• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మన సంస్కృతిని వాళ్ల దగ్గర...

మన సంస్కృతిని వాళ్ల దగ్గర తక్కువ చేసి మాట్లాడను.. రాధికా ఆప్టే వ్యాఖ్యలపై కీర్తి సురేష్ స్ట్రాంగ్ కౌంటర్!

| రాధికా ఆప్టే వ్యాఖ్యల వివాదంపై కీర్తి సురేష్ స్పందించారు. తన ఉద్దేశం తెలుగు, తమిళ సంస్కృతులను తక్కువ చేయడం కాదని స్పష్టం చేశారు. ఆ సంప్రదాయం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ఉందని, కేరళలో లేదని తనకు తెలుసని చెప్పారు. ఇతరుల ముందు మన సంస్కృతిని ఎందుకు తక్కువ చేసి మాట్లాడతానని ప్రశ్నించారు.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-19 03:13 GMT

టాలీవుడ్ సంస్కృతిపై.. ఈమధ్య అక్క సినిమా ప్రమోషన్స్ టైం లో హీరోయిన్ రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రాధిక ఆ వ్యాఖ్యలు చేసేటప్పుడు పక్కనే కీర్తి సురేష్ కూడా ఉండింది.

తాజాగా ఈ వివాదంపై నటి కీర్తి సురేష్ స్పందించారు. తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని స్పష్టం చేశారు. ఇతరులకు మన సంస్కృతి గురించి వివరించే క్రమంలో దానిని తక్కువ చేసి మాట్లాడే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. దీంతో కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి.

ప్రస్తుతం కీర్తి సురేష్ తన రాబోయే చిత్రం సత్యవాన్ సావిత్రి ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక జర్నలిస్ట్ ఆమెను రాధికా ఆప్టే వివాదం గురించి ప్రశ్నించారు. వీరిద్దరూ కలిసి నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ అక్క లో నటించారు. ఆ సిరీస్ ప్రమోషన్ల సమయంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు ఎంత కాంట్రవర్సి సృష్టించాయో తెలిసిన విషయమే.

ఒక తెలుగు సినిమాలో తన పాత్రకు అంకుల్తో పెళ్లి జరగాల్సి వచ్చిందని, తనకంటే పెద్ద వయసున్న నటుడితో రొమాన్స్ చేయాల్సి వచ్చిందని రాధికా ఆప్టే తన అనుభవాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా, సంప్రదాయాల గురించి ఆమె మాట్లాడిన విధానంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయితే, అదే ఇంటర్వ్యూలో పక్కనే ఉన్న కీర్తి సురేష్ ఈ విషయాన్ని మరో కోణంలో వివరించే ప్రయత్నం చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వివాహ సంప్రదాయాలు ఉన్నాయని, అవి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సంస్కృతిలో భాగమని ఆమె చెప్పారు. ఇప్పుడు ఇదే అంశంపై జర్నలిస్ట్ మరోసారి ప్రశ్నించారు. రాధికా ఆప్టే అలా మాట్లాడినప్పుడు వెంటనే ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు.

దీనికి కీర్తి స్పందిస్తూ, రాధికా ఆప్టే చెప్పిన విషయం మొదట తనకు పూర్తిగా అర్థం కాలేదని తెలిపారు. అందుకే వెంటనే ఆ సంప్రదాయం గురించి వివరించడానికి ప్రయత్నించానని చెప్పారు. ఆ తర్వాత జర్నలిస్ట్ మరో ప్రశ్న వేస్తూ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పేర్లను మాత్రమే ఎందుకు ప్రస్తావించారని, కేరళ గురించి ఎందుకు చెప్పలేదని అడిగారు.

దీనిపై కీర్తి మాట్లాడుతూ, "అది తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సంప్రదాయం అని నాకు తెలుసు. కానీ కేరళలో అలాంటి సంప్రదాయం లేదు. కర్ణాటక గురించి నాకు తెలియదు" అని స్పష్టం చేశారు.

అంతేకాదు, తన మాటల వెనుక ఉద్దేశం ప్రాంతీయ సంస్కృతుల మధ్య ఉన్న తేడాలను వివరించడం మాత్రమేనని చెప్పారు. నార్త్ మీడియాలో మాట్లాడుతున్నప్పుడు మన సంస్కృతిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం తను ఎందుకు చేస్తాను అని కీర్తి అడిగారు. "వారి ముందు మన సంస్కృతిని నేనెందుకు తక్కువ చేసి మాట్లాడాలి?" అని తెలిపింది కీర్తి సురేష్.

Tags:    
  • keerthysuresh 
  • radhikaapte 
  • telugucinema 
  • tollywood 

Similar News

కొత్త 'జేమ్స్ బాండ్- 007' ఎంపికలో బెజోస్ ఫింగ‌రింగ్ దేనికి?

2026-11-19 03:12 GMT

విజ‌య్ ప్ర‌భుత్వం ఫిల్మీ ఫ్రెండ్లీ విధానాల‌తో కోలీవుడ్‌కి ఊర‌ట

2026-11-19 03:12 GMT

కోట్ల ఆస్తి ఉన్నా.. 4 వేలు ఖరీదు చేసే వాచ్ పెట్టుకోవడం వెనుక కారణం?

2026-11-19 03:11 GMT

ఆ నిర్ణయమే మృణాల్ కెరియర్ను నిలబెట్టిందా?

2026-11-19 03:10 GMT

కాలుష్యంపై అవ‌గాహ‌న‌.. టాలీవుడ్ తార‌లు పూనుకోవాలి!

2026-11-19 03:07 GMT

విలన్ పాత్రల వైపు అడుగులు వేస్తున్న హీరోలు...

2026-11-19 03:07 GMT

దుల్కర్.. హీరోయిన్లకు ఇదేం క్రేజ్!

2026-11-19 03:04 GMT

సింహం..రాజు మ‌ధ్య‌లో డూమ్స్ డే!

2026-11-19 03:02 GMT

ఉబర్ డ్రైవర్ గా పనిచేయడం వెనుక అసలు నిజం ఇదే - ప్రొడ్యూసర్ సృజన్!

2026-11-19 03:00 GMT

సంక్రాంతి 'కాకా' పై రూ.150 కోట్ల పందెం..!

2026-11-18 22:30 GMT

టైగ‌ర్ అంటే కాంతకు ఇష్ట‌మేనా?

2026-11-18 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS