• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి...

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

| ఒకప్పుడు సినిమాల్లో లిప్‌లాక్, ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలు పెద్ద చర్చకు దారితీసేవి. ఓటీటీ, అంతర్జాతీయ కంటెంట్ ప్రభావంతో ఇప్పుడు అలాంటి సీన్లు సాధారణంగా మారాయి. మీడియా కూడా వాటిని ప్రత్యేకంగా హైలైట్ చేయడం తగ్గించింది. శారీరక ఆకర్షణ కంటే సహజమైన కెమిస్ట్రీ, భావోద్వేగాలకు మేకర్స్ ప్రాధాన్యం ఇస్తున్నారు.

By - Srikanth Kontham
Update: 2026-11-19 15:30 GMT

ఒకప్పుడు హీరో -హీరోయిన్ల లిప్ లాక్ ఉందన్నా? ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలున్నా? ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడేది. సినిమా సెట్స్ మీద ఉన్న నాటి నుంచే గాసిప్స్ మొదలై థియేటర్లో ప్రేక్షకులు ఆ సీన్ చూసే వరకు రకరకాల చర్చలు నడిచేవి. మీడియాలో ప్రత్యేక కథనాలు.. ఇంటర్వ్యూలలో హీరోయిన్లకు అవే ప్రశ్నలు ఎదురయ్యేవి. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. అలాంటి సన్నివేశాలు తెరపై ఎన్ని వస్తున్నాఏ పరిశ్రమలోనూ వాటి గురించి చర్చ కూడా జరగడం లేదు. నిజానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వచ్చిన తర్వాత ప్రేక్షకుల చూసే విధానం.. ఆలోచనా తీరులో పెద్ద మార్పు వచ్చింది.

అంతర్జాతీయ కంటెంట్..వెబ్ సిరీస్‌ల పుణ్యమా అని బెడ్ రూమ్ సన్నివేశాలు..పెదవి ముద్దులు సాధారణ విషయాలుగా మారిపోయాయి. ఒకప్పుడు వాటిని సాహసంగా చూసిన ప్రేక్షకులు ఇప్పుడు కథలో భాగంగా వచ్చే సన్నివేశాల్లాగే వదిలేస్తున్నారు. నటీనటుల వైపు నుంచి కూడా ఈ విషయంలో పెద్దగా మొహమాటాలు కనిపించడం లేదు. స్టార్ హీరోయిన్ల నుంచి కొత్తగా వచ్చే తారల వరకు స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆ సన్నివేశాల్లో నటించేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో షూటింగ్ స్పాట్‌లోనూ వీటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడం గానీ.. ప్రమోషన్లలో వాటిని హైలైట్ చేయడం గానీ ఎక్కడా కనిపించడం లేదు.

మీడియా వర్గాలు కూడా ఇలాంటి అంశాలపై ఫోకస్ చేయడం తగ్గించేసాయి. ఒకప్పుడు ఏదైనా సినిమాలో ముద్దు సన్నివేశం ఉందంటే అదే పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయ్యేది. కానీ ఇప్పుడు అలాంటి వార్తలకు పాఠకుల నుంచి గానీ.. వీక్షకుల నుంచి గానీ ఎలాంటి ఆసక్తి ఉండటం లేదని గ్రహించిన మీడియా పూర్తిగా కంటెంట్, బాక్సాఫీస్ లెక్కల వైపే దృష్టి సారిస్తుంది. దీంతో మేక‌ర్స్ రొమాంటిక్ యాంగిల్ ని కొత్త‌గా ప్ర‌య‌త్నించాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డు తున్నాయి.

మేక‌ర్స్ శారీరక ఆకర్షణపై కాకుండా పాత్రల మధ్య లోతైన ఎమోషన్..సహజమైన కెమిస్ట్రీని పండించడంపైనే దృష్టి పెడుతున్నారు. కృత్రిమంగా ఇరికించిన ముద్దు సీన్ల కంటే మనసును హత్తుకునే ప్రేమ సన్నివేశాలకే బ్రహ్మరథం పడుతున్నారు. మొత్తానికి పరిశ్రమలో రొమాన్స్ అనేది సంచలనాల స్థాయి నుంచి పరిణతి చెందిన దిశగా అడుగులు వేస్తోందన్నది కాదనలేని నిజం.

Tags:    
  • ottinfluence 
  • romanceincinema 
  • indiancinema 
  • filmscenes 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS