• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ కుర్రాడు విజయ్ సేతుపతి...

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

| ‘ప్రేమలు’తో గుర్తింపు తెచ్చుకున్న నస్లెన్, ఇప్పుడు సూర్య ‘సీన్’లో సైకో కిల్లర్‌గా నటించి మరో కోణం చూపించారు. ‘బ్యాచిలర్ పార్టీ డ్యూక్స్’తో పాటు ఇతర చిత్రాల్లోనూ విభిన్న పాత్రలు ఎంచుకుంటున్నారు. హీరో ఇమేజ్‌కే పరిమితం కాకుండా పాత్రలకు ప్రాధాన్యమిస్తున్న ఆయన ప్రయాణం విజయ్ సేతుపతిని గుర్తు చేస్తోంది. అయితే వరుస విలన్ పాత్రలతో హీరోగా సంపాదించుకున్న గుర్తింపు తగ్గకుండా జాగ్రత్తపడాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

By - M Prashanth
Update: 2026-11-19 21:06 GMT

'ప్రేమలు'లో అమాయకమైన లవర్ బాయ్‌గా కనిపించిన నస్లెన్ ఇప్పుడు సూర్యకే విలన్‌గా మారిపోయారు. 'సీన్' సినిమాలో ఈశ్వరన్ పాత్రతో తనలోని మరో యాంగిల్ చూపించారు. అంతకుముందు 'లోకా'లో కళ్యాణి ప్రియదర్శన్‌తో కలిసి నటించారు. ఇప్పుడు 'బ్యాచిలర్ పార్టీ డ్యూక్స్'లోనూ పెద్ద తారాగణంతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. హీరోగా మంచి క్రేజ్ వచ్చినా సోలో సినిమాల కోసమే ఎదురుచూడకుండా ఇలా విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటున్న తీరు చూస్తుంటే విజయ్ సేతుపతి గుర్తుకొస్తున్నారు.

విజయ్ సేతుపతి కూడా తన కెరీర్‌లో హీరో పాత్రలకే పరిమితం కాలేదు. '96'లో ప్రేమికుడిగా మెప్పించిన ఆయన 'విక్రమ్ వేద', 'మాస్టర్', 'విక్రమ్', 'జవాన్' సినిమాల్లో నెగెటివ్ పాత్రలతో అదరగొట్టారు. మరోవైపు 'మహారాజ'తో సోలో హీరోగానూ భారీ విజయం అందుకున్నారు. స్టార్ హీరోలతో కలిసి నటించడానికి ఎప్పుడూ వెనకాడలేదు. పాత్ర నచ్చితే తన ఇమేజ్ గురించి పెద్దగా పట్టించుకోకుండా సినిమాలు చేయడం సేతుపతికి బాగా కలిసొచ్చింది.

ఇప్పుడు నస్లెన్ కూడా దాదాపు అలాంటి రూట్‌లోనే వెళ్తున్నారు. 'ప్రేమలు'తో యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించిన తర్వాత వరుస ప్రేమకథలు చేసే అవకాశం ఉన్నా, సూర్య 'సీన్'లో సైకో కిల్లర్ పాత్రకు ఓకే చెప్పారు. దర్శకుడు జీతూ మాధవన్ కూడా నస్లెన్ లాంటి యంగ్ హీరో ఈ పాత్రకు అంగీకరిస్తారా అని మొదట అనుకున్నారట. కానీ నస్లెన్ తన కొత్త ఇమేజ్‌ను వదిలి ఇంత డార్క్ క్యారెక్టర్ చేయడం విశేషం.

అయితే విజయ్ సేతుపతి జర్నీలో నస్లెన్ నేర్చుకోవాల్సిన మరో విషయం కూడా ఉంది. ఒక దశలో సేతుపతికి విలన్ ఆఫర్లు ఎక్కువయ్యాయి. స్టార్ హీరోల సినిమాల్లో తన సన్నివేశాలు ఎడిటింగ్‌లో తగ్గిపోయిన సందర్భాలున్నాయని కూడా చెప్పారు. దీంతో కొంతకాలం విలన్ పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. నస్లెన్ కూడా వరుసగా పెద్ద హీరోల సినిమాల్లో విలన్ పాత్రలు చేస్తే, హీరోగా సంపాదించుకున్న గుర్తింపు కంటే నెగెటివ్ క్యారెక్టర్లకే డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది.

ఇక నస్లెన్‌తో వర్క్ చేస్తున్న దర్శకుల లిస్ట్ కూడా పెరుగుతోంది. 'ఆవేశం' ఫేమ్ జీతూ మాధవన్ తర్వాత అమల్ నీరద్ దర్శకత్వంలో 'బ్యాచిలర్ పార్టీ డ్యూక్స్' చేశారు. ఇందులో సోనీ పాత్రలో కనిపించారు. కుంచాకో బోబన్, సౌబిన్ షాహిర్, షరాఫుద్దీన్ వంటి నటులు కూడా ఉన్నారు. మరోవైపు 'కుంబళంగి నైట్స్' దర్శకుడు మధు సి. నారాయణన్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమాలోనూ నస్లెన్ నటించారు. ఆ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.

Tags:    
  • naslen 
  • vijaysethupathi 
  • premalu 
  • suriya 
  • malayalamcinema 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

Copyright @2026

Powered by Blink CMS