• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వెంకటేష్ చిత్రంలో...

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

| ‘గోపాల గోపాల’లో పాత్రికేయురాలిగా నటించే అవకాశం వచ్చినప్పుడు, సైడ్ క్యారెక్టర్లు చేస్తే హీరోయిన్‌గా ఎదగలేవని చాలామంది తనకు చెప్పారని అనిషా అంబ్రోస్ వెల్లడించింది. అయితే పవన్ కల్యాణ్, వెంకటేష్ వంటి స్టార్లతో నటించే అవకాశం మళ్లీ వస్తుందో లేదోనని, పాత్ర చిన్నదైనా నటిగా తన ప్రతిభ నిరూపించుకోవాలనే ఉద్దేశంతో అంగీకరించినట్లు తెలిపింది.

By - Madhu Reddy
Update: 2026-11-19 13:30 GMT

సాధారణంగా ఒక సినిమాలో అవకాశం లభించడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటిది సీనియర్ స్టార్ హీరోల చిత్రాలలో అవకాశం లభించడం అంటే ఇక దానిని నటీనటులు ఎంత గొప్పగా ఫీల్ అవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాలలో చిన్న పాత్ర పోషించినా చాలు అనుకునే వారు కూడా లేకపోలేదు. అయితే అలాంటిది వెంకటేష్ చిత్రంలో నటించే అవకాశం వస్తే ఒక నటికి ఆయన సినిమాలో నటించొద్దని చెప్పారట . ఈ విషయంపై ఆమె ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది. అయితే వెంకటేష్ నటించిన ఆ చిత్రం ఏమిటి? ఆమె ఏ పాత్రలో నటించింది? ఎందుకు ఆమెను నటించవద్దని చెప్పారు? ఎవరు చెప్పారు? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

 

ఆమె ఎవరో కాదు అనిషా అంబ్రోస్.. మోడల్గా తన కెరీర్ మొదలు పెట్టిన ఈమె.. ఆ తర్వాత నటిగా మారి తెలుగు, మలయాళం , కన్నడ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి చెందిన ఈమె 2013లో తొలిసారి నీలిమ తిరుమల శెట్టి దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం అలియాస్ జానకిలో నటించి తెలుగు చిత్రసీమకు పరిచయమైంది. ఆ తర్వాత అదే ఏడాది పవన్ కళ్యాణ్ ప్రేమలో పడ్డాడు అనే షార్ట్ ఫిలిమ్ లో చేసిన ఈమె మళ్లీ ..2015లో కిషోర్ కుమార్ పార్ధసాని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలసి నటించిన చిత్రం గోపాల గోపాల చిత్రంలో నటించిన. ఇందులో పాత్రికేయురాలు పాత్ర పోషించి ప్రేక్షకులను అలరించింది.

అయితే ఈ పాత్ర లో నటించడానికి అవకాశం రావడంతో చాలా మంది ఈమెకు వీరి సినిమాలో నటించవద్దని సలహా ఇచ్చారట.అయితే ఈ విషయంపై సోనాక్షి మాట్లాడుతూ.. గోపాల గోపాల సినిమా చేస్తున్నప్పుడు చాలామంది ఎందుకు నువ్వు అందులో నటిస్తున్నావు అని ప్రశ్నించారు. నువ్వు హీరోయిన్ గా ఎదగాలి అంటే సైడ్ క్యారెక్టర్స్ చేయకూడదు అని చెప్పారు. అయితే నటన పై నా ఆలోచన పూర్తిగా వ్యతిరేకంగా ఉండేది. నా మైండ్లో ఏముండేదంటే నాకు ఈ అవకాశం మళ్లీ దొరుకుతుందో లేదో. అంటే మళ్లీ వెంకటేష్, పవన్ కళ్యాణ్ చిత్రాలలో నాకు అవకాశం లభిస్తుందో లేదో.. కానీ నాకైతే అవకాశం లభించింది. అది చిన్నదో పెద్దదో.. నేను ఒక నటిని. నా పనిని నేను నిరూపించుకోవాలి. నేను పెద్ద హీరోయిన్ అవ్వాలి. ఓన్లీ హీరోయిన్ పాత్రలే చేయాలి అనే ఆలోచన అప్పుడు కూడా లేదు.. ఇప్పుడు కూడా రాదు" అంటూ పాత్రల ఎంపికపై తన అభిప్రాయాన్ని పంచుకుంది అనిషా అంబ్రోస్. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

నిజానికి స్టార్ హీరోయిన్గా ఎదగాలనుకున్నప్పుడు సైడ్ క్యారెక్టర్స్ చేస్తే ఇక తర్వాత క్యారెక్టర్లు కూడా అదే తరహాలో వస్తాయి అని, హీరోయిన్గా అవకాశాలు రావడం తక్కువే అనే కామెంట్లు ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే కొంతమంది ఒక పాత్రకే పరిమితమై ఎన్నో అవకాశాలను కోల్పోయిన వారు కూడా ఉన్నారు. అందుకే తనకు అలాంటి పరిస్థితులు వద్దు అని, తన వద్దకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను అంటూ చెప్పకనే చెప్పేసింది అనీషా. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Tags:    
  • anishaambrose 
  • gopalagopala 
  • venkatesh 
  • pawankalyan 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS