• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టార్గెట్ రీచ్ అయితే...

టార్గెట్ రీచ్ అయితే న‌య‌న్ రిటైర్మెంట్ ఇచ్చేస్తుందా?

| నయనతార ఆస్తుల విలువ ఇప్పటికే ₹200 కోట్లకు చేరినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ₹400 కోట్ల ఆస్తులు సంపాదించాక సినిమాలకు రిటైర్మెంట్ ఇస్తానని విఘ్నేష్ శివన్ సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అయితే నయన్ నటనకు దూరమవుతారనే దానిపై స్పష్టత లేదు.

By - Srikanth Kontham
Update: 2026-11-19 07:58 GMT

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరి వెనుకా ఒక్కో ఆలోచన ఉంటుంది. కొంద‌రు సినిమాల్లోకి ఎంతో ప్యాషన్ తో వ‌చ్చి స‌క్సెస్ అవుతారు. ఆ విజ‌యం వారికి కోట్ల రూపాయ‌ల ఆదాయం తెచ్చి పెడుతుంది.

ఆ ర‌కంగా డ‌బ్బుతో పాటు పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కుతాయి. మరికొందరు మాత్రం తక్కువ కాలంలోనే భారీగా సంపాదించాలనే లక్ష్యంతో వస్తుంటారు. ఇక్కడ విజయం సాధిస్తే డబ్బు కీర్తి రెండూ ఒకేసారి వచ్చి పడతాయి. బయట ఏ రంగంలోనూ ఇంత వేగంగా ఇంత భారీగా సంపాదించడం సాధ్యం కాదనే మాట ఇండస్ట్రీలో ఎప్పుడూ విని పిస్తుంటుంది.

సరిగ్గా ఇదే కోణంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కెరీర్‌ను చూస్తే తాను కూడా ఆర్థిక లక్ష్యాల కోసమే ఇంతలా కష్టపడుతున్నారా? తాను అనుకున్న టార్గెట్ చేరుకుంటే? సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేస్తారా? అనే చర్చ ఆసక్తికరంగా మారింది. నయనతార ప్రయాణాన్ని గమనిస్తే అమ్మ‌డు కేవలం డబ్బు కోసమే వచ్చిన నటి అని చెప్పలేం. కానీ త‌న విలువను.. కెరీర్‌ను వ్యాపార కోణంలో స్పష్టంగా లెక్కలేసుకునే వ్యక్తిగా మాత్రం కనిపిస్తారు. దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయికలలో ఒకరిగా నిలదొక్కుకోవడం వెనుక న‌య‌న్ పడ్డ కష్టం.. ఎంచుకున్న ప్రాజెక్టుల తీరు స్పష్టంగా కనిపిస్తాయి.నటనను వృత్తిగా చూస్తూనే బ్రాండ్ విలువ‌ను నిలబెట్టు కోవడంలో నయన్ ఎప్పుడూ ముందుంటారు.

ఇటీవల న‌య‌న్ ఆస్తుల విలువ 200 కోట్ల మార్కు వద్ద ఉందనే వార్తలు రావడంతో భర్త విఘ్నేష్ శివన్ గతంలో చేసిన రిటైర్మెంట్ వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. 400 కోట్ల ఆస్తులు చేరిన తర్వాత సినిమాలు మానేసి వేరే రంగాలపై దృష్టి పెట్టే ఆలోచన ఉందంటూ గతంలో సరదాగా అన్న మాటలను చాలామంది సీరియస్‌గా తీసుకుని చర్చిస్తున్నారు. నిజంగానే ఆ స్థాయి సంపాదన చేతికి వస్తే నయనతార కెమెరా ముందుకు రావడం ఆపేస్తారా? అన్నది ఆసక్తి కలిగించే అంశం.

నిజానికి సినిమాల్లో సంపాదించే డబ్బును ఇతర వ్యాపారాలు, ఆస్తుల రూపంలో పదిలపరుచుకోవడం స్టార్స్‌కు కొత్తేమీ కాదు. నయన్, విఘ్నేష్ ఇప్పటికే పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి భవిష్యత్తుకు భరోసా ఏర్పర చుకుంటున్నారు. అయినా? ఇన్నేళ్లుగా లేడీ సూపర్ స్టార్‌గా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన నయనతార టార్గెట్ పూర్తయిందనే కారణంతో నటనకు పూర్తిగా దూరమవుతారా అనేది సందేహమే.

ఎందుకంటే నయనతారకు నటన అంటే ఆదాయ వనరు మాత్రమే కాదు. తన ఉనికిని చాటుకునే వేదిక కూడా. పెళ్లై.. పిల్లలు పుట్టిన తర్వాత కూడా బిజీగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఒకవేళ ఆర్థిక లక్ష్యాలు చేరుకున్నా? నచ్చిన కథలు, పవర్‌ఫుల్ పాత్రలు వచ్చినప్పుడు మళ్లీ తెరపై కనిపించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. డబ్బుతో పాటు ప్రేక్షకుల అభిమానం ఉన్నంతకాలం నయన్ ప్రయాణం కొన‌సాగుతూనే ఉంటుందని మెజార్టీ వ‌ర్గం భావిస్తుంది.

Tags:    
  • nayanthara 
  • vigneshshivan 
  • ladysuperstar 
  • southcinema 

Similar News

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

రాధిక ఆప్టే వివాదంలో చిక్కుకున్న కీర్తి సురేష్.. ఆ మాత్రం తెలియదా అంటూ ఫైర్!

2026-11-19 08:04 GMT

బీనా త్రిపాఠి గతం వెనుక విషాద ప్రేమకథ!

2026-11-19 07:56 GMT

తమన్నా టాలెంట్ కి ఆడియన్స్ ఫిదా.. భలే కలిసొస్తోందే?

2026-11-19 07:55 GMT

టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. హిట్ల వెనుక సీక్రెట్ ఫార్ముల?

2026-11-19 07:55 GMT

రామ్ పోతినేని 'RAPO23' ప్రీ లుక్ రిలీజ్.. చేతిలో గన్, మరో చేతిలో టెడ్డీ బేర్!

2026-11-19 07:53 GMT

హృతిక్ ముందు డ్యాన్స్ ముచ్చట్లు బయటపెట్టిన అనన్య!

2026-11-19 07:53 GMT

సౌందర్య నాకు గట్టి పోటీ ఇచ్చింది.. రమ్యకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-19 06:00 GMT

Copyright @2026

Powered by Blink CMS