కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..
| ‘డోరతీ’ సినిమాలో కేవలం 15 నిమిషాల పాత్రలోనూ కీర్తి సురేష్ బలమైన ముద్ర వేశారని దర్శకుడు మిస్కిన్ ప్రశంసించారు. సినిమాలోని ఓ భావోద్వేగ సన్నివేశం తనను కదిలించిందంటూ, ప్రమోషనల్ ఈవెంట్లో తన చేతి ఉంగరాన్ని కీర్తికి బహుమతిగా ఇచ్చారు. ఆమెకు దేవుడి ఆశీస్సులు ఉండాలని భావోద్వేగంగా మాట్లాడారు.
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లలో గ్లామర్ ఛట్రంలో ఇరుక్కుపోకుండా.. ఇమేజ్ గురించి పట్టించుకోకుండా వైవిధ్యమైన పాత్రలతో సాగిపోయే నటీమణుల్లో కీర్తి సురేష్ ఒకరు. కథ, పాత్ర నచ్చితే.. చిన్న, పెద్ద అని తేడా లేకుండా ఏ హీరోతో అయినా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆమె రెడీగా ఉంటుంది. తన పాత్ర నిడివి గురించి కంటే ఇంపాక్ట్ గురించే కీర్తి ఆలోచిస్తుంది. అలా ఆలోచించే ‘డోరతీ’ లాంటి ప్రయోగాత్మక చిత్రంలో ఆమె భాగమైంది.
ఇందులో కీర్తి భర్తగా నటించిన యాక్టర్ పేరు కూడా జనాలకు తెలియదు. అలాగే ఇందులో కీర్తి పాత్ర కనిపించేది మహా అయితే ఓ పావుగంట. పైగా తన పాత్రను ముగించిన తీరు అదో రకమైన ఫీలింగ్ కలిగిస్తుంది. ఇలాంటి పాత్రను అందరు స్టార్ హీరోయిన్లూ ఒప్పుకోరు. కానీ కీర్తి మాత్రం ఎంతో ఉన్నతంగా ఆలోచించి ఈ పాత్ర చేసింది. పెర్ఫామెన్స్ విషయంలోనూ బలమైన ముద్ర వేసింది.
‘డోరతీ’లో కీర్తి పెర్ఫామెన్స్‌కు తమిళ లెజెండరీ డైరెక్టర్ మిస్కిన్ ఫిదా అయిపోయి.. ఆమె కొత్త చిత్రం ‘సత్యవన్ సావిత్రి’కి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో స్పందించిన తీరు అందరినీ కదిలించేసింది. తాను చూసిన తొలి కీర్తి చిత్రం ‘డోరతీ’నే అంటూ అందులో తన నటన గురించి చాలా గొప్పగా మాట్లాడాడు మిస్కిన్. ఈ సినిమా రిలీజైనపుడు తాను కెనడాలో ఉన్నానని.. ఉదయం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి ఈ సినిమాను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్న విషయం చెప్పాడని.. కానీ ఆ రోజు సినిమా చూశాక తాను కదిలిపోయానని మిస్కిన్ తెలిపాడు.
‘డోరతీ’ ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అని.. ముఖ్యంగా ఒక మగాడు తాను అమ్మాయిని అని తెలుసుకుని తన బాధను డోరతీ దగ్గర చెప్పుకున్నపుడు తల్లిలా తనకు అండగా నిలిచే సన్నివేశం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక ఐకానిక్ మూమెంట్ అని కొనియాడాడు మిస్కిన్. ఆ సన్నివేశంలో కీర్తి అత్యద్భుతంగా నటించిందని.. తనను కదిలించేసిందని చెబుతూ.. ఆమెకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాల్సిందే అంటూ తన చేతికి ఉన్న ఉంగరం తీసి కీర్తికి ఇచ్చేశాడు మిస్కిన్. తాను దేవుడిని నమ్మను అంటూనే కీర్తిని మాత్రం దేవుడు ఆశీర్వదించాలంటూ చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు మిస్కిన్. ఆయన చూపించిన ప్రేమకు కీర్తి ముగ్ధురాలైపోయి ఆయనకు దండం పెట్టేసింది.