• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విలన్ పాత్రల వైపు అడుగులు...

విలన్ పాత్రల వైపు అడుగులు వేస్తున్న హీరోలు...

| హీరోలుగా సక్సెస్ అయిన తర్వాత విలన్ పాత్రలతో తమ నటనలో వైవిధ్యం చూపించేందుకు పలువురు నటులు ఆసక్తి చూపిస్తున్నారు. యశ్, కమల్ హాసన్, నాగార్జున, నాని ఇప్పటికే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో మెప్పించారు. దర్శకులు బలమైన విలన్ క్యారెక్టర్లు రాస్తుండటంతో యంగ్ హీరోలు సైతం ఈ దిశగా అడుగులు వేస్తున్నారు.

By - Gopi Velupala
Update: 2026-11-19 03:07 GMT

అప్పట్లో నటులు తమ కెరీర్ స్టార్టింగ్ లో విలన్ పాత్రలను చేసి ఆ తర్వాత హీరోలుగా అవతరించారు. కానీ ఇప్పుడు కొంతమంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన తర్వాత విలన్లుగా తమ ప్రతిభను చూపిస్తున్నారు. ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ రజనీకాంత్ హీరోగా చేస్తున్న 'ధర్మన్' మూవీలో విలన్ గా నటిస్తున్నాడు. ఇక తనతో పాటుగా మరి కొంతమంది యంగ్ హీరోలు కూడా విలన్ పాత్రలవైపు అడుగులు వేస్తున్నారు...

విలన్ గా చేయడానికి కారణమేంటి?

ప్రతి నటుడు తనలోని అత్యుత్తమమైన నటనను ప్రదర్శించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటారు. దానివల్ల విలన్ గా చేస్తే డిఫరెంట్ క్యారెక్టర్లు సెలెక్ట్ చేయడానికి అవకాశం దక్కుతోంది. కానీ హీరోగా చేసే నటులకు ఎప్పుడు సెటిల్డ్ ఆర్టిస్ట్ గానే గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే వాళ్లు రొటీన్ రెగ్యూలర్ క్యారెక్టర్ లో నటించాల్సిందే. ఎంత చేసినా కూడా మన నటనలో వైవిధ్యాన్ని చూపించే అవకాశం అయితే దొరకదు. విలన్ పాత్రలను చేస్తే డిఫరెంట్ షేడ్స్ లో నటించి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను సంపాదించుకోవచ్చనే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఉన్న చాలా మంది హీరోలు విలన్లుగా అవతరిస్తున్నారు. నటనలో వైవిధ్యాన్ని చూపించడానికి ఇలాంటి కలెక్టర్లను సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు... హీరోలు విలన్లుగా రాణించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. యశ్ ఇప్పటికే రామాయణం సినిమాలో రావణుడి పాత్రలో నటించాడు. విలన్ గా తను నటించిన పాత్ర అద్భుతం అంటూ ఇప్పటికే ప్రశంసలను అందుకుంటున్నాడు. కమల్ హాసన్ సైతం 'కల్కి' సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు... ఇక నాగార్జున సైతం రజినీకాంత్ హీరోగా చేసిన 'కూలీ' సినిమాలో విలన్ పాత్రతో మెప్పించాడు... రాబోయే రోజుల్లో సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలు సైతం విలన్ పాత్రలవైపు ఎక్కువగా అడుగులు వేసే అవకాశం ఉంది. నాని లాంటి హీరో సైతం ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్లో వచ్చిన 'వి' సినిమాలో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాడు...

దర్శకులు బలమైన విలన్ పాత్రలను క్రియేట్ చేస్తున్నారా?

మన దర్శకులు సైతం స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్లను రాసుకోవడంతో మన హీరోలు వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ నెగెటివ్ పాత్రలవైపు అడుగులు వేస్తున్నారు... ప్రస్తుతం ఉన్న రోజుల్లో హీరోలకంటే విలన్లే ఎక్కువ ఫేమస్ అవుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరి చూపు దానిపైనే ఉంది...

Tags:    
  • tollywood 
  • ram 
  • yash 
  • villainroles 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS