• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ ఏడాది తమిళ్ సినిమాల...

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

| ఈ ఏడాది తమిళ సినిమాలు వైవిధ్యమైన కథలు, కొత్త స్క్రీన్‌ప్లే, సహజమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జైలర్ 2, కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ వంటి చిత్రాలు విజయాలు సాధించాయి. మరోవైపు తెలుగులో కొన్ని భారీ చిత్రాలు ఆశించిన ఫలితాలు అందుకోలేదు. కంటెంట్, స్క్రీన్‌ప్లే, క్యారెక్టర్ ఆర్క్‌పై టాలీవుడ్ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

By - Gopi Velupala
Update: 2026-11-11 03:56 GMT

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్ని గొప్ప చిత్రాలు వచ్చినప్పటికి ఈ ఇయర్లో వచ్చిన కొన్ని పెద్ద సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. కొన్ని దశాబ్దాల నుంచి తమిళ్ సినిమా ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు పోటీని ఇస్తున్న తెలుగు ఇండస్ట్రీ ఈ ఇయర్ మాత్రం కొంతవరకు వెనకబడిపోయింది. తమిళ్ ఇండస్ట్రీలో కంటెంట్ బేస్డ్ సినిమాలు వచ్చి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి... మన సినిమాలు మాత్రం ఇంకా వెనుకబడి పోతున్నాయి. ఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద పరీక్ష ఎదురైంది... మన సినిమాలను బట్టి చూస్తే మన ఇండస్ట్రీ లో ఎలాంటి కంటెంట్ లు వస్తున్నాయో మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది...

తమిళ్ సినిమాల్లో ఉన్నది ఏంటి?

ఈ సంవత్సరం తమిళ సినిమాలు డిఫరెంట్ కంటెంట్ , స్క్రీన్ ప్లే లో వైవిధ్యం చూపించాయి. పాత్రల డైమెన్షన్స్ పక్కాగా రాసుకోవడం, సినిమా బ్యాక్ డ్రాప్ ను సెట్ చేసుకోవడంలో వాళ్ళు పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారు. ఈ సంవత్సరం తమిళ నుంచి వచ్చి సక్సెస్ అయిన సినిమాల లిస్ట్ చూద్దాం...

డీసీ

లోకేష్ కనకరాజ్ మాస్ లుక్ లో కనిపించి మ్యాజిక్ చేశాడు. కథ లో డిఫరెంట్ లేయర్స్ ఏమి లేకపోయినా సామాజిక అణిచివేతపై తిరుగుబాటు చేసే శక్తుల కథనాన్ని దర్శకుడు ఆకట్టుకునేలా మలిచాడు. దర్శకుడు వాడిన లాంగ్ షాట్స్, సీన్స్ లోని డిటెలింగ్ బాగా వర్కౌట్ అయ్యాయి. అన్ని కలిపి మూవీని సక్సెస్ ఫుల్ గా నిలిపాయి...

మొదరాత్రి

ఈ మూవీలో మనుషుల స్వభావాలు ఎలా ఉంటాయి. ఊరిలో ఉండే మహిళల మధ్య ఎలాంటి సంభాషణ ఉంటుందనే సన్నివేశాలను కామెడీ యాంగిల్ లో చూపించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఎలా సఫర్ అవుతారనేది చాలా బాగా చూపించారు. నేచురల్ గా ఉండే పాత్రలు ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్...

డోరతి

కార్తీక్ సుబ్బరాజు సినిమాలు చాలా నేచురల్ గా ఉంటాయి. సినిమా చూసినట్టుగా కాకుండా నిజ జీవితపు సన్నివేశాలను తెర మీద ఆవిష్కరించినట్టుగా సినిమాలను చేస్తుంటాడు. ఆడవాళ్ల బాధలను పట్టించుకోని మగ వాళ్ళు అలాగే ఆడవాళ్ళ కంటే మగాళ్లే గొప్ప అనే ఒక అహంకారంతో బతికే మనుషుల మధ్య ఆడవాళ్ల గొప్పతనం చెప్పడానికి ఒక మగాడే అమ్మాయిలా మారితే ఎలా ఉంటుందనే దర్శకుడి ఆలోచన స్క్రీన్ మీద చాలా బాగా వర్కౌట్ అయింది. దానిని ప్రజెంట్ చేసిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది.

జైలర్ 2

రజినీకాంత్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు విజిల్స్ తో థియేటర్ లో రచ్చ చేసే అభిమానులు ఉన్నారు. నెల్సన్ వాళ్ళందరిని ఏ మాత్రం నిరుత్సాహ పరచకుండా రజినీ మేనియా తో సినిమాను నడిపించారు. ఫైనల్ గా మూవీ కమర్షియల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచింది. ఈ సంవత్సరం తమిళ్ ఇండస్ట్రీ లో భారీ సక్సెస్ ను నమోదు చేసింది...

కరుప్పు (వీరభద్రుడు)

ఈ దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు అనే ఫాంటసీ కథతో తెరకెక్కిన ఈ మూవీని దర్శకుడు నడిపించిన విధానం అందరికీ నచ్చింది. సూర్య కి ఇచ్చిన ఎలివేషన్స్ ప్రేక్షకుడికి పూర్తిస్థాయిలో కనెక్ట్ అయ్యాయి. అందుకే సూపర్ హిట్ గా నిలిచింది.

విశ్వనాథ్ అండ్ సన్స్

వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. సూర్య క్లాస్ గా కనిపిస్తూనే ఫ్యామిలీ ఎమోషన్స్ తో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా ఫస్టాఫ్ స్క్రీన్ ప్లే బేస్డ్ గా నడిపించాడు. సెకండాఫ్ కథ కొంచెం పక్కకెళ్లినట్టు గా అనిపించిన క్లైమాక్స్ ప్రేక్షకులను ఎంగేజ్ చేసింది ఫైనల్ గా ప్రేక్షకులు ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు...

బత్త

బత్త అనే రౌడీ ఒక చిన్న పిల్లాడి వల్ల ఎలా మారాడు అనే చిన్న కథతో దర్శకుడు ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిచాడు. అలాంటి సెన్సిబుల్ అంశాలతో వచ్చింది కాబట్టే ఈ రోజు ఈ సినిమాకు స్పెషల్ స్థానం దక్కింది. తమిళ తెలుగులోనే కాకుండా ఈ మూవీ గురించి ఇండియా అంత మాట్లాడుకుంటున్నారు.

సీన్

క్రైమ్ కామెడీ యాక్షన్ చిత్రం గా తెరకెక్కిన ఈ మూవీ సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకుంది. దర్శకుడు సినిమాను ఎక్కడ బోర్ లేకుండా నడిపించిన తీరు బాగుంది. హీరో విలన్ మధ్య నడిచే క్యాట్ అండ్ మౌస్ గేమ్ చాలా ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది. ఇంతకు ముందు ఏ మూవీ లో లేని విధంగా ట్రీట్ మెంట్ రాసుకున్నాడు కాబట్టే దర్శకుడు అంత క్లారిటీ గా సినిమాను చేసి ప్రేక్షకులను మెప్పించాడు.

తెలుగులో ఇది లోపించిందా?

పైన చెప్పిన తమిళ్ సినిమాలు ఈ సంవత్సరం ప్రేక్షకులను అలరించాయి. కానీ ఈ ఇయర్ తెలుగులో వచ్చిన కొన్ని పెద్ద సినిమాలు ఆశించిన రేంజ్ లో సక్సెస్ ను సాధించలేదు. కారణం ప్రేక్షకుడికి రిలేట్ అయ్యే కంటెంట్ లేకపోవడం, స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేయలేకపోవడం, క్యారెక్టర్ ఆర్క్ లో కొత్తదనం లోపించడం, ప్రేక్షకుడికి ఫ్రెష్ ఫీల్ ఇచ్చే ట్రీట్ మెంట్ రాసుకోలేకపోవడం వీటివల్లే మన సినిమాలకు ఆడియన్స్ నుంచి ఆదరణ దక్కలేదు.

Tags:    
  • tamilcinema 
  • telugucinema 
  • movieanalysis 
  • contentdrivenfilms 
  • indianfilmindustry 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS