• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టైసన్ నాయుడు టీజర్.....

టైసన్ నాయుడు టీజర్.. ఓల్డ్ సిటీలో ఇన్వెస్టిగేషన్ ట్విస్ట్

| బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న ‘టైసన్ నాయుడు’ టీజర్ ఆసక్తి రేకెత్తిస్తోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్, దాని వెనుక ఉన్న కుట్ర ప్రధానాంశాలుగా కనిపిస్తున్నాయి. రావు రమేష్, నేహా శెట్టి, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం ఆకట్టుకుంది.

By - M Prashanth
Update: 2026-11-19 04:56 GMT

మాస్ యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఈసారి ఒక ఇంటెన్స్ పోలీస్ డ్రామాతో రాబోతున్నారు. 'అప్పట్లో ఒకడుండేవాడు', 'భీమ్లా నాయక్' చిత్రాల దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా 'టైసన్ నాయుడు'. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ రిలీజైంది.

ఓల్డ్ సిటీ నేపథ్యంలో మొదలైన టీజర్, ఆరంభం నుంచే సీరియస్ మూడ్ లోకి తీసుకెళ్లింది. నగరంలో జరిగే అల్లర్లను అణచివేయడానికి రంగంలోకి దిగిన 'స్పెషల్ ఆపరేషన్స్ టీమ్' చుట్టూ కథ తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రఫ్ లుక్ లో ఆకట్టుకున్నారు. "నో అరెస్ట్.. నో రికార్డ్స్" అంటూ ఆయన చెప్పే డైలాగ్ క్యారెక్టర్ యాటిట్యూడ్ ను హైలెట్ చేసింది. మరోవైపు బాక్సింగ్ రింగ్ లో కనిపించిన షాట్ టైటిల్ కు జస్టిఫికేషన్ ఇచ్చేలా ఉంది.

అయితే ఇది జస్ట్ రొటీన్ పోలీస్ యాక్షన్ సినిమా మాత్రమే కాదని టీజర్ హింట్ ఇస్తోంది. ఒక డీల్ తప్పుదారి పట్టడం, దాని వెనుక దాగి ఉన్న పెద్ద కుట్రను ఛేదించే క్రమంలో వచ్చే ట్విస్టులు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. "అంతా కన్ఫ్యూజన్ గా ఉంది", "ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది" అనే డైలాగ్స్ తో పాటు రూబిక్స్ క్యూబ్ విజువల్స్ ద్వారా ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అనే ఫీల్ కల్పించారు.

ఈ టీజర్ లో భారీ క్యాస్టింగ్ ను పరిచయం చేశారు. పోలీస్ ఉన్నతాధికారిగా రావు రమేష్ కీలక పాత్రలో కనిపించగా సీనియర్ నటులు నరేష్, షాయాజీ షిండే తమ పాత్రలతో కథకు బలం చేకూర్చేలా ఉన్నారు. హీరోయిన్లు నేహా శెట్టి, ప్రగ్యా జైస్వాల్ కూడా హైలెట్ అయ్యారు. ఇంతమంది ఆర్టిస్టులు ఉండటంతో కథలో చాలా లేయర్స్ ఉన్నట్లు అర్థమవుతోంది.

సాంకేతికంగా టీజర్ రిచ్ గా కుదిరింది. సాగర్ కె చంద్ర గత చిత్రాల తరహాలోనే ఇందులోనూ రియలిస్టిక్ టచ్ తో పాటు గ్రిప్పింగ్ నేరేషన్ ఉండేలా కనిపిస్తోంది. భీమ్స్ సిసిరోలియో అందించిన ఎనర్జిటిక్ ఇంగ్లీష్ ర్యాప్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కు కొత్త ఫ్లేవర్ ఇచ్చింది. రొటీన్ కమర్షియల్ హంగులకు భిన్నంగా యాక్షన్ తో పాటు సస్పెన్స్ కలిపిన కథతో 'టైసన్ నాయుడు' సిద్ధమవుతున్నట్లు టీజర్ క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చారు. మరి థియేటర్లలో ఈ ఆపరేషన్ ఆడియన్స్ ను ఏ రేంజ్ లో ఎంగేజ్ చేస్తుందో చూడాలి.


Full View
Tags:    
  • tysonnaidu 
  • bellamkondasaisreenivas 
  • saagarkchandra 
  • nehashetty 

Similar News

'ధురంధర్ 2' డే 14 కలెక్షన్లను దాటేసిన రామాయణం!

2026-11-19 05:08 GMT

ట్రెండింగ్: స‌మంత త‌ర్వాత జెన్-Z లేడీ బాస్?

2026-11-19 05:01 GMT

8 కిలోల గజ్జెలతో శ్రద్ధా కపూర్ సాహ‌సం.. లావణి నృత్యం అంత క‌ష్ట‌మా?

2026-11-19 05:01 GMT

ఖ‌రీదైన ప‌చ్చ‌ల హారంతో మ‌హారాణినే త‌ల‌పించింది!

2026-11-19 05:01 GMT

'ఆకాశంలో ఒక తార' USA థియేటర్స్ లిస్ట్

2026-11-19 04:05 GMT

ఓటీటీలో దూసుకుపోతున్న 'హ్యాపీ జర్నీ'.. అమెజాన్ ప్రైమ్‌లో అద్భుత స్పందన!

2026-11-19 03:47 GMT

'ఈఎన్ఈ రిపీట్' మూవీ రివ్యూ

2026-11-19 03:30 GMT

మన సంస్కృతిని వాళ్ల దగ్గర తక్కువ చేసి మాట్లాడను.. రాధికా ఆప్టే వ్యాఖ్యలపై కీర్తి సురేష్ స్ట్రాంగ్ కౌంటర్!

2026-11-19 03:13 GMT

కొత్త 'జేమ్స్ బాండ్- 007' ఎంపికలో బెజోస్ ఫింగ‌రింగ్ దేనికి?

2026-11-19 03:12 GMT

విజ‌య్ ప్ర‌భుత్వం ఫిల్మీ ఫ్రెండ్లీ విధానాల‌తో కోలీవుడ్‌కి ఊర‌ట

2026-11-19 03:12 GMT

కోట్ల ఆస్తి ఉన్నా.. 4 వేలు ఖరీదు చేసే వాచ్ పెట్టుకోవడం వెనుక కారణం?

2026-11-19 03:11 GMT

Copyright @2026

Powered by Blink CMS