• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ...

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

| పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి బాబా జయంతి వేడుకల్లో రష్మిక మందన్న పాల్గొని ప్రత్యేక ప్రసంగం చేశారు. విజయ్ దేవరకొండ కుటుంబం ద్వారా తనకు స్వామి బోధనలతో పరిచయం ఏర్పడిందని, ప్రేమ, కరుణ, ధైర్యం మహిళల బలమని పేర్కొన్నారు. మహిళలు ఏది భరించాలి, ఏది భరించకూడదో నిర్ణయించుకునే ధైర్యం కలిగి ఉండాలని అన్నారు. ఆమె ధరించిన హారం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

By - Sivaji Kontham
Update: 2026-11-19 21:12 GMT

రష్మిక మందన్న ప‌బ్లిక్ ప‌ర్య‌ట‌న‌లు, స్పీచ్ లు ఇటీవ‌లి కాలంలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారాయి. ఇటీవ‌ల విజ‌య్ దేవ‌ర‌కొండ సొంత గ్రామంలో విద్యార్థుల‌కు స్కాల‌ర్ షిప్‌లు అందించిన‌ప్పుడు.. ఆ త‌ర్వాత ర‌క‌ర‌కాల వేడుక‌ల‌లో ర‌ష్మిక స్పీచ్ లు ఆక‌ట్టుకున్నాయి. తాజాగా పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి బాబా జయంతి వేడుకల్లో పాల్గొని ఈ న‌టి ప్రత్యేక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం... ఆధ్యాత్మిక ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసారు. తన బెస్ట్ ఫ్రెండ్, పార్ట్‌నర్ విజయ్ దేవరకొండ.. తాను పెళ్లాడిన‌ కుటుంబం ద్వారానే తనకు పుట్టపర్తి.. స్వామి వారి బోధనలతో పరిచయం ఏర్పడిందని రష్మిక తెలిపారు. విజయ్, ఆనంద్ ఇద్దరూ స్వామి విద్యాసంస్థల్లో చదువుకున్న విద్యార్థులని.. తన అత్తమామలు కూడా స్వామికి పరమ భక్తులని ర‌ష్మిక‌ ఎంతో ఆప్యాయంగా గుర్తు చేసుకున్నారు.

స్వామి బోధనలు కేవలం మాటలు మాత్రమే కాదని.. అవి ఒక అద్భుతమైన జీవన విధానమని తాను గ్రహించినట్లు రష్మిక పేర్కొన్నారు. స్వామి చెప్పిన ప్రతి మాట తన కోసమే చెప్పినట్లుగా అనిపించి.. తనపై గాఢమైన ప్రభావాన్ని చూపిందని అన్నారు. కొన్ని వారాల క్రితమే పుట్టపర్తికి వచ్చే అదృష్టం తనకు కలిగిందని ``మీరు నా వైపు ఒక అడుగు వేస్తే.. నేను మీ వైపు వంద అడుగులు వేస్తాను`` అన్న స్వామి మాటల ప్రకారమే తాను మళ్లీ ఇక్కడికి రాగలిగానని భక్తిభావంతో వివరించారు.

ఇక మహిళా సాధికారత- స్త్రీ శక్తి గురించి మాట్లాడుతూ రష్మిక ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఆధ్యాత్మికంగా, భావోద్వేగంగా దృఢంగా ఉంటూ సామాజిక బాధ్యతతో మెలగాలని స్వామి ఆశించారని తెలిపారు. ప్రేమ, కరుణ, సహనం, త్యాగం, ధైర్యం వంటి స్త్రీ సహజ లక్షణాలు ఎప్పటికీ బలహీనతలు కావని.. అవి అసాధారణ మహిళల గొప్ప లక్షణాలని స్పష్టం చేశారు. నేటి తరం మహిళలు పెద్ద కలలు కంటూనే తమ ఎంపికలను సమర్థించుకోవాల్సిన.. అవకాశాలకు తాము అర్హులమని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు.

మహిళల అసలైన బలం అంటే కేవలం అన్నింటినీ భరించడం మాత్రమే కాదని.. వేటిని భరించకూడదో ఎంచుకునే ధైర్యంలోనూ ఉంటుందని రష్మిక అభిప్రాయపడ్డారు. నేడు వ్యాపారాలు, సైన్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలన, క్రీడలు, కళలు ఇలా అన్ని రంగాలలో భారతీయ మహిళలు అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ దూసుకుపోతున్నారని హర్షం వ్యక్తం చేశారు. మహిళా సాధికారత అనేది దేశాభివృద్ధిలో కీలక భాగమని.. స్వామి బోధనలు ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయని రష్మిక తన ప్రసంగాన్ని ముగించారు. అయితే ఈ ప్ర‌సంగం ఆద్యంతం ర‌ష్మిక మంద‌న్న ధ‌రించిన మెడ‌లోని క‌డియం లాంటి హారం అంద‌రి దృష్టిని ప్ర‌త్యేకంగా ఆక‌ర్షించింది.

Tags:    
  • rashmikamandanna 
  • vijaydeverakonda 
  • puttaparthi 
  • srisathyasaibaba 
  • saibaba 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS