• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సింహం..రాజు మ‌ధ్య‌లో...

సింహం..రాజు మ‌ధ్య‌లో డూమ్స్ డే!

| 2026 డిసెంబర్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొననుంది. డిసెంబర్ 17న హాలీవుడ్ చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్ డే’ విడుదల కానుండగా, డిసెంబర్ 24న బాలకృష్ణ ‘దాదా’, నాగార్జున ‘కింగ్ 100’ బరిలోకి దిగనున్నాయి. మల్టీప్లెక్స్ స్క్రీన్ల కేటాయింపు, అడ్వాన్స్ బుకింగ్స్ ఈ తెలుగు సినిమాల వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

By - Srikanth Kontham
Update: 2026-11-19 03:02 GMT

2026 డిసెంబర్ బాక్సాఫీస్ వద్ద పోటీ మామూలుగా లేదు. ఒకవైపు టాలీవుడ్ సీనియర్ స్టార్స్ బాక్సాఫీస్ వేటకు సిద్ధమవుతుంటే వారి మధ్యలో హాలీవుడ్ విజువల్ వండర్ `అవెంజర్స్: డూమ్స్ డే` దూసుకొస్తోంది. సింహం గర్జనకు, కింగ్ ఠీవీకి మధ్యలో మార్వెల్ సూపర్ హీరోల హంగామా తోడవడంతో ఉత్కంఠ నెలకొంది. ఓసారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే..

నటసింహం బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న `దాదా` సినిమాపై ఇప్పటికే భారీ అంచ నాలున్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. తమన్ మ్యూజిక్, బాలయ్య మార్క్ పవర్‌ఫుల్ యాక్షన్ సీన్లతో మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించడానికి `దాదా` సిద్ధమ వుతున్నాడు. మ‌రోవైపు కింగ్ నాగార్జున ల్యాండ్ మార్క్ 100వ సినిమా `కింగ్ 100` తో అదే రోజున బరిలోకి దిగు తున్నారు. కార్తీక్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రంలో టబు, ఆశోక్ సెల్వన్ వంటి భారీ తారాగణంతో వస్తున్న సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.

అయితే `దాదా`, `కింగ్ 100` థియేటర్లలోకి రావడానికి సరిగ్గా వారం రోజుల ముందే డిసెంబర్ 17న హాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ `అవెంజర్స్: డూమ్స్ డే` ఇండియాలో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. రుస్సో బ్రదర్స్ దర్శకత్వంలో రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్‌గా ఎంట్రీ ఇస్తుండటంతో సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంది. ఇప్పటికే దేశంలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడం..మల్టీప్లెక్స్ స్క్రీన్లు అన్నీ దాదాపు ఈ సినిమాకే కేటాయించే పరిస్థితి కనిపించడంతో ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఇక్కడ అసలైన సవాల్ ఏంటంటే? మల్టీప్లెక్స్ ఆడియన్స్-యూత్ అంతా `అవెంజర్స్` మాయలో ఉన్న సమయం లో తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఏ మేరకు వసూళ్లను రాబడతాయో. డిసెంబర్ 17న డూమ్స్ డే సునామీ మొదలైతే వారం తర్వాత వచ్చే బాలయ్య `దాదా`, నాగార్జున `కింగ్ 100` చిత్రాలకు థియేటర్ల సర్దుబాటు కీలకంగా మారనుంది. అయితే పండుగ సీజన్ కావడం పైగా సింగిల్ స్క్రీన్లలో తెలుగు సినిమాలకు ఉండే తిరుగులేని ఆదరణ ఈ రెండు చిత్రాలకు ప్లస్ పాయింట్‌గా నిలుస్తుంది.

ఈ నేపథ్యంలో డిసెంబర్ బాక్సాఫీస్ పోరు మరింత రసవత్తరంగా మారనుంది. `అవెంజర్స్: డూమ్స్ డే` మొదటి వారం తర్వాత కూడా అదే స్థాయిలో వసూళ్లను కొనసాగిస్తే మల్టీప్లెక్స్‌లలో షోల సంఖ్యపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. కానీ తెలుగు ప్రేక్షకుల నాడి తెలిసిన బాలకృష్ణ, నాగార్జున చిత్రాలకు ఫ్యామిలీ ..మాస్ ఆడియన్స్ అండగా నిలిస్తే మాత్రం ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతాయి. అంత‌మంగా 2026 ముగింపులో సింహం వేట.. రాజు దర్పం.. సూపర్ హీరోల విన్యాసాలతో థియేటర్ల వద్ద అసలైన సినీ జాతర ఖాయమనిపిస్తోంది.

Tags:    
  • avengersdoomsday 
  • balakrishna 
  • nagarjuna 
  • dada 

Similar News

మన సంస్కృతిని వాళ్ల దగ్గర తక్కువ చేసి మాట్లాడను.. రాధికా ఆప్టే వ్యాఖ్యలపై కీర్తి సురేష్ స్ట్రాంగ్ కౌంటర్!

2026-11-19 03:13 GMT

కొత్త 'జేమ్స్ బాండ్- 007' ఎంపికలో బెజోస్ ఫింగ‌రింగ్ దేనికి?

2026-11-19 03:12 GMT

విజ‌య్ ప్ర‌భుత్వం ఫిల్మీ ఫ్రెండ్లీ విధానాల‌తో కోలీవుడ్‌కి ఊర‌ట

2026-11-19 03:12 GMT

కోట్ల ఆస్తి ఉన్నా.. 4 వేలు ఖరీదు చేసే వాచ్ పెట్టుకోవడం వెనుక కారణం?

2026-11-19 03:11 GMT

ఆ నిర్ణయమే మృణాల్ కెరియర్ను నిలబెట్టిందా?

2026-11-19 03:10 GMT

కాలుష్యంపై అవ‌గాహ‌న‌.. టాలీవుడ్ తార‌లు పూనుకోవాలి!

2026-11-19 03:07 GMT

విలన్ పాత్రల వైపు అడుగులు వేస్తున్న హీరోలు...

2026-11-19 03:07 GMT

దుల్కర్.. హీరోయిన్లకు ఇదేం క్రేజ్!

2026-11-19 03:04 GMT

ఉబర్ డ్రైవర్ గా పనిచేయడం వెనుక అసలు నిజం ఇదే - ప్రొడ్యూసర్ సృజన్!

2026-11-19 03:00 GMT

సంక్రాంతి 'కాకా' పై రూ.150 కోట్ల పందెం..!

2026-11-18 22:30 GMT

టైగ‌ర్ అంటే కాంతకు ఇష్ట‌మేనా?

2026-11-18 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS