• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మాతృశిశు మంగళ ఆశీర్వాదం...

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

| డెలివరీకి దగ్గరవుతున్న నేపథ్యంలో సమంతకు రాజ్ కుటుంబ సభ్యులు ‘మాతృ శిశు మంగళ ఆశీర్వాదం’ వేడుక నిర్వహించారు. ఇందులో శ్రీ సూక్తం, గాయత్రి దేవి హోమంతో పాటు 21 సార్లు గాయత్రి మంత్రం జపించారు. కుటుంబ పెద్దలు తల్లీబిడ్డలను ఆశీర్వదించారని రాజ్ సోదరి శీతల్ వెల్లడించారు.

By - Madhu Reddy
Update: 2026-11-19 08:08 GMT

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎక్కువగా సాంప్రదాయ పద్ధతులకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పెళ్లిళ్లను మొదలుకొని సీమంతం వేడుకల వరకు చాలామంది సెలబ్రిటీలు హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రత్యేకంగా నిర్వహించబడే పూజలు నిర్వహిస్తూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. రెగ్యులర్గా జరిగే వేడుకల కంటే కూడా ఈ సాంప్రదాయ వేడుకలు అటు నూతన దంపతులను, ఇటు తల్లీ బిడ్డలను క్షేమంగా ఉంచుతాయని నమ్మకమే ఈ వైపు అడుగులు వేయిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే మిగతా వారిని కాస్త పక్కన పెడితే.. సమంత తన వివాహాన్ని మొదలుకొని ఇప్పుడు సీమంతం వేడుకల వరకు కూడా అన్నీ కూడా చాలా ప్రత్యేక పద్ధతులలో జరుపుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇలాంటి పద్ధతుల్లో కూడా ఇలాంటి వేడుకలు జరుగుతాయా అంటూ నివ్వెరపోతున్నారు సినీ ప్రియులు. గత ఏడాది డిసెంబర్ 1న ఈషా ఫౌండేషన్ లో ఉన్న లింగ భైరవి ఆలయంలో భూత శుద్ధి వివాహం అనే ఒక పవిత్రమైన యోగ వివాహ పద్ధతిలో వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది.

ఆ తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్ లో శ్రీవిద్యా సాంప్రదాయం నుండి ప్రత్యేకమైన ఆచారంగా పిలవబడే శ్రీకల్పం పద్ధతిలో సీమంతం జరుపుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇందులో చక్రం మధ్యలో కూర్చోబెట్టి సమంతకు నిర్వహించిన ఈ సీమంతం వేడుక ప్రత్యేకంగా నిలిచింది. ఈ పద్ధతిలో కాబోయే తల్లిని దేవిగా గౌరవిస్తూ.. ప్రతి మంత్రానికి, నైవేద్యానికి ఒక ప్రత్యేక ప్రయోజనం ఉంటుందని సమంత తెలిపింది. అయితే ఈ వేడుకను ఆమె సన్నిహితురాలు, ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి ప్రత్యేకంగా దగ్గరుండి మరీ నిర్వహించిన విషయం తెలిసిందే

ఇకపోతే డెలివరీ కి దగ్గర పడుతున్న నేపథ్యంలో సమంతకు మరొకసారి రాజ్ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా వేడుక నిర్వహించారు. పూజలో కూర్చోబెట్టి.. కలశం మందు జరిపిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సమంత అధికారికంగా ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సమంతకు ఇప్పుడు జరిగిన వేడుక ప్రత్యేకత ఏంటి ? అంటూ కొంతమంది నెటిజన్లు కూడా ప్రశ్నించారు. అయితే ఈ విషయంపై సమంత వదిన, రాజ్ సోదరి శీతల్ ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ సమంతకు నిర్వహించిన వేడుకపై స్పందించింది.

సమంతకు మాతృ శిశు మంగళ ఆశీర్వాదం వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా శ్రీ సూక్తం, గాయత్రి దేవి హోమం నిర్వహించడంతోపాటు ఏకంగా 21సార్లు గాయత్రి మంత్రాన్ని జరిపించాము. ఈ సందర్భంగా మా పిన్ని శోభ రాజు కూడా సమంత కోసం ప్రత్యేకంగా ఒక పాటను కూడా పాడారు. కుటుంబంలోని పెద్దలంతా కలిసి సమంతాను పుట్టబోయే బిడ్డను ఆశీర్వదించారు. తల్లి బిడ్డలు క్షేమంగా ఉండాలని ఈ పద్ధతిలో వేడుక నిర్వహించారు అంటూ శీతల్ క్లారిటీ ఇచ్చింది.


Tags:    
  • samantha 
  • samantharuthprabhu 
  • maternityceremony 
  • seemantham 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS