రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!
| దర్శకుడు నితీష్ తివారి బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డు సృష్టించినట్లు కథనం పేర్కొంది. ‘దంగల్’తో పాటు ‘రామాయణం పార్ట్ 1’ కూడా భారీ వసూళ్లు సాధించడంతో, రెండు సినిమాలతో రూ.1,500 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకున్న ఏకైక భారతీయ దర్శకుడిగా నిలిచారు. మరోవైపు మహేశ్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ ఈ రికార్డును సమం చేస్తుందా అన్న ఆసక్తి నెలకొంది.
ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులలో రాజమౌళికి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో రెండు సార్లు వెయ్యి కోట్ల మార్కును అందుకున్నారు. ఇప్పుడు మహేష్ బాబుతో 'వారణాసి' తెరకెక్కిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి కూడా రాజమౌళి సరసన చేరిపోయారు. అంతేకాదు, వెయ్యి కోట్ల క్లబ్‌ను దాటి రాజమౌళి కూడా ఇప్పటివరకు అందుకోలేని మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.
ఆమిర్ ఖాన్‌తో నితీష్ తివారి తెరకెక్కించిన 'దంగల్' ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.2070 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు 'రామాయణం పార్ట్ 1' కేవలం 14 రోజుల్లోనే రూ.1500 కోట్ల మార్కును దాటేసింది. దీంతో రెండు సినిమాలతో రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఏకైక భారతీయ దర్శకుడిగా నితీష్ తివారి నిలిచారు. రాజమౌళి 'బాహుబలి 2' దాదాపు రూ.1800 కోట్లు సాధించినప్పటికీ, 'ఆర్ఆర్ఆర్' వసూళ్లు రూ.1230 కోట్ల దగ్గరే ఆగిపోయాయి.
ముఖ్యంగా నితీష్ తివారి సాధించిన ఈ రెండు విజయాల వెనుక పూర్తిగా డిఫరెంట్ కథలున్నాయి. 'దంగల్' ఒక రెజ్లింగ్ క్రీడాకారుల జీవితకథ ఆధారంగా తెరకెక్కింది. భారీ యాక్షన్ సన్నివేశాలు, గ్రాఫిక్స్ లేకుండానే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు 'రామాయణం' కోసం భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించారు. రెండు సినిమాల మధ్య పదేళ్ల గ్యాప్ ఉన్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం నితీష్ తివారి తన సత్తా చాటుకున్నారు.
ఇక వసూళ్లు వచ్చిన మార్కెట్ల విషయంలోనూ పెద్ద తేడా ఉంది. 'దంగల్' రూ.2000 కోట్ల మార్కును అందుకోవడంలో చైనా ప్రేక్షకులు కీలక పాత్ర పోషించారు. అక్కడి నుంచే రూ.1300 కోట్లకు పైగా వచ్చాయి. కానీ 'రామాయణం' చైనా రిలీజ్ లేకుండానే రూ.1500 కోట్లు దాటింది. ఇండియాలోనే వెయ్యి కోట్ల గ్రాస్ సాధించడం విశేషం. విదేశాల్లోనూ మంచి కలెక్షన్లు వస్తున్నాయి. పైగా ఇంత తక్కువ సమయంలో ఆ మార్కును అందుకోవడం మరో రికార్డు.
మరోవైపు రాజమౌళికి ఇప్పుడు 'వారణాసి' రూపంలో ఈ రికార్డును అందుకునే అవకాశం ఉంది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ఈ సినిమాను అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 20270 ఏప్రిల్ 7న విడుదలకు ప్లాన్ చేశారు. 'బాహుబలి 2' తర్వాత మరోసారి రూ.1500 కోట్ల మార్కును అందుకుంటే నితీష్ తివారితో రాజమౌళి సమానంగా నిలుస్తారు.
ఇక నితీష్ తివారికి 'రామాయణం పార్ట్ 2' రూపంలో మూడో భారీ విజయం సాధించే అవకాశం కూడా ఉంది. మొదట 2027లో విడుదల చేయాలనుకున్న ఈ చిత్రాన్ని 2028 దీపావళికి వాయిదా వేశారు. నిర్మాత నమిత్ మల్హోత్రా రెండో భాగాన్ని మరింత భారీ స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొంత షూటింగ్ కూడా పూర్తయింది. మొదటి భాగం సాధించిన రికార్డులతో రెండో భాగంపై అంచనాలు పెరిగాయి. 'వారణాసి' విడుదలైన తర్వాత ఏడాదిన్నర గ్యాప్‌తో 'రామాయణం 2' థియేటర్లలోకి రానుంది.