హీరోయిన్ల వ్యక్తిగత జీవితాల్లో హీరోలు!
| హీరోలు ఎంచుకునే కథలు, పాత్రలు హీరోయిన్ల వ్యక్తిగత జీవితాలపైనా ప్రభావం చూపుతున్నాయని ఓ సర్వే విశ్లేషించినట్లు కథనం పేర్కొంది. లాంగ్ షెడ్యూళ్లు, విదేశీ షూటింగులు, పని ఒత్తిడి వల్ల వ్యక్తిగత సమయం తగ్గుతుందని, ఇవి వారి జీవనశైలి, నిర్ణయాలపై పరోక్ష ప్రభావం చూపవచ్చని అభిప్రాయపడింది.
సెట్స్‌లో జరిగే విషయాలు.. తెరపై కనిపించే కెమిస్ట్రీ పై బయట రకరకాల చర్చలకు దారితీస్తుంటాయి. సాధారణంగా హీరోయిన్లు ఎంచుకునే సినిమాల వల్ల వారి కెరీర్ గ్రాఫ్ మారుతుందని వింటుంటాం. కానీ హీరోలు ఎంపిక చేసుకునే పాత్రలు..కథలు కొందరు హీరోయిన్ల వ్యక్తిగత జీవితాలపైనా ప్రభావం చూపుతాయని తాజా సర్వేలో తేలడం ఆసక్తి రేపుతోంది. చూడటానికి వింతగా అనిపించినా సినీ రంగంలో పనిచేసే తీరుతెన్నులను గమనిస్తే ఇందులో దాగి ఉన్న కోణాలు చాలానే కనిపిస్తాయి.
హీరో ఎంచుకునే కథ ఆధారంగానే సినిమా షెడ్యూళ్లు.. లొకేషన్లు.. వర్కింగ్ స్టైల్ అన్నీ నిర్ణయిస్తారు. హీరో ప్రయోగాత్మక కథలు ..విభిన్నమైన పాత్రల వైపు మొగ్గు చూపిస్తున్నప్పుడు ఆ ప్రాజెక్టులో భాగమయ్యే హీరోయిన్ల రోజువారీ జీవితంపై కూడా ఆ ప్రభావం పడుతుంది. లాంగ్ షెడ్యూల్స్.. విదేశీ ప్రయాణాలు ..కఠినమైన షూటింగ్ వాతావరణం వల్ల వ్యక్తిగత సమయం.. కుటుంబంతో గడిపే క్షణాలు తగ్గిపోవడం వంటివి సహజంగానే జరుగుతుంటాయి.
అలాగే తెరపై హీరో పోషించే పాత్రల తీరు.. ఆ పాత్రలకు ఉండే ఇమేజ్ కూడా చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని మార్చేస్తుంటాయి. కొన్నిసార్లు ఒకే హీరోతో వరుస ప్రాజెక్టులలో పనిచేయడం వల్ల వృత్తిపరమైన అనుబంధంతో పాటు వ్యక్తిగత నిర్ణయాలపై కూడా ఆలోచనలు మారే అవకాశం ఉంటుందని సర్వే విశ్లేషిస్తోంది. ముఖ్యంగా కెరీర్‌లో ఏ దశలో ఉన్నారనే అంశాన్ని బట్టి ఇలాంటి కథల ఎంపికలు హీరోయిన్ల ప్రాధాన్యతలను.. జీవనశైలిని పరోక్షంగా ప్రభావితం చేస్తుంటాయన్నది కాదనలేని నిజం.
నిజానికి సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి ప్రయాణం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. హీరో కంఫర్ట్ జోన్ దాటి కొత్త కథలను ఎంచుకున్నప్పుడు.. ఆ సినిమాలోని ఇతర పాత్రధారులూ తమ కంఫర్ట్ జోన్‌ల నుంచి బయటకు రావాల్సి వస్తుంది. ఈ క్రమంలో వచ్చే ఒత్తిళ్లు.. కొత్త అనుభవాలు హీరోయిన్ల వ్యక్తిగత నిర్ణయాలపైనా? వారి లైఫ్‌స్టైల్‌పైనా? ఏదో ఒక రూపంలో ముద్ర వేస్తాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
తెర వెనుక జరిగే మార్పులు బయటకు పెద్దగా కనిపించకపోయినా? లోతుగా చూస్తే చాలా ప్రభావవంతంగా ఉంటాయని తెలుస్తోంది. హీరోల కథల ఎంపికలు బాక్సాఫీస్ లెక్కలకే పరిమితం కాకుండా తోటి నటీనటుల వ్యక్తిగత జీవితాల్లోనూ కొత్త మలుపులకు కారణమవుతున్నాయనే సర్వే అంశం ఫిలిం సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది.