలు. లక్ష్మణుడి పాత్రకు ముగ్గురు బాడీ డబుల్స్‌ను వాడారు. భారీ సెట్లను ఎనిమిది మంది సూపర్‌వైజర్లు పర్యవేక్షించారు. నవంబర్ 19 నాటికి ఈ సినిమా భారత్‌లో రూ.863.75 కోట్ల నెట్, ప్రపంచవ్యాప్తంగా రూ.1,547.15 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-20 10:20 GMT

రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన రామాయణం: పార్ట్ 1 ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విజువల్స్‌తో పాటు కథ, నటీనటుల పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటోంది. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ కనిపించారు. లక్ష్మణుడి పాత్రలో రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటించారు. అయితే సినిమా చూసిన చాలామంది ప్రేక్షకులు..ఎండ్ క్రెడిట్స్ ఆపుడు గమనించని కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ మారాయి.

ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, యశ్‌కు సంబంధించిన టైటిల్ కార్డ్స్ టీం చాలా బాగా ఆలోచించు వేసినట్లు ఉంది. సాధారణంగా పెద్ద హీరోలకు ప్రత్యేకంగా టైటిల్ కార్డ్స్ వేస్తుంటారు. కానీ ఈ సినిమాలో రాముడు, రావణుడి పాత్రలు పోషించిన రణ్‌బీర్, యశ్ పేర్లను ఒకే స్లైడ్‌లో చూపించారు. ఇద్దరు స్టార్ హీరోలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేకర్స్ ఇలా చేసినట్లు ఉన్నారు.

ఇక యాక్షన్ సన్నివేశాల విషయంలోనూ మేకర్స్ కొన్ని ఆసక్తికర నిర్ణయాలు తీసుకున్నారు. రాముడిగా నటించిన రణ్‌బీర్ కపూర్, రావణుడిగా కనిపించిన యశ్‌కు ప్రమాదకరమైన స్టంట్స్ కోసం ఒక్కొక్క బాడీ డబుల్‌ను మాత్రమే ఉపయోగించారు. అయితే లక్ష్మణుడి పాత్రలో నటించిన రవి దూబే కోసం మాత్రం ముగ్గురు బాడీ డబుల్స్‌ను ఉపయోగించడం విశేషం. వీరందరి పేర్లను సినిమా చివర్లో ఎండ్ క్రెడిట్స్‌లో కూడా ప్రస్తావించారు.

ఇక రామాయణం సినిమా కోసం భారీ సెట్స్ నిర్మించిన విషయం తెలిసిందే. ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు కొత్త ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతిని కలిగించేలా వీటిని రూపొందించారు. ఇంత పెద్ద సెట్స్‌ను నిర్వహించడం సాధారణ విషయం కాదు. అయితే ఈ భారీ సెటప్‌ను కేవలం ఎనిమిది మంది సెట్ సూపర్‌వైజర్లు పర్యవేక్షించినట్లు క్రెడిట్స్ లో వేసారు. ఇంతటి భారీ నిర్మాణాన్ని సమన్వయం చేయడం నిజంగా ఆసక్తికరమైన విషయం.

సినిమా సంగీతం విషయంలోనూ మరో ప్రత్యేకత ఉంది. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేసిన ఈ ప్రాజెక్టులో హాన్స్ జిమ్మర్ టీమ్ సభ్యుల పేర్లు కూడా ఎండ్ క్రెడిట్స్‌లో కనిపించాయి.

ఇదిలా ఉంటే, రామాయణం బాక్సాఫీస్ కలెక్షన్లు కూడా కొత్త రికార్డుల దిశగా సాగుతున్నాయి. విడుదలైన 15వ రోజు అంటే నవంబర్ 19న ఈ సినిమా ఇండియాలో రూ.19.35 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో దేశీయంగా మొత్తం నెట్ కలెక్షన్లు రూ.863.75 కోట్లకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లు సుమారు రూ.1,547.15 కోట్లకు చేరుకున్నాయి.

Tags:    
  • ramayana 
  • ranbirkapoor 
  • yash 
  • saipallavi 
  • ramayanapart1 

Similar News

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS