• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సౌందర్య నాకు గట్టి పోటీ...

సౌందర్య నాకు గట్టి పోటీ ఇచ్చింది.. రమ్యకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు!

| దివంగత నటి సౌందర్య తనకు గట్టి పోటీ ఇచ్చిన హీరోయిన్లలో ఒకరని సీనియర్ నటి రమ్యకృష్ణ వెల్లడించారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, సౌందర్య తన కళ్ల ముందే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారని గుర్తుచేసుకున్నారు. ‘నరసింహ’లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడానికి తొలుత ఆలోచించినా, నటిగా తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించానని తెలిపారు.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-19 06:00 GMT

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ల మధ్య పోటీ ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ నటన, అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రతి హీరోయిన్ ప్రయత్నించేవారు. ఈ క్రమంలో కొందరు హీరోయిన్స్ తనకు గట్టి పోటీ ఇచ్చారని సీనియర్ నటి రమ్యకృష్ణ వెల్లడించారు.

ముఖ్యంగా దివంగత నటి సౌందర్య గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రమ్యకృష్ణ తన సినీ ప్రయాణం, అప్పటి హీరోయిన్ల గురించి, సౌందర్యతో తన అనుబంధం గురించి పలు విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా సౌందర్య గురించి మాట్లాడుతూ.. ఆమెపై ప్రశంసలు కురిపించారు. సౌందర్య తన కళ్ల ముందే ఎదిగిన హీరోయిన్ అని రమ్యకృష్ణ గుర్తు చేసుకున్నారు. తనతో సమానంగా సినిమాల్లో కొనసాగుతూ, క్రమంగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన విధానాన్ని దగ్గర నుంచి చూశానని చెప్పారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే సౌందర్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పుకొచ్చాడు.

సినిమా పరిశ్రమలో పోటీ సహజమని రమ్యకృష్ణ పేర్కొన్నారు. తన కెరీర్‌లో ఎంతోమంది హీరోయిన్లను చూశానని, వారిలో కొందరు క్రమంగా ఎదుగుతూ మాయమైపోయారని. మరికొందరు తనకు గట్టి పోటీ ఇచ్చారని వెల్లడించారు. అలాంటి వారిలో సౌందర్య ఒకరని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

అంతేకాదు నరసింహ సినిమా సమయంలో తన పాత్ర విషయంలో కూడా కొన్ని ఆలోచనలు వచ్చినట్లు రమ్యకృష్ణ తెలిపారు. ఆ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయాలా వద్దా అని మొదట ఆలోచించానని చెప్పారు. అయితే ఒకసారి కెమెరా ముందుకు వచ్చిన తర్వాత మాత్రం తన పూర్తి ప్రతిభను చూపించడానికి ప్రయత్నించేదాన్నని వివరించారు. పాత్ర ఎలాంటిదైనా నటిగా తన వంతు బాధ్యతను పూర్తిగా నిర్వర్తించేదాన్నని తెలిపారు.

Tags:    
  • ramyakrishna 
  • soundarya 
  • tollywood 
  • telugucinema 

Similar News

ప్రిన్స్ విలియం ముందు సైఫ్ అలీఖాన్ బోల్డ్ కామెంట్స్!

2026-11-19 05:36 GMT

కళ్ళుచెదిరే అందాలతో కియారా.. క్యూట్ లుక్ తో ఆకట్టుకుంటున్న కూతురు!

2026-11-19 05:32 GMT

'ధురంధర్ 2' డే 14 కలెక్షన్లను దాటేసిన రామాయణం!

2026-11-19 05:08 GMT

ట్రెండింగ్: స‌మంత త‌ర్వాత జెన్-Z లేడీ బాస్?

2026-11-19 05:01 GMT

8 కిలోల గజ్జెలతో శ్రద్ధా కపూర్ సాహ‌సం.. లావణి నృత్యం అంత క‌ష్ట‌మా?

2026-11-19 05:01 GMT

ఖ‌రీదైన ప‌చ్చ‌ల హారంతో మ‌హారాణినే త‌ల‌పించింది!

2026-11-19 05:01 GMT

టైసన్ నాయుడు టీజర్.. ఓల్డ్ సిటీలో ఇన్వెస్టిగేషన్ ట్విస్ట్

2026-11-19 04:56 GMT

'ఆకాశంలో ఒక తార' USA థియేటర్స్ లిస్ట్

2026-11-19 04:05 GMT

ఓటీటీలో దూసుకుపోతున్న 'హ్యాపీ జర్నీ'.. అమెజాన్ ప్రైమ్‌లో అద్భుత స్పందన!

2026-11-19 03:47 GMT

'ఈఎన్ఈ రిపీట్' మూవీ రివ్యూ

2026-11-19 03:30 GMT

మన సంస్కృతిని వాళ్ల దగ్గర తక్కువ చేసి మాట్లాడను.. రాధికా ఆప్టే వ్యాఖ్యలపై కీర్తి సురేష్ స్ట్రాంగ్ కౌంటర్!

2026-11-19 03:13 GMT

Copyright @2026

Powered by Blink CMS