• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  Box Office >  సంక్రాంతి 'కాకా' పై...

సంక్రాంతి 'కాకా' పై రూ.150 కోట్ల పందెం..!

| బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ 2027 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాకు సుమారు రూ.150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు వెంకటేష్, కళ్యాణ్ రామ్ నటిస్తున్న అనిల్ రావిపూడి సినిమా కూడా పోటీలో ఉండటంతో సంక్రాంతి బాక్సాఫీస్ పోరు ఆసక్తికరంగా మారనుంది.

By - Ramesh Palla
Update: 2026-11-18 22:30 GMT

2027 సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ సినిమాతో నిలవడం కన్ఫర్మ్ అయింది. బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా గతంలో వచ్చిన సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈసారి అంతకు మించి అన్నట్లుగా ఖర్చు చేసి కాకా సినిమాను రూపొందించడం జరిగింది. కాకా సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్‌, సర్‌ప్రైజింగ్‌ వీడియో, కొన్ని లీక్స్‌ అన్నింటిని పరిశీలిస్తే మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి సంక్రాంతికి హిట్‌ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి మన శంకరవరప్రసాద్‌ గారు సినిమాతో వచ్చి హిట్‌ కొట్టిన విషయం తెల్సిందే. అందుకే మరోసారి సంక్రాంతికి చిరంజీవి పై చేయి సాధించడం ఖాయం అని అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. కేవలం ప్రేక్షకులు, అభిమానులు మాత్రమే కాకుండా బయ్యర్లు సైతం కాకా పై చాలా నమ్మకం పెట్టుకున్నట్లుగా ఇప్పటికే జరిగిన ప్రీ రిలీజ్‌ బిజినెస్ చూస్తే అర్థం అవుతోంది.

చిరంజీవి కాకా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌...

కాకా సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్ లెక్కలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమా భారీ మొత్తంలో ప్రముఖ నిర్మాత కొనుగోలు చేయడం ద్వారా బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ భారీ మొత్తంలో ఉంది. ఇక సీడెడ్‌, ఆంధ్రాలోనూ ప్రముఖ నిర్మాతలు పంపిణీ హక్కులు కొనుగోలు చేసేందుకు కర్ఛీఫ్‌ వేసి మరీ కూర్చున్నట్లు తెలుస్తోంది. షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయిందని, డిసెంబర్‌ మొదటి వారంకు ఫస్ట్‌ కాపీ సైతం రెడీ చేసి, ప్రమోషన్స్ మొదలు పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. సంక్రాంతి సినిమా అంటే ప్రమోషన్ ఎక్కువగా ఉండాలి. అందుకే పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు బాబీ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇదే సమయంలో సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి కూడా ప్రముఖంగా చర్చ జరుగుతోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న కాకా సినిమా సంక్రాంతికి భారీ మొత్తంలో రాబట్టాల్సి ఉంది.

సంక్రాంతికి వచ్చిన మనశంకరవరప్రసాద్‌ గారు...

ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి 'మన శంకరవరప్రసాద్‌ గారు' సినిమా వరల్డ్‌ బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. కనుక కాకా సినిమా ఆ స్థాయి వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. చిరంజీవికి ఉన్న స్టామినా, ఆయన బాక్సాఫీస్ రికార్డ్‌ల నేపథ్యంలో సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తే చాలు ఈజీగా రూ.200 కోట్ల మార్క్‌ ను చేరే అవకాశాలు ఉన్నాయి. ఇక హిట్‌ టాక్‌ వస్తే రూ.250 కోట్లు వసూళ్లు సాధించవచ్చు. కానీ సినిమాకు రూ.150 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక సినిమా బ్రేక్ ఈవెన్‌ కి రూ.150 కోట్ల వసూళ్లు చాలు అనేది విశ్లేషకుల మాట. సంక్రాంతికి ఇతర సినిమాల నుంచి పోటీ గట్టిగా ఉంటే, అవతలి సినిమాలు హిట్‌ సాధిస్తే రూ.150 కోట్లు అనేది పెద్ద సంఖ్య అవుతుంది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో మన శంకరవరప్రసాద్‌ గారు సినిమాది పై చేయి అయింది. కనుక రూ.300 కోట్లు సాధ్యం అయింది.

అనిల్ రావిపూడి జనవరి 12 విడుదల...

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌, కళ్యాణ్‌ రామ్‌లు హీరోలుగా రూపొందుతున్న 'జనవరి 12 విడుదల' నుంచి కాకా సినిమాకు గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడబోతున్నాయి. ఈ రెండు సినిమాలు సైతం హిట్‌ అయ్యే మెటీరియల్‌తో రూపొందుతున్నాయని, ఈ రెండు సినిమాలు కూడా గెలుపు గుర్రాలే అనే అభిప్రాయం ఉంది. కనుక సంక్రాంతికి జరిగే కోళ్ల పందాల కంటే బాక్సాఫీస్‌ వద్ద జరిగే ఈ పోటీ మరింత రసవత్తరంగా ఉండే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జనవరి 12 విడుదల పై ఉన్న పందెం ఎంత అనే విషయంలో స్పష్టత రాలేదు, కానీ కాకా సినిమా పై మాత్రం దాదాపు రూ.150 కోట్ల పందెం ఉంది. మరి ఈ పందెంలో కాకా గెలిచి ఆ మొత్తం ను సాధించేనా చూడాలి. కాకా సినిమాలో చిరంజీవి లుక్‌ పై ఇప్పటికే మెగా ఫ్యాన్స్ ఫుల్‌ హ్యాపీగా ఉన్నాడు. ప్రమోషన్స్ స్టార్ట్‌ అయితే సినిమా రేంజ్‌ మరింత పెరగడం ఖాయం.

Tags:    
  • chiranjeevi 
  • kaaka 
  • sankranthi2027 
  • bobby 
  • anilravipudi 
  • venkatesh 

Similar News

'అవెంజర్స్' బుకింగ్స్ చూస్తే మన నిర్మాతలకు ఓ ప్రశ్న!

2026-11-17 10:02 GMT

డిసెంబర్ బరి నుంచి తప్పుకున్న సింహం!

2026-11-17 05:39 GMT

డబ్బింగ్ సినిమాల జోరు.. తెలుగు చిన్న సినిమాలకు థియేటర్లలో కష్టాలు!

2026-11-17 04:00 GMT

తండ్రీకొడుకుల బాక్స్ ఆఫీస్ క్లాష్!

2026-11-16 22:30 GMT

రామాయణ చైనీస్ వర్షన్ రెడీ అవుతుందట!

2026-11-16 19:05 GMT

ఈ వారం బాక్సాఫీస్ క్లాష్.. పరిస్థితి ఎలా ఉంది?

2026-11-16 10:25 GMT

నైజాం.. జాగ్రత్త పడకపోతే అంతే!

2026-11-16 04:30 GMT

రామాయ‌ణ‌: 10రోజుల్లో 1200 కోట్లు.. 2000 కోట్ల క్ల‌బ్ ఇంకెంత దూరం?

2026-11-15 09:42 GMT

కంటెంట్ యుద్ధం.. ఎవరిదో విజయం?

2026-11-15 00:30 GMT

తెలుగు రైట్స్‌లో టాప్ సినిమాలు.. 'వారణాసి' ఎంత తేవాలి?

2026-11-14 04:20 GMT

1000 కోట్ల క్లబ్.. హీరోగా ఒకటి.. విలన్‌గా మరొకటి

2026-11-13 06:47 GMT

Copyright @2026

Powered by Blink CMS