• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీలీల ఈసారి తెలుగు...

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

| మెడికల్ ఇంటర్న్‌షిప్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చానని చెప్పిన శ్రీలీల.. ఇప్పుడు ఆ పనులు పూర్తవుతున్న నేపథ్యంలో మళ్లీ టాలీవుడ్‌పై దృష్టి పెడుతుందా అన్న చర్చ మొదలైంది. ప్రస్తుతం తమిళ, హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె.. ‘ఆషీకీ’ సీక్వెల్‌తో బాలీవుడ్‌లో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి.

By - Srikanth Kontham
Update: 2026-11-19 08:07 GMT

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయి శ్రీలీల ఎంత వేగంగా పాపుల‌ర్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు. స్టార్ హీరోల చిత్రాల్లో అప్పుడ‌ప్పుడే అవ‌కాశాలు అందుకుంటోంది అనుకుంటోన్న స‌మ‌యంలోనే అమ్మ‌డు ఒక్క‌సారిగా హైడ్ అయింది. తెలుగులో కొత్త సినిమాలకు సైన్ చేయడం తగ్గించడంతో శ్రీలీల కావాలనే టాలీవుడ్‌ను పక్కన పెడుతోందనే ప్రచారం జోరుగా సాగింది. అందుకు తగ్గట్టే ఆ సమయంలో తమిళ, హిందీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనుమానాలకు మరింత బలాన్నిచ్చింది. అయితే ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ శ్రీలీల ఇటీవల అసలు కారణాన్ని బయటపెట్టిన సంగ‌తి తెలిసిందే.

మెడికల్ కోర్సుకు సంబంధించిన ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాల్సి రావడం వల్లే కొత్త సినిమాలకు దూరంగా ఉన్నానని స్పష్టం చేసింది. చదువు, సినిమా రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కష్టమవడంతోనే కొంతకాలం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పిన మాటల్లో వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే డాక్టర్ పట్టా సాధించాలన్నది అమ్మ‌డి కలగా తొలి నుంచి చెబుతూనే ఉంది.

అయితేఊ తాజాగా ఇంటర్న్‌షిప్ పనులు కొలిక్కి వస్తున్న తరుణంలో అసలు ప్రశ్న మొదలైంది. శ్రీలీల చెప్పినట్లు నిజంగానే చదువు కోసమే సినిమాలు తగ్గించి ఉంటే ఇకపై మళ్లీ యథావిధిగా తెలుగు సినిమాలపై దృష్టి పెట్టాలి. ఇక్క‌డ దర్శక, నిర్మాత‌లు ఇచ్చే అవకాశాలకు మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి టాలీవుడ్‌లో జోరును కొనసాగించాలి. అలా కాకుండా ఇంకా కొత్త తెలుగు ప్రాజెక్టుల విషయంలో వెనకడుగు వేస్తే మాత్రం తెర వెనుక ఇంకేవో కారణాలు ఉన్నాయనే చర్చ మళ్లీ మొదలవ్వడం ఖాయం.

నిజానికి హిందీ తమిళ మార్కెట్లలో అడుగుపెట్టిన తర్వాత చాలామంది హీరోయిన్ల ఆలోచనా విధానం మారుతుంటుంది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు కోసం బాలీవుడ్ అవకాశాలపై ఎక్కువ ఆసక్తి చూపించడం సహజమే. శ్రీలీల విషయంలోనూ అదే జరుగుతోందా? లేక వరుస ఫ్లాపుల తర్వాత కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తోందా? అన్నది ఆసక్తికరంగా మారింది. గ్లామర్, డ్యాన్స్‌లకే పరిమితమయ్యే పాత్రలు కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న కథల కోసం ఎదురు చూస్తుండొచ్చు.

ప్ర‌స్తుతానికైతే శ్రీలీల త‌మిళ‌, హిందీ సినిమాల్లోనే న‌టిస్తోంది. అక్క‌డా మంచి ప్రాజెక్ట్ ల‌కే క‌మిట్ అవుతుంది. అవి గ‌నుక హిట్ అయితే అమ్మ‌డికి మంచి గుర్తింపు ద‌క్కుతుంది. `ఆషీకీ` సీక్వెల్ లో ఈ బ్యూటీనే హీరోయిన్ గా న‌టి స్తోంది. పాత్ర ప‌రంగా అమ్మ‌డు హ‌ద్దులు చెరిపేసే న‌టిస్తుంద‌నే ప్ర‌చారం ఇప్ప‌టికే ఉంది. ఈ పాత్ర గ‌నుక స‌క్సెస్ అయితే బాలీవుడ్ లో రొమాంటిక్ పాత్ర‌ల‌కు పెట్టింది పేరుగా శ్రీలీల మారుమ్రోగుతుంది.

Tags:    
  • sreeleela 
  • tollywood 
  • aashiquisequel 
  • bollywood 

Similar News

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

Copyright @2026

Powered by Blink CMS